India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, RR, MDCL,VKB జిల్లాల్లో నేటి నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు రోజుకు రెండుసార్లు పార్లమెంట్ నియోజకవర్గాల్లో NSUI ప్రచారం చేయాలని నిర్ణయించింది. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రోగ్రాంలో కాంగ్రెస్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, డివిజన్ నేతలు, తదితరులు అందరూ పాల్గొననున్నారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ఫుల్ ఫోకస్ పెట్టామని నేతలు తెలిపారు.
ఐటీ కారిడార్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే క్రమంలో గత BRS ప్రభుత్వం కోకాపేటలో సుమారు 534 ఎకరాల విస్తీర్ణంలో కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌ను HYD మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టింది. ఇందులో భాగంగానే కోకాపేట నియో పోలీస్ లేఅవుట్‌ను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న ORR ట్రంపెట్ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. దీనిపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ HYDలో బీర్ల అమ్మకాలు పెరిగాయి. లిక్కర్‌కు బదులు చల్లటి బీర్ల వైపు మందుబాబులు మొగ్గు చూపుతున్నారు. ప్రతిరోజు గ్రేటర్‌లో 60 నుంచి 80 వేల కేసులకు పైగా బీర్లు అమ్ముడవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 20 వేల కేసులకు డిమాండ్ ఉన్నప్పటికీ కొరత దృష్ట్యా వినియోగదారులకు అందడం లేదని టాక్. ఏప్రిల్ నెలలోనే కొరత ఇలా ఉంటే మే నెలంతా బీర్ల డిమాండ్‌ను ఎదుర్కోవడం ఎలా అని వ్యాపారులు అంటున్నారు.
ప్రేమిస్తున్న యువతి తనను తిరస్కరించిందని ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు.. అల్లీనగర్‌లో ఉండే సయ్యద్ షరీఫ్ కుమారుడు సోహెల్(20) మామిడిపల్లిలో ఓ కంపెనీ ఉద్యోగి. స్థానికంగా ఓ యువతిని అతడు ప్రేమిస్తున్నాడు. ఈనెల 6న ఆ యువతిని కలిసి ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఆమె తిరస్కరించడంతో ఉరేసుకుని చనిపోయాడు.
స్టార్టప్‌లతో యువతరాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో టీ-హబ్ వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా యంగ్ ఎకో స్టార్టప్స్ కాన్‌ప్లుయెన్స్ పేరుతో ఈనెల 28, 29 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సెంటర్ ఫర్ గ్లోబల్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ సహకారంతో ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నామని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://bit.ly/3U2WKGr దరఖాస్తు చేసుకోవాలన్నారు.
HYD కేబుల్ బ్రిడ్జ్‌పై శుక్రవారం అర్ధరాత్రి సెల్ఫీ దిగుతున్న ఇద్దరినీ కారు ఢీకొట్టగా అందులో ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. కారును అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన మాదాపూర్ మస్తాన్ నగర్ వాసి నవీన్(22)తోపాటు, కారులో ఉన్న తన స్నేహితుడు, యూసుఫ్‌గూడ వాసి మెరాజ్(24)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారికి 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.
లంచం తీసుకుంటూ ఇటీవల ACBకి పట్టుబడిన HYD మాదాపూర్ SI రంజిత్ కుమార్, కానిస్టేబుల్ విక్రమ్‌ను ACB అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లి ACB కోర్టులో వారిని హాజరుపరచగా న్యాయమూర్తి ఇద్దరికీ 45 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు పంపారు. SI రంజిత్ IIT ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేయడం విశేషం. తర్వాత సివిల్స్ 2 సార్లు రాశారు. మెయిన్స్‌లో విఫలమవగా అనంతరం SI పరీక్షలు రాసి 2020లో జాబ్ పొందాడు.
HYDలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. మేడ్చల్ PS పరిధి మురహరిపల్లి హనీ బర్గ్ రిసార్ట్ సమీపంలో బిహార్ రాష్ట్రానికి చెందిన మనీశ్ వాష్మాన్(35)ను బండరాయితో కొట్టి దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా చికెన్ ధర ప్రస్తుతం రూ.294 పలుకుతోంది. వారంలోనే ఏకంగా రూ.50 పెరగడంతో మధ్య తరగతి వాళ్లు కొనేందుకు వెనకాడుతున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతకు కోళ్లు చనిపోతుంటాయి. దీనికి తోడు పెళ్లిళ్లు, రంజాన్ నేపథ్యంలో ఎక్కువగా చికెన్ వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. మరో వారంలో చికెన్ ధర రూ.350 వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఇప్పటి వరకు రూ.12.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.1,73,60,502 విలువ జేసే ఇతర వస్తువులు, 19,380 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.