India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. రంగరాజన్‌పై దాడి కేసులో నిందితుడు వీరరాఘవరెడ్డికి పోలీసు కస్టడీ ముగిసింది. 3 రోజులపాటు కస్టడీలో పోలీసులు వీరరాఘవ రెడ్డిని విచారించారు. కస్టడీ ముగియడంతో నిందితుడిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి.. ఆపై చంచల్‌గూడ జైలుకి తరలించారు. కాగా.. నిందితుడు తెలుగు రాష్ట్రాల్లోని 6 ప్రధాన ఆలయాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు కృష్ణాజలాలపై ప్రశ్నిస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రపాలకులతో కలిసి కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఈ ప్రాంతానికి అన్యాయం చేశారన్నారు. మమ్మల్ని తిడితే కృష్ణా నీళ్లు రావని కాంగ్రెస్ నేతలు గ్రహించాలని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసర గుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 24 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్‌ఛార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్ ఆధ్వర్యంలో CM రేవంత్ రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. కాగా ఇప్పటికే గుడి వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
HYDలో చికెన్ ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం KG స్కిన్లెస్ రూ.186, విత్ స్కిన్ రూ.164 చొప్పున అమ్మకాలు జరిపారు. నేడు ఏకంగా KG మీద రూ.15 నుంచి రూ.18 వరకు తగ్గించారు. శుక్రవారం KG స్కిన్ లెస్ రూ.168, KG విత్ స్కిన్ రూ.148గా ధర నిర్ణయించారు. కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ. 160కే అమ్మకాలు జరుపుతున్నారు. రిటైల్ షాపుల్లో మాత్రం ధరలు యథావిధిగా ఉంటున్నాయి. మీ ఏరియాలో KG చికెన్ ఎంత?
మన హైదరాబాద్ రంగులమయంగా మారుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా జంక్షన్ల సుందరీకరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కనువిందు చేసేలా కుర్చీలు, LED లైట్లు, గ్రీనరీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫ్లై ఓవర్ల పిల్లర్లకు వేసిన పెయింటింగ్ వాహనదారుల చూపు తిప్పనివ్వడం లేదు. ముఖ్యంగా సెక్రటేరియట్ వద్ద మరింత ఆహ్లాదరకంగా మార్చారు. నగరంలో ఏ మూలకు పోయినా జంక్షన్లు అందంగా దర్శనమిస్తున్నాయి.
JNTU విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఇక నుంచి ప్రతి నెల 4వ శనివారం సెలవు ప్రకటించారు. నూతన వైస్ ఛాన్స్లర్ కిషన్ కుమార్ ఆదేశాలతో గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని రిజిస్ట్రార్ వెంకటేశ్వర రావు ఉత్తర్వులు విడుదల చేశారు.SHARE IT
గ్రేటర్ HYDలో ప్రజా సేవలకు ఈ నంబర్లకు కాల్ చేయండి. అధికారులు లంచం అడిగితే-1064, సైబర్ మోసం జరిగితే-1930, డ్రగ్స్ కనిపిస్తే-1908, పోలీసు సేవలకు-100, ఫైర్ హెల్ప్ లైన్-101, టెలి మానస్- 14416, చైల్డ్ హెల్ప్ లైన్-1098, ఎమర్జెన్సీ అంబులెన్స్-108, ఎయిడ్స్ హెల్ప్ లైన్-1097, కరెంటు పోతే TGSPDCL హెల్ప్ లైన్-1912, HMWSSB హెల్ప్ లైన్-155313,14420, GHMC హెల్ప్ లైన్-040-21111111 నంబర్లు అందుబాటులో ఉన్నాయి.
సంక్షేమ పథకాలు రజక వృత్తిదారులకు అందేలా బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక, ABDMS ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల బండలయ్య అన్నారు. బ్యాంకులు షరతులు లేని రుణాలు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వాలు తమను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని HYDలో నేతల సమావేశంలో మాట్లాడారు. రజక సంక్షేమం కోసం కాంగ్రెస్ రూ.1,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, పనిముట్ల కోసం ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలివ్వాలని కోరారు.
ఇన్‌స్టాలో పరిచయమైన మహిళతో యువకుడు వెళ్లి పోయిన ఘటన KPHB PS పరిధిలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. పవన్ అనే యువకుడు ఈనెల 6వ తేదీన ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. 2 రోజుల క్రితం తాను ఫోన్ చేసి అనారోగ్యంగా ఉందని పుణేలో తెలియని ప్రాంతంలో ఉన్నానని ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేశాడు. కుటుంబ సభ్యులు కాల్ చేయగా మహిళా ఫోన్ ఎత్తి ‘మీ కుమారుడికి కాల్ చేస్తే చంపేస్తా’అని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాసబ్‌ట్యాంక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్‌లో ఏసీబీ అధికారుల సోదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్ జీఎం ఆనంద్ కుమార్ రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెండ్‌గా అధికారులకు పట్టుబడ్డారు. ఆయనపై కేసు నమోదు చేసి ఏసీబీ అదుపులోకి తీసుకుంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.