India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD ప్రజలకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా రామోజీ ఫిలిం సిటీ పాసెస్ అందుబాటులోకి తేనున్నట్లుగా పేర్కొన్నారు. రామోజీ ఫిలిం సిటీలోని సినీ, ప్రకృతి అందాలను వీక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా.. మెట్రో అధికారులు ఎలాంటి ఫెసిలిటీలతో ఫిలిం సిటీ పాస్ అందిస్తారని సర్వత్రా ఆసక్తిగా మారింది.
HYD సెంట్రల్ యూనివర్సిటీలో మినీ అబ్జర్వేటరీ అందుబాటులోకి వచ్చింది. నక్షత్రాలు, గ్రహాలను ఇక్కడి నుంచే టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ ఉస్మానియా ఆధ్వర్యంలో నిజం అబ్జర్వేటరీ, హైదరాబాద్ ఐఐటీలో మరో కేంద్రం అందుబాటులో ఉంది. దీని ద్వారా వాయు కాలుష్య తీవ్రతను సైతం అంచనా వేయొచ్చని, నక్షత్రాలు, గ్రహాల పరిభ్రమణాన్ని అధ్యయనం చేయొచ్చని ప్రొఫెసర్ ఉదయగిరి తెలిపారు.
HYD ప్రజలకు మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి రంగారెడ్డి జిల్లాల్లో నేడు 40KMPH వేగంతో కూడిన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో ఎక్కడైనా నీరు నిలిచినా.. అత్యవసర పరిస్థితులు ఏర్పడినా 040-21111111, 9000113667 కాల్ చేసి తెలియజేయాలన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా HYDలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.15,70,000 నగదు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.7,57,711 విలువ గల ఇతర వస్తువులు, 127.58 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి, 11 మందిపై కేసులు నమోదు చేశామని, 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
HYD తార్నాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏడాది పాటు ఈ కోర్స్ కొనసాగుతుందని పేర్కొన్నారు. మే 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యూనివర్సిటీకి వచ్చి ఆఫ్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చని, మిగతా వివరాలకు https://www.efluniversity.ac.in సంప్రదించాలని పేర్కొన్నారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,332 కేసుల్లో రూ.9,39,42,041 కోట్ల నగదుతో సహా మొత్తం రూ.41,81,11,904 విలువ చేసే బంగారు ఆభరణాలు, మద్యం సీసాలు, డ్రగ్స్ సీజ్ చేశారు. వీటిలో 8652 గ్రాముల బంగారం, 48,900 గ్రాముల వెండి, 48,810 లీటర్ల మద్యం పట్టుబడింది. రూ.50 లక్షలకు పైగా విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
HYD అల్వాల్‌లో దారుణ హత్య ఘటన ఈరోజు వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అల్వాల్ పరిధి భారతినగర్‌లో అర్ధరాత్రి బావమరిది యుగంధర్‌ను బావ సుబ్రహ్మణ్యం బండరాయితో కొట్టి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న యుగంధర్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. సుబ్రహ్మణ్యం పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎల్బీనగర్ ప్రాంతానికి ఏం చేయలేదని BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి రోడ్ షో ప్రోగ్రాంలో అన్నారు. కానీ.. కొడంగల్ ప్రాంతానికి రూ.3,500 కోట్లు కేటాయించారని, తెలంగాణలో కొడంగల్ ఒక్కటే ఉందా..? అని ప్రశ్నించారు. చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత టెంపుల్ నుంచి భవానీనగర్, విద్యుత్ నగర్, హనుమాన్ నగర్, ఇంద్రనగర్‌లో రోడ్ షో నిర్వహించారు.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల శిక్షతోపాటు జరిమానా విధిస్తూ సోమవారం RR జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు APP తెలిపిన వివరాలు.. HYD మీర్‌పేట్ PS పరిధిలో గతంలో ఓ బాలికను కొందరు అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అనంతరం ప్రధాన నిందితుడు చనిపోగా సహకరించిన కృష్ణకు కోర్టు శిక్ష విధించింది.
పోల్ క్యూ రూట్ యాప్‌ను ఈసారి మరింత మెరుగ్గా అందుబాటులోకి తెస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యాప్‌ను దాదాపు 1.5 లక్షల మంది ఉపయోగించారు. పోలింగ్ కేంద్రానికి దారి తెలుసుకోవడంతోపాటు అక్కడ ఓటర్లు ఎంతమంది బారులు తీరారనే వివరాలను పొందారు. దానికి తగ్గట్టుగా ఏ సమయంలో వెళ్తే త్వరగా ఓటు వేయొచ్చనే అంచనాతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.