RangaReddy

News May 6, 2024

HYD: అర్బన్ హీట్ ఐలాండ్ ప్రాంతాలు ఇవే..!

image

HYD నగరంలో రోజురోజుకు పట్టణీకరణ పెరుగుతోంది. అర్బన్ ల్యాబ్స్ రీసెర్చ్ మార్చ్-2024 ప్రకారంగా అర్బన్ హీట్ ఐలాండ్ జోన్ల వివరాలను అధికారులు తెలిపారు. పటాన్‌చెరు, గచ్చిబౌలి, మైలార్‌దేవ్‌పల్లి, బీఎన్ రెడ్డి నగర్, హయత్‌నగర్, మన్సూరాబాద్ ప్రాంతాలు హీట్ జోన్లుగా పేర్కొన్నారు. మరోవైపు రోజు రోజుకు GHMC పరిధిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

News May 6, 2024

HYD: మోసాలకు పాల్పడ్డ ఆరుగురు నిందితుల అరెస్ట్

image

పెట్టుబడులకు భారీ లాభాలు అంటూ మోసాలకు పాల్పడ్డ ఆరుగురు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితులపై దేశ వ్యాప్తంగా 600 కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలో నమోదైన 77 కేసుల మిస్టరీ వీడిందని తెలిపారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న 3.12 కోట్లు జప్తు చేశామని, దేశ వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా కొల్లగొట్టారని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

News May 6, 2024

HYD: ‘కాసులుంటేనే సరోజినీ క్యూలైన్‌లో ముందుకు’

image

HYD మెహిదీపట్నంలోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రికి రాష్ట్ర నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. దీంతో భారీ క్యూ లైన్ ఏర్పడుతుంది. దీన్ని అదునుగా చేసుకొని సెక్యూరిటీ చేతివాటం చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. క్యూ లైన్‌లో చివరలో ఉన్నా.. డబ్బులు ఇస్తే అందరికంటే ముందే స్టాంపు వేయించుకుని వైద్యం పొందవచ్చని రోగులు తెలిపారు. ఆసుపత్రిలో ఉచిత వైద్యమని బోర్డులు పెట్టి, ఇలా చేతివాటం చూపిస్తున్నారని వాపోయారు.

News May 6, 2024

HYDలో బీర్ల కొరత..!

image

కొద్ది రోజులుగా HYDలో బీర్ల కొరత ఏర్పడింది. చాలినన్ని బీర్లు దొరక్క మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్డ్, లైట్ బీర్లు, టిన్‌లు ఇలా వివిధ రకమైనవి అందుబాటులో లేవని వైన్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నామని మద్యం ప్రియులు అంటున్నారు. అధికారులు స్పందించి బీర్ల కొరతను అరికట్టాలని కోరుతున్నారు. పలు షాపుల వద్ద నో బీర్లు అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

News May 6, 2024

HYD: సాయన్న బిడ్డను గెలిపిస్తాం: మల్లారెడ్డి

image

సాయన్న బిడ్డ నివేదితను గెలిపిస్తామని మేడ్చల్ MLA మల్లారెడ్డి అన్నారు. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి, కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావు, మల్కాజిగిరి MLA మర్రి రాజశేఖర్‌ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఇన్‌ఛార్జ్ శ్రీధర్, కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదితో కలిసి ఆయన మాట్లాడారు. KCR వైపే ప్రజలు ఉన్నారన్నారు.

News May 6, 2024

HYD: ఎండకు పగిలిన కారు అద్దాలు..!

image

HYD, ఉమ్మడి RRలో సూర్యుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు. ఓ వైపు ఎండ.. మరోవైపు ఉక్కపోత, వేడి గాలులతో అవస్థలు పడుతున్నారు. దీంతో బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇటీవల యూసుఫ్‌గూడలో ఎండ వేడికి ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. తాజాగా చేవెళ్ల పరిధి ఇబ్రహీంపల్లిలో ఎండ వేడికి జాజుగుట్టకు చెందిన అహ్మద్ కారు అద్దాలు పగిలిపోయాయి. మధ్యాహ్నం ఇంటి ముందు కారు పెట్టగా ఎండకి అద్దాలు పగిలిపోయాయని బాధితుడు తెలిపాడు.

News May 6, 2024

HYD: యూసుఫ్‌గూడ మెట్రోస్టేషన్ కింద MURDER

image

గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిని హత్య చేసిన ఘటన HYD జూబ్లీహిల్స్ పీఎస్ పరిధి యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ కింద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తుతెలియని వారొచ్చి మెట్రోస్టేషన్ వద్ద ఉన్న యువకుడిపై దాడి చేసి హత్య చేశారు. దుండగుల వివరాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే పార్కింగ్ విషయమై హత్య జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. 

News May 6, 2024

HYDకు అగ్రనేతలు..!

image

లోక్‌సభ ఎన్నికలకు మరో వారమే సమయం ఉండడంతో రాజధానికి అగ్రనేతలు తరలివస్తున్నారు. ఇప్పటికే అమిత్‌షా, రేవంత్ రెడ్డి ప్రచారం చేయగా ఈనెల 9న సరూర్‌నగర్‌లో రాహుల్ గాంధీ సభ ఉండనుంది. 10న ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే రానున్నారు. అదే రోజు LB స్టేడియంలో పీఎం మోదీ సభ ఉంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, అన్నామలై ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక ఈనెల 11న KCR భారీ బహిరంగ సభ ఉండనుందని BRS శ్రేణులు తెలిపాయి.

News May 6, 2024

HYD: రాష్ట్రంలో ఆ నాలుగు ఇక్కడే..!

image

TGలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నాలుగు నియోజకవర్గాలు రాజధాని పరిధిలోనే ఉండడం గమనార్హం. 37,80,453 మంది ఓటర్లతో మల్కాజిగిరి ఫస్ట్ ఉండగా 29,39,057మంది ఓటర్లతో చేవెళ్ల సెకెండ్ ప్లేస్‌లో ఉంది. ఇక 22,17,305మంది ఓటర్లతో HYD థర్డ్, 21,20,550 మంది ఓటర్లతో సికింద్రాబాద్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాయి. కాగా రాష్ట్రమంతా మహిళా ఓటర్లు ఎక్కువుంటే ఈ నాలుగింటిలో మాత్రం పురుషులు ఎక్కువున్నారు.

News May 6, 2024

HYD: BRS హ్యాట్రిక్ కొడుతుందా?

image

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా BRS ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా నేడు చేవెళ్ల పరిధిలో KTR రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు. ఇప్పటికే KCR బహిరంగ సభ నిర్వహించారు. కాగా 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019లో రంజిత్ రెడ్డి BRS నుంచి గెలిచారు. ఇప్పుడు వారిద్దరూ BRS అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌‌కు ప్రత్యర్థులుగా ఉన్నారు. మరి చేవెళ్లలో BRS హ్యాట్రిక్ కొడుతుందా?