RangaReddy

News April 1, 2024

HYD: నేడు, రేపు ఎన్నికల నిర్వహణపై శిక్షణ

image

లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ (ఏపీఓ)లకు సోమ,మంగళవారాల్లో శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఒక్కో విడతలో 50 మంది చొప్పున అధికారులకు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణకు వచ్చే వారు పోస్టల్ బ్యాలెట్ కోసం ఓటర్ గుర్తింపు కార్డు నంబర్, ఓటర్ జాబితాలో పార్ట్/సీరియల్ నంబర్ వివరాలు తీసుకురావాలని సూచించారు.

News April 1, 2024

HYD: రేవంత్ పాలన చూసి ప్రజలు సంతోషిస్తున్నారు: మంత్రి

image

100 రోజుల రేవంత్ రెడ్డి పాలనను చూసి ప్రజలు సంతోషిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో HYD ఎల్బీనగర్ పరిధి కర్మన్‌ఘాట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ను అసెంబ్లీ ఎన్నికలో ఆదరించారని, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిపించాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు CM రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. BRSను నమ్మొద్దన్నారు. 

News April 1, 2024

HYD: ఇంటర్ స్టూడెంట్ SUICIDE

image

ఓ ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖైరతాబాద్ మార్కెట్ ప్రాంతంలో నివాసం ఉండే విద్యార్థి(16) SRనగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివి, ఇటీవల పరీక్షలు రాశాడు. ఎంసెట్, IIT పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఆదివారం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఎంసెట్, ఐఐటీల్లో సీటు పొందేలా కష్టపడాలని కుటుంబ సభ్యులు చెబుతుండడంతో ఒత్తిడికి గురై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదైంది.

News April 1, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు: ఈటల

image

ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు ఉండాలని గతంలో ఎంపీగా రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాలపై కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. HYD నాగారంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ఈటల మాట్లాడారు. దేశంలో బీజేపీ గాలి వీస్తుందని, మూడోసారి మోదీ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు.

News April 1, 2024

HYD: శిల్పారామంలో నృత్యంతో అలరించిన కళాకారులు

image

కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో సందర్శకులను అలరించారు. HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో ఆదివారం శ్రీగురు నాట్యాలయం గురువు శ్రీలక్ష్మీ నల్లమోలు శిష్యబృందం కూచిపూడి నృత్యప్రదర్శనను నిర్వహించారు. ఇందులో గణేశ వందన, గణేశ పంచరత్న, బ్రహ్మంజలి, నటేశకౌతం, హనుమాన్‌ చాలీసా, స్వరజతి, శివస్తుతి, రామదాసు కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, కళింగనర్తన, తిల్లాన తదితర అంశాలను కళాకారులు ప్రదర్శించారు.

News April 1, 2024

మల్కాజిగిరిలో BRS ‘పక్కా లోకల్’ వ్యూహం

image

మల్కాజిగిరిలో గెలుపే లక్ష్యంగా BRS నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారంలో ‘పక్కా లోకల్’ అనే నినాదాన్ని వారు ఎత్తుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి వచ్చారని, BJPఅభ్యర్థి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి వచ్చారని కానీ BRSఅభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ‘పక్కా లోకల్’ అంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, BJP సైతం తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి.

News March 31, 2024

HYDలో KTR పాదయాత్ర

image

HYD అంబర్‌పేట్‌లో మాజీ మంత్రి KTR పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నేత, సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. KTR వెంట ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్ ఉన్నారు. BRS పార్టీ తెలంగాణ ప్రజలదని, దానిని గెలిపించి పార్లమెంట్‌లో తెలంగాణ గొంతుక వినిపించేలా చేయాలని పిలుపునిచ్చారు.

News March 31, 2024

HYD: BJPదే విజయం: కిషన్‌రెడ్డి

image

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYD కాచిగూడ డివిజన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లాయన్నారు. కార్పొరేటర్ కన్నె ఉమా రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.

News March 31, 2024

HYD: బీసీలకు భిక్షం వద్దు.. హక్కులు కావాలి: R.కృష్ణయ్య

image

లోక్‌సభ ఎన్నికల్లో BRS, కాంగ్రెస్, బీజేపీ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్, గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఆదివారం కాచిగూడలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. బీసీలకు భిక్షం వద్దని.. రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలని అన్నారు.

News March 31, 2024

BREAKING: HYD: ఫ్రెండ్‌ ఛాతిలో కత్తితో పొడిచారు..!

image

HYD అత్తాపూర్‌లో స్నేహితుల మధ్య వివాదం చెలరేగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సయ్యద్ ముస్తఫా అలీ అనే యువకుడిపై అతడి ఫ్రెండ్స్ అమాన్, అఫాన్ కలిసి దాడి చేశారు. బీర్ బాటిల్‌తో తల పగలగొట్టి, అంతటితో ఆగకుండా కత్తితో ఛాతిలో పొడిచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.