India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోటీ చేసేది ఇక్కడ.. ఓటు వేసేది అక్కడ. ఇది ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డికి తాండూరు అసెంబ్లీ, చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఓటు హక్కు ఉంది. చేవెళ్ల BRS నుంచి పోటీ చేస్తున్న కాసానికి జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ఓటు హక్కు ఉంది. దీంతో వారికి వారు ఓటు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి ఓటు వారికి వేసుకోలేరు. HYD MP అసదుద్దీన్ ఓవైసీ నివాసం చేవెళ్ల పార్లమెంట్ పరిధి రాజేంద్రనగర్. ఇక్కడ MIM పోటీలో లేదు. దీంతో వేరే పార్టీకి ఓటు వేయక తప్పదు. HYD బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నివాసం మల్కాజిగిరి పార్లమెంట్ ఈస్ట్ మారేడుపల్లి మహేంద్ర హిల్స్. HYD కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మహమ్మద్ సమీర్ నివాసం SEC పార్లమెంట్ పరిధి జూబ్లీహిల్స్‌లో ఓటు వేయాలి.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాలు.. సూర్యాపేట(D) కోదాడ సమీపంలోని రామచంద్రాపురానికి చెందిన బాలుడు యూసుఫ్‌గూడలో చదువుకుంటున్నాడు. అతడికి సమీప ప్రాంతంలో నివసించే పదో తరగతి బాలిక పరిచయమైంది. మార్చి 26న బాలిక ఇంట్లోకి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడిపై పోక్సో కేసు నమోదైంది.
వేధింపులతో పెళ్లైన 2 నెలలకే నవ వధువు సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. వనపర్తి జిల్లా అప్పరాలకు చెందిన గాయత్రి(19)కి పెద్దగూడెం వాసి బాలకృష్ణతో మార్చి 13న పెళ్లైంది. వారు ఉపాధి కోసం HYD వచ్చి కర్మాన్‌ఘట్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న వీరితో మరిది శ్రీకాంత్ ఉంటున్నాడు. ఇద్దరి వేధింపులతో గాయత్రి పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులు నచ్చజెప్పి 3 రోజుల క్రితం HYD తీసుకురాగా.. గురువారం ఇంట్లో ఉరేసుకుంది.
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో ఎన్నికల ప్రచారం, ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధిస్తూ HYD, రాచకొండ పోలీసు కమిషనర్లు గురువారం వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. 11న సాయంత్రం 6 గంటల నుంచి 14న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. పోలింగ్ రోజైన 13న ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ ఉద్యోగుల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా ఎయిర్ లైన్స్ విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి దేశీయంగా కోల్‌కతాకు వెళ్లాల్సిన 3 విమానాలు, వారణాసి, విజయవాడ, గ్వాలియర్, సూరత్, లక్నో, బెంగళూరు, గోవా, కొచ్చిన్, పుణేకు వెళ్లాల్సిన 12 విమానాలు ఇక్కడి నుంచి బయలుదేరలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రేమ పెళ్లి అంటూ యువతిని లోబర్చుకుని మోసం చేసిన ఓ యువకుడిని ఎల్బీనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన యువతి, నల్గొండ జిల్లాకు చెందిన మధు చైతన్యపురిలో కోచింగ్ తీసుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ చేయించాడు.దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ఈ నెల 13న MP ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా రేపు సాయంత్రం 6.00 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6.00 గంటల వరకు అభ్యంతరకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ SMSలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని గుర్తు చేశారు.SHARE IT
CM రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్(VHP) ప్రతినిధులు ఎన్నికల అధికారిని గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందుత్వం, హిందూ విశ్వాసాలు, హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు, సీతా మాతపై విమర్శలు చేయడం VHP తప్పుబడుతోందన్నారు. తుక్కుగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్య శ్రీరామజన్మభూమి అక్షింతలను అవమానపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
HYD చాలా సున్నితమైన ప్రాంతమని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా ఛానెల్ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ‘పదేళ్లు పాలించిన TDP, కాంగ్రెస్, BRS ప్రభుత్వాలు హైదరాబాద్‌లో మత కల్లోహాలు లేకుండా కాపాడాయి. ఈ రోజు BJP ఇక్కడ నాలుగు సీట్లు గెలవడం కోసం మైనార్టీల్లో, మెజార్టీ వర్గాల్లో అభద్రత, భయాన్ని రేకెత్తించడం ఎంతవరకు సమంజసం? పెట్టుబడులను గుజరాత్ తరలించడానికే BJP కుట్ర చేస్తోంది’ అంటూ CM ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.