India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉ.11 గంటల వరకు HYDలో 10.70, మల్కాజిగిరిలో 15.05, సికింద్రాబాద్ 15.77, చేవెళ్ల 20.35 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 16.34 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు.
టాలీవుడ్ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు వచ్చారు. ఆయన సతీమణి కూతురు, కుమారుడితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బూత్ నంబర్ 248లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉ.9 గంటల వరకు HYDలో 5.06, మల్కాజిగిరిలో 6.20, సికింద్రాబాద్ 5.40, చేవెళ్ల 8.29 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 6.28 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు.
గుండెపోటుతో ఎలక్షన్ ఆఫీసర్ మృతి చెందిన ఘటన HYDలో వెలుగుచూసింది. చంపాపేట్ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నరసింహ MP ఎన్నికల నేపథ్యంలో రెడ్‌హిల్స్‌లోని కేంద్రానికి ఆదివారం సా. పోలింగ్ సామాగ్రితో విధులకు హాజరయ్యారు. ఉక్కపోతగా ఉందని ఓ ఫ్యాన్ వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇతర సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
రాజధాని నగరం ఓటుకు సిద్ధమైంది. కోటి పదిలక్షల మంది ఓటర్లు హక్కును వినియోగించుకోనున్నారు. HYD, SEC, చేవెళ్ల, మల్కాజిగిరి MP స్థానాల్లో 140 మంది ఎంపీ అభ్యర్థులు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏ ఎన్నికలైనా పోలింగ్ శాతంలో రాజధాని మాత్రం చివరిలో నిలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో HYDలో 44.84%, మల్కాజిగిరిలో 49.63%, సికింద్రాబాద్‌లో 46.50%, చేవెళ్లలో 53.25% నమోదు కావడం గమనార్హం. పోలింగ్ శాతం పెంచేలా EC అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ప్లే స్టోర్‌లో VOTER HELPLINE యాప్ తీసుకొచ్చారు. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసి మీ పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలుసుకోండి. HYD పరువు తీయకండి. ఇకనైనా ఓటేయండి.
ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా వేలికి పెట్టుకునే సిరాని 1990 నుంచి HYDలోనూ తయారు చేయటం ప్రారంభించారు. ఉప్పల్‌లోని రాయుడు ల్యాబొరేటరీస్ అనే సంస్థ ఈ సిరాని తయారు చేస్తోంది. సుమారు 100 దేశాలకు ఈ సిరాని ఎగుమతి చేస్తోంది. దాదాపు 100 దేశాలకు ఈ సిరాను సరఫరా చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. HYD ఎంపీ స్థానంలో 2019లో 44.84 శాతం పోలింగ్ నమోదవగా మల్కాజిగిరిలో 49.63, సికింద్రాబాద్‌లో 46.50, చేవెళ్లలో 53.25 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.
రేపు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో పలువురు సినీ సెలబ్రిటీలు ఓటు వేయనున్నారు. షేక్‌పేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రాజమౌళి దంపతులు, గచ్చిబౌలిలో హీరో నాని, ఫిలింనగర్‌లోని ఫిలిం ఛాంబర్ పక్కన గల FMCCలో రాఘవేంద్ర, విశ్వక్‌సేన్, రానా, సురేశ్ బాబు, న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో రవితేజ సహా పలువురు ప్రముఖులు ఓటేయనున్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా HYDలో ఇప్పటివరకు రూ.23,84,36,012 నగదు, రూ.26,03,12,917 విలువ గల ఇతర వస్తువులు, 27,715.965 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. అక్రమ మద్యం అరికట్టడంలో భాగంగా 354 మందిపై కేసులు నమోదు చేసి 356 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.