India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మతో చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేకానంద భేటీ అయ్యారు. స్థానిక ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలు తదితర విషయాల గురించి చర్చలు జరిపారు. ప్రజల్లో కలుస్తూ, సమస్యలు తీరుస్తూ ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. గవర్నర్ వర్మతో భేటీ తనకు సంతోషం కలిగించిందన్నారు.
ఈనెల 14న నార్సింగి పరిధి కోకాపేట్ వద్ద దొడ్డి కొమురయ్య కురమ సంఘ ఆత్మ గౌరవ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు తెలిపారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను డా.బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం భట్టి పాల్గొంటారని తెలిపారు.
మాజీ సీఎం KCR ఎక్కడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించలేదని అంటున్న సీఎం, మంత్రులకు హుస్సేన్‌సాగర తీరాన అమరవీరుల స్మారక చిహ్నం ప్రాంగణంలోని పసిడి వర్ణపు తెలంగాణ తల్లి విగ్రహమే నిలువెత్తు సాక్ష్యం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ HYDలో 2023 జూన్ 22న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నంతో పాటు తెలంగాణ తల్లిని ఆవిష్కరించారన్నారు.
గ్రూప్-2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 30 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్-2 పరీక్షలకు జిల్లాలో 10,381 మంది హాజరుకానున్నట్లు తెలిపారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లిన మంత్రి సీతక్క, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ఇటీవల వయనాడ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీకి మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.
సాగర్‌లో బుద్ధుడి విగ్రహ ప్రతిష్ఠలో పెను విషాదం జరిగింది. 1990 మార్చి 10న విగ్రహాన్ని HYDకు తీసుకొచ్చారు. పెద్ద పడవలో ఎక్కించి తీసుకెళ్తుండగా ఒక్కసారిగా అది కుదుపునకు గురైంది. విగ్రహం మెల్లిగా నీటిలోకి జారిపోవడంతో పడవలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక విగ్రహాన్ని వెలికితీసే సాహసం చేయలేదు. 1992లో నాటి CM కోట్ల విజయ భాస్కర్ రెడ్డి చొరవ చూపి డిసెంబర్ 1992లో వెలికి తీసి ప్రతిష్ఠించారు.
HYD, VKB, RR జిల్లాలలో చలికి తోడు, ORR పరిసరాల్లో పొగ మంచు కమ్మేసింది. ORR, VKB జిల్లాలోని పలు గ్రామాల్లో ఉదయం 8 దాటినా పొగ మంచు తగ్గటం లేదు. వాహనదారులకు ఎదురొచ్చే ఇతర వాహనాలు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధిక పొగ మంచు ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.VKB, ORR ప్రాంతాల్లో 16 డిగ్రీలకు తక్కువగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నేర నియంత్రణ కోసం సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తామని ఆదిత్య బిర్లా గ్రూపు వైస్ ఛైర్మన్ రాజశ్రీ తెలిపారు. రాచకొండ సీపీ సుధీర్ బాబుతో సోమవారం రాజశ్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులు, నేర నియంత్రణ విధానాలు, షీ టీమ్స్ పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఈనెల 20, 21 తేదీల్లో జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఆహ్వానించారు. శాసనసభ ఆవరణలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన జానయ్య ఆహ్వాన పత్రికను అందించారు. ఉత్సవాలకు హాజరు కావడంపై సీఎం సానుకూలంగా స్పందించారు.
సంచార టీకా ద్విచక్ర వాహనాలను సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ వాహనాలు పల్లెలు, పట్టణాలు, జన సంచార ప్రాంతాలలోకి చేరుకొని పిల్లలు, గర్భిణీలకు నూరు శాతం టీకాలు ఇచ్చేందుకు దోహదపడతాయని చెప్పారు. డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు, జిల్లా ఇమ్యు నైజేషన్ అధికారి షీభహయత్, డిప్యూటీ డిఎంహెచ్ఓ రాకేశ్, డీపీఓ అక్రమ్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.