RangaReddy

News May 5, 2024

ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో అల్లు అర్జున్

image

ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో సినీ హీరో అల్లు అర్జున్ శనివారం సందడి చేశారు. కారు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన తన డాక్యుమెంట్లను రవాణా శాఖ కార్యాలయంలో అందజేశారు. అల్లు అర్జున్ బీఎండబ్ల్యూ ఐ7 కారుకు నంబర్ కేటాయించినట్లు రవాణా శాఖ అధికారి పురుషోత్తం తెలిపారు.

News May 5, 2024

HYD: రికార్డ్.. 44.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత

image

HYD నగరంలో రోజు రోజుకూ భానుడు మరింత భగ్గుమంటున్నాడు. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. 2015లో నమోదైన అత్యధిక 44.3° డిగ్రీల రికార్డు నిన్న బ్రేక్ అయింది. సాధారణం కంటే 4 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.10 రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఎండలకు బయటకు వెళ్లాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.

News May 5, 2024

HYD: మురుగు కూపంగా హుస్సేన్ సాగర్.. చర్యలేవి?

image

HYD హుస్సేన్ సాగర్ మురుగు కూపంగా మారుతోంది. నిత్యం నాలాల నుంచి వస్తోన్న వ్యర్థాలు సాగర్ ఒడ్డున ఎక్కడికక్కడ పేరుకు పోతున్నాయి. రోజు రోజుకు హుస్సేన్ సాగర్ నీటి నాణ్యత పడిపోతోంది. నీటిలో కరిగి ఉండాల్సిన ఆక్సిజన్ 4MG కాగా.. తాజాగా పీసీబీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, అంతకు తక్కువగా 3.2MG నమోదైంది. నీటిలో కరిగి ఉండే O2 శాతం తగ్గటం వల్ల జలచరాలు మరణించే ప్రమాదం ఉంది.

News May 5, 2024

HYD: మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయండి: సీపీ 

image

మహిళలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ తరుణ్ జోషి కోరారు. షీటీమ్ రాచకొండ వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా లేదా ప్రాంత షీటీం అధికారుల నంబర్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం -8712662600, కుషాయిగూడ-8712662601, ఎల్బీనగర్ -8712662602, మల్కాజిగిరి -8712662603, వనస్థలిపురం-8712662604 నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు.

News May 4, 2024

HYD: దాహం వేస్తోందని వాటర్ బాటిల్ కొంటున్నారా..? జాగ్రత్త..!

image

వేసవి వేళ దాహం వేస్తోందని, HYDలో స్థానికంగా దొరికిన ఏదో ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేసి, దాహం తీర్చుకునే వారిని అధికారులు హెచ్చరించారు. వేసవి డిమాండ్‌ను అదునుగా చేసుకొని కొంతమంది వేల సంఖ్యలో ఫేక్ వాటర్ బాటిల్స్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే గచ్చిబౌలి, నాంపల్లి తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఫేక్ వాటర్ బాటిల్స్ సీజ్ చేశారు. వాటర్ బాటిల్ కొనేటప్పుడు జర జాగ్రత్త..!

News May 4, 2024

HYD: FAKE వాటర్ బాటిల్స్ సీజ్..!

image

HYD నాంపల్లిలోని బిలాల్ ఐస్ క్రీమ్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఫేక్ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు. అంతేకాక ఎలాంటి లైసెన్స్ లేకుండా క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, నోటీసు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు చేపడితే చట్టపరంగా శిక్ష తప్పదన్నారు.

News May 4, 2024

HYD: హోటల్లో తేదీ గడిచిన జున్ను, సాండ్విచ్ విక్రయం 

image

HYD హిమాయత్ నగర్ క్లోవ్ వెజిటేరియన్ ఫైన్ డైన్ రెస్టారెంట్ పై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ బృందం తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో హోటల్ యజమాన్యం చేసే తప్పులు బయటపడ్డాయి. తేదీ గడిచిన జున్ను, సిరప్, సాండ్విచ్, బ్రౌన్ షుగర్ గుర్తించారు. ఐస్ క్రీమ్ స్టోరేజ్ యూనిట్లో బతికున్న బొద్దింకలను గుర్తించారు. మురిగిన క్యారెట్లు, కొన్ని రోజుల వెజ్ బిర్యానీ ఫ్రిజ్లో గమనించి నోటీస్ జారీ చేశామని అధికారులు తెలిపారు.

News May 4, 2024

HYD: బీజేపీ వస్తే రాజ్యాంగ మనుగడ కష్టం: నారాయణ

image

కేంద్రంలో బీజేపీ పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి మనుగడ ఉండదని, ప్రజల ఓటు హక్కును కూడా లాగేసుకుంటారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే.నారాయణ ఆరోపించారు. HYD హిమాయత్‌నగర్ మఖ్దుమ్ భవన్‌లో శనివారం సీపీఐ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులను గెలిపించుకొని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని అన్నారు.

News May 4, 2024

HYD: పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు: రోనాల్డ్ రాస్

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 13వ తేదీన ఓటింగ్ ఉన్న సందర్భంలో పోలింగ్ సిబ్బంది, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని వసతులను కల్పించాలని HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. శనివారం పార్లమెంట్, అసెంబ్లీ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎండలు తీవ్రంగా ఉన్న క్రమంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

News May 4, 2024

HYD: 852 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు..

image

హైదరాబాద్‌లో మొదటి రోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 852 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ అధికారులు సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి జిల్లాలో మొత్తం మొదటి రోజున 852 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.