India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 2019 పార్లమెంట్ ఎన్నికలలో స్వతంత్రులకు 5,173 ఓట్లు వచ్చాయి. నోటాకు మాత్రం 5,653 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. ముందస్తు ఎత్తుగడలతో వివిధ పార్టీల నేతలు స్వతంత్రులను బరిలోకి దింపుతున్నారు. స్వతంత్రులు, నోటాకు వచ్చిన ఓట్లు గెలుపోటములపై కీలకంగా మారుతున్నాయి.
HYD పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 1991 పార్లమెంటు ఎన్నికల్లో 77.1 శాతం ఓటింగ్ నమోదయింది. ఆ సమయంలో 12,96,145 మంది ఓటర్లు ఉండగా 9,99,602 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. HYD చరిత్రలో అదే ఫస్ట్ టైం. 1984లో 76.8, 1989లో 71.3, 1998లో 73.2, 2019లో 53.4 ఓటింగ్ శాతం నమోదయింది. 2024 ఎన్నికల్లో ఆ రికార్డు బ్రేక్ చేసి చరిత్ర సృష్టిద్దాం. అందరం ఓటు వేద్దాం.
HYD నగర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి అన్నిరకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే హయత్ నగర్, LBనగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో అధికారులు ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు బస్‌స్టాప్‌లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బ్యానర్లను ఏర్పాటు చేసి మే 13న ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం మరిస్తే.. మన హక్కులపై పోరాడే స్వభావాన్ని కోల్పోతామని సూపర్వైజర్ సునీత తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్‌లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్‌లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
HYD నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న స్పెషల్ RTC బస్సుల్లో ప్రయాణానికి RTC ఛార్జీలు 1.25% పెంచినట్లు అధికారులు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బస్సుల్లో రద్దీ ఏర్పడింది. వన్ సైడ్ ట్రాఫిక్ అధికంగా ఉందని, తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉప్పల్-తొర్రూరు ఎక్స్‌ప్రెస్ సాధారణంగా రూ.220 కాగా.. స్పెషల్ బస్సులో రూ.250 తీసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు.
ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశ యువత చేతిలోనే ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు యూత్ ఓటర్లదే కీలక భూమిక. లోక్‌సభ నియోజక వర్గాలన్నింటిలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం మల్కాజ్‌గిరి. ఈ నియోజకవర్గంలో యువ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. రాష్ట్ర స్థాయితో పాటు కేంద్ర స్థాయిలో కూడా నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో మరి యువ ఓటర్లు ఈ దఫా ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.
HYDలో సొరంగ మార్గ నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎన్నికల తర్వాత నిపుణులతో సాయిల్, రూట్ ఇన్వెస్టిగేషన్ జరుగనుంది. ITC కోహినూర్ నుంచి ఖాజాగూడ, నానక్‌రాంగూడ మీదుగా విప్రో సర్కిల్ వరకు.. ITC నుంచి JNTUH, ITC నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, GVK మాల్ నుంచి నానల్‌నగర్ వరకు.. నాంపల్లి నుంచి చాంద్రాయణగుట్ట,చార్మినార్ నుంచి ఫలక్‌నుమా వరకు ఆయా మార్గాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని నిర్ణయించారు.
HYD చర్లపల్లి రైల్వే టర్మినల్ సంబంధించి అధికారులు ఓ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ తెలిపారు. స్టేషన్ పునరుద్ధరణ సమయంలో దాదాపుగా 500 చెట్లను తొలగించి, నార్త్ లాలాగూడ, మౌలాలి, ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో వాటిని మళ్లీ నాటినట్లుగా పేర్కొన్నారు. పర్యావరణంపై ఉన్న ప్రేమతో చెట్లను నరికి వేయకుండా, ఈ విధంగా చేసినట్లు వెల్లడించారు. మరోవైపు చర్లపల్లి రైల్వే స్టేషన్లో 5,500 మొక్కల పెంపునకు శ్రీకారం చుట్టారు.
శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. ఇప్పటి వరకు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అందించామని పేర్కొన్నారు.
HYD కుత్బుల్లాపూర్ పరిధి సూరారంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరుతూ సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్ శనివారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మే 13న ఎన్నికల్లో ఓటు వేసిన వారు.. తమ షాప్‌కు వచ్చి వారి చేతికున్న సిరా గుర్తు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు చూపిస్తే కూరగాయలు 10 శాతం, జిరాక్స్ 25 శాతం తక్కువ ధరకు ఇస్తానని బ్యానర్ ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.