RangaReddy

News April 8, 2024

BRS కంటోన్మెంట్ టికెట్.. ఆ ముగ్గురికి మళ్లీ నిరాశే!

image

BRS కంటోన్మెంట్ టికెట్ ఆశిస్తున్న ముగ్గురు లీడర్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. గజ్జెల నగేశ్, మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో TDP నుంచి గెలుపొందిన సాయన్న ఆ తర్వాత BRSలో చేరారు. 2018లో సాయన్నకే KCR టికెట్ ఇచ్చారు.ఆ తర్వాత ఆయన చనిపోవడంతో, 2023 ఎన్నికల్లో సాయన్న బిడ్డ లాస్య నందితకు టికెట్ ఇవ్వగా ఆమె చనిపోయారు. తాజాగా నివేదితకు టికెట్ ఇవ్వనున్నారు.

News April 8, 2024

HYD: రూ.7,30,400 నగదు సీజ్: రోనాల్డ్ రాస్

image

HYDలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.7,30,400 నగదు, రూ.11,62,203 విలువ గల ఇతర వస్తువులను, 386.73 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 8 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపారు. 4 FIRలు నమోదు చేసినట్లు చెప్పారు. 12 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు.

News April 8, 2024

HYD: ఆర్టీసీని వేధిస్తున్న సిబ్బంది కొరత!

image

ఆర్టీసీలో పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో సంస్థలో ఖాళీలు పెరుగుతున్నాయి.రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య సగటున రోజుకు అరకోటి దాటుతోంది. HYDలోనూ రద్దీ ఉంది. మరోవైపు సంస్థలో పలువురు ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు.ఈఏడాది ఏప్రిల్-డిసెంబరు మధ్య మరో1,354 మంది పదవీ విరమణ కానున్నారు. ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.

News April 8, 2024

HYD ప్రజలకు GOOD NEWS.. తగ్గనున్న ఎండ!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలకు ‘తెలంగాణ వెదర్ మెన్’ X వేదికగా గుడ్ న్యూస్ తెలిపింది. వడగాలులు తీవ్రత తగ్గుముఖం పట్టడంతో.. నేడు ఉష్ణోగ్రతలు పడిపోయినట్లుగా తెలియజేసింది. రాబోయే వారం పాటు ఉష్ణోగ్రతలు తగ్గి, ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుందని పేర్కొంది.  

News April 8, 2024

హైదరాబాద్ గడ్డ.. BRS అడ్డా: MP అభ్యర్థి

image

లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని BRS నేతలు తెలిపారు. సోమవారం గోషామహల్‌ పరిధి గన్‌ఫౌండ్రిలో BRS సమావేశం జరిగింది. ఈ సందర్భంగా BRS HYD అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ గడ్డ.. BRS అడ్డా అని అన్నారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. KCRతోనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు.

News April 8, 2024

HYD: చెరువుల్లో గుర్రపు డెక్క సమస్య..!?

image

గ్రేటర్ HYDలో మొత్తం 185 చెరువులు ఉండగా వాటిలోని 50 తటాకాల్లో ప్రస్తుతం గుర్రపు డెక్క మొక్క దాదాపు 100% పరుచుకొని ఉంది. రెండేళ్లుగా ఆయా చెరువుల్లో గుర్రపు డెక్క వ్యర్థాలను తొలగించేందుకు తూతూ మంత్రంగా పనులు జరగగా.. దీనికి తోడు గుర్రపు డెక్కను తొలగించే FTC యంత్రాల కాంట్రాక్ట్ ఫిబ్రవరితో పూర్తయింది. దీంతో ఆ కొద్దిపాటి పనులు సైతం మూలన పడ్డాయి. మరీ అన్ని చెరువుల్లో ఎప్పుడు తొలగిస్తారో..? వేచి చూడాలి.

News April 8, 2024

RR: మామిడి తోటలపై ఎండ ప్రభావం..!

image

ప్రస్తుతం RR జిల్లాలో 22.08 ఎకరాల విస్తీర్ణంలో మామిడి పంట సాగువుతోంది. మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో అంతంత మాత్రంగానే సాగవుతున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాభావ పరిస్థితులకు తోడుగా ఎండ దెబ్బ శాపంగా మారింది. నీరు సరిపడా అందకపోవడం, అధిక ఉష్ణోగ్రతల వల్ల చెట్లు ఎండిపోవడంతో పాటు, తెగుళ్లు వ్యాప్తిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. బూడిద, పిండి నల్లి పురుగులు అధికంగా ఉన్నాయన్నారు.

News April 8, 2024

RR: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద స్కానింగ్!

image

RR, MDCL,VKB జిల్లాల్లో రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో గతంలో కొన్ని నిబంధనలు ఉండేవి. ఆధార్ నంబర్, మొబైల్ ఫోనుకు వచ్చే ఓటీపీ ద్వారా కొనుగోళ్లు జరిగేవి. అయితే అక్రమాలను అరికట్టేందుకు యాసంగి సీజన్ నుంచి (ఐరస్)కనుపాప స్కానింగ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇప్పటికే కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ కూడా అందజేశారు. దీన్ని అన్ని కేంద్రాల వద్ద అమలు చేయనున్నారు.

News April 8, 2024

RR: కేసులు పెండింగ్.. నూతన కమిషన్ కోసం డిమాండ్!

image

కేసుల సత్వర పరిష్కారం దిశగా RR జిల్లా వినియోగదారుల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. గత 55 రోజుల్లోనే చాలా కేసులను పరిష్కరించినట్లుగా తెలిపింది. రంగారెడ్డి జిల్లా కమిషన్‌లో రాష్ట్రంలోనే అధిక కేసులు నమోదవుతుంటాయి. మరోవైపు మార్చి నెల చివరి నాటికి రంగారెడ్డి జిల్లా కమిషన్‌లో రాష్ట్రంలోనే అధికంగా 1,405 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో నూతన కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

News April 8, 2024

HYD: మరో 2 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలోనూ!

image

HYDలో గత BRS ప్రభుత్వం గాంధీ దవాఖానకు సుమారు రూ.16 కోట్లతో అత్యాధునిక MRI యంత్రాన్ని సమకూర్చింది. దీంతో ప్రస్తుతం గాంధీలో MRI సేవలు అందిస్తున్నారు. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రికి సైతం గత ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతుండగా.. మరో 2 నెలల్లో MRI స్కానింగ్ యంత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు.