RangaReddy

News May 12, 2024

BREAKING: HYDలో స్టూడెంట్ SUICIDE

image

HYD ఘట్‌కేసర్ PS పరిధి ఘనపూర్‌లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒకేషనల్ కోర్సు అయిన MPHWలో మార్కులు తక్కువ వచ్చాయని మానసిక వేదనతో కాసర్ల స్వప్న‌(20) అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వప్న తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో ఆమె తండ్రి సతీశ్ 2009లో ఘనపూర్‌లోని హ్యాపీ ఆర్ఫన్ హోంలో చేర్పించాడు. 1000కి 700 మార్కులే వచ్చాయని ఆమె సూసైడ్ చేసుకుంది. కేసు నమోదైంది.

News May 12, 2024

మాదాపూర్ శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన

image

HYD మాదాపూర్‌ శిల్పారామంలో ఆదివారం కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు అలరించాయి. చెన్నై నుంచి వచ్చిన భరతనాట్య కళాకారిణి రక్షా దేవనాథన్‌ నట్టైకురంజి రాగం వర్ణం, జయదేవ అష్టపది అంశాలను ప్రదర్శించి మెప్పించారు. కూచిపూడి నటి గురువు చూడామణి తన శిష్య బృందంతో మూషిక వాహన, పలుకే బంగారమయే, మాతృ దినోత్సవం సందర్బంగా ‘అమ్మ’ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.

News May 12, 2024

HYD: ఓటర్ స్లిప్ ఎక్కడ.. అసంతృప్తిలో ఓటర్లు..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓటర్లకు ఇప్పటికీ ఓటర్ స్లిప్పులు అందలేదు. ముఖ్యంగా ఉప్పల్, చార్మినార్, ఖైరతాబాద్, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లోని ఓటర్లు తమకు ఓటర్ స్లిప్పులు ఇవ్వలేదని పేర్కొన్నారు. రేపు ఓటింగ్ ఉన్న నేపథ్యంలో, ఇప్పటి వరకు ఓటర్ స్లిప్పులు అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటింటికి వచ్చి అందిస్తామని చెప్పిన అధికారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News May 12, 2024

HYD: మధుయాష్కి గౌడ్ ఇంట్లో తనిఖీలు!

image

HYD పరిధి హయత్‌నగర్‌లో డబ్బులు పంచుతున్నారనే ఫిర్యాదు మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఈరోజు కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ ఇంట్లో తనిఖీలు చేపడుతోంది. తనిఖీల్లో భాగంగా కాంగ్రెస్ నేత ఇంటి పరిసరాల్లో ఉన్న వారితో మాట్లాడి, డబ్బు పంపిణీపై ప్రత్యేక బృందం ఆరా తీసింది. రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, డబ్బు పంపిణీని అడ్డుకోవడం కోసం అధికారులు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. 

News May 12, 2024

రంగారెడ్డి: ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై నిఘా: కలెక్టర్  

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులు, రిటర్నింగ్ అధికారుల తనిఖీల్లో రంగారెడ్డి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జిల్లా వ్యాప్తంగా 1,534 కేసుల్లో రూ.49.72 కోట్లకు పైగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై నిఘా ఉంటుందని అన్నారు.

News May 12, 2024

HYD: అందరూ ఓటేయాలంటూ వినూత్నంగా అవగాహన

image

ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మేడ్చల్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తారక్ HYDలోని ప్రధాన మార్గాలు, గల్లీగల్లీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 250 కిలోమీటర్లు తన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తన భుజానికి వేసుకున్న బ్యాగ్ పై Vote is Voice #IVOTEFORSURE అని ఓ స్టిక్కర్ అతికించుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు. 

News May 12, 2024

HYD: అభిమాన నేత కోసం నాలుక కోసుకున్నాడు..!

image

HYD బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఈరోజు ప.గో. జిల్లాకు చెందిన చెవల మహేశ్ తన నాలుక కోసుకున్నాడు. ఏపీలో తన అభిమాన నేత సీఎం కావాలని నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నానని ఆయన ఓ లెటర్‌లో రాశారు. కాగా గతంలోనూ రెండు సార్లు తాను ఇలాగే నాలుక కోసుకున్నట్లు లెటర్‌లో పేర్కొన్నారు. పోలీసులు వచ్చి ఆయన్ను స్థానికంగా ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.  

News May 12, 2024

HYD: రేపు జూబ్లీహిల్స్‌లో ఓటేయనున్న సినీ ప్రముఖులు

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. HYD జూబ్లీహిల్స్ క్లబ్‌లో చిరంజీవి కుటుంబ సభ్యులు ఓటేయనుండగా ఓబుల్ రెడ్డి స్కూల్‌లో జూనియర్ NTR, ప్రణతి, BSNL సెంటర్‌లో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఓటేయనున్నారు. ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మహేశ్ బాబు, నమ్రత, మోహన్ బాబు, విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి తదితరులు ఓటేయనున్నారు.

News May 12, 2024

HYD: కేంద్రాలకు రండి.. ఓటేయండి: కలెక్టర్లు

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరూ రేపు ఓటేసేందుకు రావాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకున్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిర్భయంగా వచ్చి ఓటేయాలని కోరారు. యువత చొరవ చూపి అందరూ ఓటేసేలా చూడాలన్నారు.

News May 12, 2024

HYD: రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో పురుష ఓటర్లే అధికం!

image

రాష్ట్రంలోనే HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానాల్లో పురుష ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఈ ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పురుషుల కన్నా మహిళ ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఎన్నికల అధికారులు టార్గెట్-80 శాతం పేరిట ప్రజల్లో అవగాహన కల్పించారు. అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.