India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD ఉప్పల్ స్టేడియంలో తూళ్ల దేవేందర్ గౌడ్ గేట్ ఉందన్న సంగతి మీకు తెలుసా..? తూళ్ల దేవేందర్ గౌడ్ మేడ్చల్ అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున వరుసగా మూడుసార్లు 1994, 1999, 2004లో గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగానూ వ్యవహరించారు. 2003లో స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఓ గేటుకు ఆయన పేరు పెట్టారు.
HYD శివారు చేవెళ్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. షాద్‌నగర్ వాసి మహమ్మద్(50) చేవెళ్లలోని CPI కాలనీలో ఉంటున్నాడు. అతడిని కొందరు హత్య చేసి, కాళ్లను కట్టేసి, ఓ మూటలో చుట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేసే ప్రయత్నం చేశారు. స్థానికులు వారిని గమనించి పెద్దగా అరిచారు. దీంతో మృతదేహాన్ని వదిలేసి వారు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.
చర్లపల్లిలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రూ.430 కోట్లు వెచ్చించి రైల్వే టర్మినల్ నిర్మిస్తోంది. చర్లపల్లికి మెట్రో లేకపోవడం, రోడ్లు సైతం సరిగా లేకపోవడం, రాత్రి వేళల్లో చర్లపల్లికి రవాణా సదుపాయం లేకపోవడంతో అటువైపు చూసే వారి సంఖ్య తగ్గొచ్చని ప్రజలు చెబుతున్నారు. టర్మినల్ ఏర్పాటుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
HYDలో ప్రస్తుతం 19,03,865 నిర్మాణాలు ఆస్తి పన్ను పరిధిలో ఉండగా.. సుమారు 4 లక్షల మంది పన్ను చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్తులతో పాటు వందలాది ప్రభుత్వ ఆస్తులు కలిపి రూ.9,803.39 కోట్లు బకాయి పడ్డాయి. ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్నుపై 5% వడ్డీ రాయితీతో ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.
భార్య చూస్తుండగానే చెరువులో మునిగి భర్త మృతి చెందిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాచుపల్లి పెట్రోల్ బంకు సమీపంలో హన్మంత్, కల్పన దంపతులు ఉంటున్నారు. శనివారం వారు భైరుని చెరువుకి వెళ్లారు. కల్పన ఒడ్డున నిల్చోగా.. హన్మంత్ స్నానానికి నీటిలోకి దిగి ఎంతకీ తిరిగి రాలేదు. సాయంత్రం మృతదేహం లభ్యమైంది.
ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో నిర్వర్తించినప్పుడే ఎలాంటి పొరపాట్లు జరగవని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. బంజారాభవన్‌లో శనివారం సెక్టర్ ఆఫీసర్లు, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు వేసేలా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.
ప్రాపర్టీ టాక్స్ చెల్లింపులకు వన్ టైం సెటిల్‌మెంట్ స్కీం రాయితీ నేటితో ముగియనున్నందున దీనిని సద్వినియోగం చేసుకోవాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఆదివారం రాత్రి 12 గంటల లోపు తమ ప్రాపర్టీ టాక్స్ చెల్లించి వడ్డీ పై 90% రాయితీ పొందవచ్చని తెలిపారు. శనివారం BSNL కంపెనీ తమ 140 ప్రాపర్టీలకు సంబంధించిన రూ.13,01,15,464 బకాయిలు ఆన్ లైన్లో చెల్లించినట్లు తెలిపారు.
HYD నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఆర్టీసీ ఏసీ పుష్పక్ బస్సులు నేరుగా ఎయిర్‌పోర్ట్ ప్రవేశం మార్గం వరకు వెళ్లనున్నాయి. శనివారం నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. HYD నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు నడిచే 49 ఏసీ బస్సులు అరైవల్స్‌తో పాటు డిపార్చర్స్ వద్ద కూడా ఆగనున్నాయి.
హైదరాబాద్‌లో BRSకు ఎదురుదెబ్బలు తప్పడంలేదు. గత GHMC ఎన్నికల్లో 48 స్థానాల్లో విజయం సాధించిన గులాబీ పార్టీ ప్రస్తుతం 10 మందిని కోల్పోయింది. మేయర్, డిప్యూటీ మేయర్, బొంతు శ్రీదేవి, బాబా ఫసియుద్దీన్‌తో పాటు కీలక నేతలు INCలోకి చేరిపోయారు. మరో 10 మంది కార్పొరేటర్లు కూడా BRSను వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా రోజుకొకరు పార్టీని వీడుతుండటం గులాబీ శ్రేణులను నిరాశ పరుస్తోంది. దీనిపై మీ కామెంట్..?
RR: కేతిరెడ్డిపల్లిలో 42.4℃, రెడ్డిపల్లె 41.7, హైదరాబాద్ యూనివర్సిటీ 41.1, షాబాద్ 41.1, మంగళపల్లె 41.1, మైలార్‌దేవ్‌పల్లి 40.9, మియాపూర్ 40.9, అలకాపురి 40.9, మొగలిగిద్ద 40.7, ప్రొద్దుటూరు 40.9, ధర్మసాగర్ 40.6, హఫీజ్‌పేట 40.5, హస్తినాపురం 40.4, కందుకూరు 40.4, కాసులాబాద్ 40.4, మణికొండ 40.3, రాజేంద్రనగర్ 40.2, మధురానగర్ 40.2, ఎల్బీనగర్ 40.2, గచ్చిబౌలి 40.2, పసుమాముల 40.1, మాదాపూర్లో 40℃గా నమోదైంది.
Sorry, no posts matched your criteria.