India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధానిలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, హైదరాబాద్‌లో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజాఆశీర్వాదం అంటూ బీజేపీ, ప్రజాపాలన అంటూ కాంగ్రెస్, కేంద్రంలో తెలంగాణ గళం పేరిట బీఆర్ఎస్ నేతలు ఓటర్లను ఆకర్శించే పనిలో పడ్డారు. మూడు ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు బలంగా ఉండడంతో తీవ్ర పోటీ నెలకొంది.
ఓ కార్పొరేటర్, మరో మహిళ వేధింపుల కారణంగా మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. శ్రీనివాసకాలనీలో నివాసం ఉండే బాలవర్ధన్ రెడ్డి తన ఆత్మహత్యకు భాగ్య, BJP కార్పొరేటర్ కారణమని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
HYD నగరంలో ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మల్లాపూర్, కుత్బుల్లాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఏకంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శేరిలింగంపల్లి, కాప్రా, ఖైరతాబాద్, ఉప్పల్, చందానగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. వడగాలులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్‌ను విస్తరించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇందుకు సంబంధించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయనున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు 210 వరకు పెరుగుతాయని అంచనా. జూన్ నాటికి మహా గ్రేటర్‌పై ప్రణాళికలు పూర్తి చేసేలా కసరత్తుల చేస్తున్నారు. SHARE IT
HYDలో తాగునీటి సమస్య తీర్చేందుకు హిమాయత్ సాగర్, గండిపేట జంట జలాశయాల నుంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా, గోదావరి జలాలను మాత్రమే నగరంలో సరఫరా చేశారు. జంట జలాశయాల నుంచి తరలించిన నీటిని శుద్ధి చేసి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ జలమండలి అధికారులను ఆదేశించారు.
వయస్సు నిండకుండా చేస్తున్న బాల్య వివాహాన్ని అడ్డుకున్నట్టు ఎస్ఐ విఠల్ రెడ్డి సోమవారం తెలిపారు. తాండూరు మండలంలోని కోటబాస్పల్లికి చెందిన అబ్బాయితో కర్ణాటకలోని మిర్యాన్ గ్రామానికి చెందిన అమ్మాయితో సోమవారం వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. బాల్య వివాహాం కావడంతో పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరుకుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే ప్రొటెక్షన్ సికింద్రాబాద్ డివిజన్ పోలీసులు వెంటనే అప్రమత్తమై మహిళను రక్షించారు. అనంతరం ఆమె పూర్తి వివరాలను తెలుసుకొని, కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనదని, ఊరికే ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు.
గ్రేటర్ HYDలో జీరో తదితర విద్యుత్తు బిల్లులను ఇక ప్రతి నెల ఆరో తేదీలోపు జారీ చేయాలని డిస్కం.. సిబ్బందిని ఆదేశించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ 6వ తేదీన పూర్తి చేయాల్సిందేనని క్షేత్రస్థాయికి ఆదేశాలు వెళ్లాయి. సిటీలో గృహ, వాణిజ్య, ఇతరత్రా విద్యుత్తు కనెక్షన్లు 60 లక్షల దాకా ఉన్నాయి. గడువు రోజుకు పూర్తి చేయాలంటే సగటున రోజుకు 10 లక్షల బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది.
HYDలో డబుల్ బెడ్ రూమ్ అర్హులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త మోసానికి సైబర్ నేరగాళ్లు తెరలేపారు. డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పొందిన లబ్ధిదారులను గుర్తించి వారికి ఫోన్ చేసి రూ.1,250 ఆన్‌లైన్‌లో చెల్లిస్తే కరెంట్, నీటి సదుపాయాలు కల్పించి ఇళ్లలోకి వెళ్లడానికి సిద్ధం చేస్తామన్నారు. గృహ ప్రవేశం సమయంలో తిరిగి మీ నగదు వాపస్ చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.3,28,66,780 నగదు పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. దీంతో పాటు 18,752.83 లీటర్ల మద్యం పట్టుకొని 122 కేసులు నమోదు చేశామన్నారు. 2144 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు. గడిచిన 24 గంటల్లో మొత్తం రూ.9,54,200 పట్టుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.