RangaReddy

News April 1, 2024

HYD: సామ రామ్మోహన్ రెడ్డికి కీలక పదవి

image

టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డికి కాంగ్రెస్.. కీలక పదవిని అప్పగించింది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ వ్యవహారాల ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవిని అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

News April 1, 2024

HYD: దూకుడు పెంచిన మజ్లిస్‌ పార్టీ

image

పార్లమెంట్‌ ఎన్నికల కోసం మజ్లిస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పాదయాత్రలతో ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టిన మజ్లిస్‌ పార్టీ.. రంజాన్‌ మాసం ఇఫ్తార్‌ విందులను సైతం సద్వినియోగం చేసుకుంటోంది. రోజుకో డివిజన్‌లో ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందులో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరుకావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి సైతం పోలింగ్‌ పెంపుపై దృష్టి సారించింది.

News April 1, 2024

HYD: నోరూరిస్తున్న చీమ చింతకాయలు..!

image

గతంలో చీమచింత కాయలు గ్రామాల్లో విరివిగా దొరికేవి. చెట్టుకున్న చీమచింత కాయలను రాళ్లతో కొట్టి మరీ తినేవాళ్లు. నాటి తీపి జ్ఞాపకాలే వేరు. ఇప్పుడు గ్రామాల్లోనూ కనిపించడం లేదు. కానీ HYDలోని ఉస్మానియా యూనివర్సిటీ రహదారి, ఉప్పల్ చెరువు కట్ట, ఎల్బీనగర్ ప్రధాన రహదారుల్లో తోపుడు బండ్లపై చీమచింత కాయలు చూస్తుంటే నోరూరుతుందని, చీమ చింతకాయలు కొనుక్కొని మరీ పలువురు రుచి చూస్తున్నారు.

News April 1, 2024

HYD: రంబుల్ స్ట్రిప్స్‌పై మీ అభిప్రాయం ఏంటి..?

image

HYD ఎల్బీనగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, గచ్చిబౌలి, నాగోల్, చాంద్రాయణగుట్ట, హయత్‌నగర్ తదితర చోట్ల రోడ్లపై వాహనాల వేగాన్ని కంట్రోల్ చేసేందుకు ఇలా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. అయితే తక్కువ దూరంలో రెండు, మూడు చోట్ల ఏర్పాటు చేయడంతో పాటు అధిక మందంతో ఉండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని పలువురు వాహనదారులు వాపోతున్నారు. వయసు పెరిగేకొద్దీ వెన్నుపూస సమస్యలు వస్తున్నాయంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి..?

News April 1, 2024

HYD: ‘ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.10 లక్షలతో పరార్’

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగుల నుంచి రూ.10 లక్షలు తీసుకుని పరారైన ఘటన HYDలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. విజయవాడకు చెందిన మహమ్మద్ ఇలియాజ్ ‘ESIలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, నకిలీ ఆర్డర్ కాపీలు ఇచ్చి గండీడ్, పరిగి మండలాలకు చెందిన నిరుద్యోగుల నుంచి రూ.10 లక్షలు తీసుకొని పరారయ్యాడు. దీంతో HYD పంజాగుట్ట PSలో బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తమకు న్యాయం చేయాలని కోరారు. 

News April 1, 2024

మల్కాజిగిరిలో తెరపైకి లోకల్- నాన్ లోకల్ ఇష్యూ

image

మల్కాజిగిరి MP సెగ్మెంట్‌లో ఇప్పటి వరకు BRS గెలుపొందలేదు. తెలంగాణ ఉద్యమ వేడి ఉన్న రోజుల్లోనూ, KCR హవా నడుస్తున్న సమయంలోనూ ఇక్కడ TDP, కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని గులాబీ పార్టీ శ్రమిస్తోంది. ఈ దశలోనే BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ క్యాండిడేట్ అని.. సునీతామహేందర్ రెడ్డి (కాంగ్రెస్), ఈటల రాజేందర్ (BJP) నాన్ – లోకల్ అని BRS శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

News April 1, 2024

HYD: సమ్మర్ ఇంటర్న్‌షిప్-2024.. త్వరపడండి..

image

HYD హబ్సిగూడలోని NGRIలో సమ్మర్ ఇంటర్న్‌షిప్-2024 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జియో ఫిజిక్స్, జియాలజీ, ఎర్త్ సైన్సెస్ విభాగాల్లో చదువుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.NGRI రీసెర్చ్ ప్రాజెక్టులో 6-8 వారాలపాటు ఉంటుందని, షేరింగ్ బేసిస్ ఉచిత వసతి ఉంటుందన్నారు. వెబ్ సైట్ https://rectt.ngri.res.in/TrainingInterns/ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

News April 1, 2024

HYD: RTC ‘గమ్యం’ తెలిసేది సగమే..!

image

RTCబస్సు ఎక్కడ ఉందో.. ఎప్పుడొస్తుందో తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన ట్రాకింగ్ యాప్ ‘గమ్యం’ ప్రయాణికులకు అరకొరగానే ఉపయోగపడుతోందని అంటున్నారు. ఈయాప్‌ను ప్రారంభించి దాదాపు 8నెలలు అవుతోంది. సెల్ ఫోన్‌లో ‘గమ్యం’ యాప్ తెరిచి బస్సుల జాడ కోసం ప్రయత్నిస్తున్న వారికి పలు సందర్భాల్లో సమాచారం రావడం లేదంటున్నారు. సర్వీస్ రూట్ల వివరాలను నమోదు చేయడంలో పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

News April 1, 2024

HYD: సమతామూర్తి సందర్శన వేళల్లో మార్పు

image

HYD శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో కొలువుదీరిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన వేళలను మార్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చన్నారు. శని, ఆదివారాల్లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు భక్తులు రావచ్చన్నారు. SHARE IT

News April 1, 2024

HYD: 6 నుంచి దూరవిద్య పబ్లిక్ పరీక్షలు

image

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) సెకండరీ(పదో తరగతి), సీనియర్ సెకండరీ(12వ తరగతి) పబ్లిక్ పరీక్షలు ఈనెల 6 నుంచి మే 22వరకు నిర్వహించనున్నట్లు NIOS HYD ప్రాంతీయ సంచాలకులు పి.సుబ్రమణ్యం తెలిపారు. విద్యార్థులు పరీక్ష తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు హాల్టికెట్లను NIOS వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 040-24752859, 24750712నంబర్లను సంప్రదించాలని సూచించారు.