India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రంజాన్ వేళ HYD నగరంలో డ్రై ఫ్రూట్స్‌కు డిమాండ్ పెరిగింది. HYD దేశంలోనే ఖర్జూరాలను అధికంగా అవిక్రయించే నగరంగా పేరుగాంచింది. ఏటా సుమారు 400 ట్రక్కుల ఖర్జురాలను విక్రయిస్తారు. దాదాపు బేగంబజార్లో 40 రకాల ఖర్జూరాలు విక్రయిస్తుండగా.. కిమియా , షికారి, కూద్రి, మజాపాతి, కాల్మీ ప్రసిద్ధిగాంచినవి. మరోవైపు అమెరికా, అరబ్ దేశాల నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి HYD నగరానికి డ్రై ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి.
HYD నగరంలో వేసవి వేళ మామిడి పండ్ల క్రయ విక్రయాలు పెరిగాయి. ఇదే అదునుగా వ్యాపారులు మామిడికాయ త్వరితగతిన పక్వానికి రావడానికి కెమికల్ ప్యాకెట్లను కాయల మధ్య ఉంచుతున్నారు. ఇలా చేసి పండించిన పండ్లను తినడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ శివలీల తెలిపారు. కాగా ఇటీవలే బాటసింగారంలో వేలాది పండ్లను సీజ్ చేశారు. మామిడి పండ్లు కొనేటప్పుడు జర జాగ్రత్త..!
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో 41.2 డిగ్రీలు, రెడ్డిపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే ఆస్కారం ఉందని వాతవారణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలని సూచించింది.
హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా బుధవారం నగరానికి విచ్చేసిన నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న నీతా అంబానీకి ఈవో కుంట నాగరాజు, ఛైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్ ఘన స్వాగతం పలికారు. దాదాపు 15 నిమిషాల పాటు నీతా అంబానీ ఎల్లమ్మ అమ్మవారి సన్నిధిలో గడిపారు. అనంతరం మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు.
శ్రీ రామనవమికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. 20 రోజుల ముందే ఆయా ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ధూల్‌పేటలో నిర్వహించే రాముడి శోభాయాత్రకు తరలిరావాలని రాజాసింగ్ పిలుపునిస్తున్నారు. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 11 గంటలకు ఆకాశ్‌పురి హనుమాన్ టెంపుల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. యాత్రను విజయవంతం చేయాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
HYDలో దారుణఘటన వెలుగుచూసింది. మద్యానికి డబ్బులివ్వలేదని భార్యను చంపేశాడో భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడలోని రహీంపురకాలనీకి చెందిన అబ్దుల్ సలీమ్, ఆస్మా ఫాతిమా దంపతులు. నిత్యం మద్యం సేవించి భార్యతో సలీమ్ గొడవపడేవాడు. మంగళవారం రాత్రి మందు తాగేందుకు డబ్బులివ్వాలని అడిగాడు. ఫాతిమా ఇవ్వకపోవడంతో గొంతునులిమి చంపేశాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
HYDలో ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా ఇప్పటివరకు రూ.2,57,05,390 నగదు, రూ.37,05,841 విలువైన ఇతర వస్తువులు, 1386.28 లీటర్ల అక్రమ మద్యంను సీజ్ చేసినట్లు GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.16,19,000 నగదు, 1,81,689 విలువ గల ఇతర వస్తువులు, 49.37 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడిందని వెల్లడించారు.
బండ్లగూడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ షకీర్ అలీ, SI వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రమేశ్‌ను CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. జనవరిలో CRPF మహిళా కానిస్టేబుల్ కంప్లైంట్ విషయంలో అలసత్వం వహించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన ఉన్నతాధికారులు సీపీకి నివేదిక అందించారు. నివేదిక ఆధారంగా సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన HYD KPHB PS పరిధిలో జరిగింది. SI సుమన్ తెలిపిన వివరాలు.. బాలానగర్ వాసి పవన్(35) ఫ్యాబ్రికేషన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. KPHB రోడ్ నం.1లోని ఐరిస్ షోరూమ్ షట్టర్ మరమ్మతులు చేసేందుకు వచ్చాడు. నిచ్చెన వేసుకుని మరమ్మతులు చేస్తుండగా షట్టర్ రాడ్డు హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై కింద ఇనుప రాడ్డుపై పడటంతో అది మెడకు గుచ్చుకొని మృతిచెందాడు.
ఉప్పల్‌లో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో శుభవార్త తెలిపింది. ఉప్పల్ స్టేడియం, నాగోల్, ఎన్.జీ.ఆర్.ఐ స్టేషన్లలో అర్ధరాత్రి మెట్రో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రాత్రి 12.15 గంటలకు మెట్రో ట్రైన్ ప్రారంభమై 1.10 గంటలకు చివరి స్టాప్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఈ సౌకర్యాన్ని ఐపీఎల్ మ్యాచ్‌కు వచ్చేవారు వినియోగించుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.