India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఈరోజు భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై వారు చర్చించారు. ఈనెల 29న సా.5 గంటలకు HYD గాంధీభవన్‌లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.
HYD ఉప్పల్‌లో JV బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ దంపతులు ఎండీ లక్ష్మీనారాయణ, జ్యోతి కలిసి అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి పెట్టుబడుల పేరిట ఇన్వెస్టర్లను మోసం చేసిన విషయం తెలిసిందే. సుమారు రూ.500 కోట్లు మోసం చేశారంటూ బాధిత ఇన్వెస్టర్లు PSలో ఫిర్యాదు చేసినా.. ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎల్బీనగర్‌లోని RR జిల్లా కోర్టు మెట్లెక్కామని తెలిపారు. ఎలాగైనా నిందితుడిని పట్టుకొని, న్యాయం చేయాలని కోరారు.
స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.38 కోట్ల వ్యయం (ప్యాకేజ్-1)తో వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాంతంగా మార్చే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు. మరోవైపు ‘ప్రసాద్’ పథకం కింద రూ.4.05 కోట్ల వ్యయంతో HYD బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి, పక్కనే ఉన్న పాత భవనాన్ని కూల్చి 3 అంతస్తుల కొత్త భవనం నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్రేటర్ HYDలో వెలువడుతున్న చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇక్కడి ప్లాంట్ ద్వారా నిత్యం 24 మెగావాట్ల కరెంట్‌ను చెత్త నుంచి తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి 2,500మెట్రిక్ టన్నుల చెత్తను ఉపయోగిస్తున్నామని, GHMC వ్యాప్తంగా దాదాపు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతుందని, జవహర్‌నగర్‌లోనే 24 మెగావాట్ల సామర్థ్యంతో మరొక ప్లాంట్ నిర్మిస్తున్నామన్నారు.
HYDలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పటాన్‌చెరు పరిధి బీరంగూడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. లండన్ నుంచి HYD వస్తున్నానని నమ్మించి పలు దఫాలుగా రూ.8.57 లక్షలు అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. అనంతరం రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
లైంగిక వేధింపులు తాళలేక ఓ యువకుడు ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన HYD ఘట్‌కేసర్ పరిధిలో జరిగింది. CI తెలిపిన వివరాలు.. జనగామ వాసి భీమానాయక్‌తో బిహార్ వాసి మితేశ్‌కు పరిచయం ఏర్పడింది. పని ఇప్పిస్తానని, తన దగ్గరకు రావాలని భీమానాయక్ మితేశ్‌ను లైంగికంగా వేధిస్తున్నాడు. కోపం పెంచుకున్న మితేశ్ అతడిని కొండాపూర్‌కు పిలిచి, మద్యం తాగిన అనంతరం కత్తితో దాడి చేశాడు. మితేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
HYDలోని సిటీ ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవడం చాలా సులభమని అధికారులు తెలిపారు. కోఠి, రేతి ఫైల్ బస్ స్టేషన్లలో కమ్యూనికేషన్స్ సెంటర్లు ఏర్పాటు చేశామని, సెంటర్లకు కాల్ చేస్తే సమాచారం అందిస్తారని పేర్కొన్నారు. 9959226160, 9959226154 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని తెలియజేశారు. ఇటీవల సిటీలో నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు.
HYDలో ఎండలు మండుతున్నాయి. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీంతో ఉదయం 10 తర్వాత బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. సోమవారం సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 29.3గా నమోదైంది. అత్యధికంగా ఇబ్రహీంపట్నం, మొయినాబాద్‌లో 39.6, షేక్‌పేట్‌లో 39.2, అసిఫ్‌నగర్‌లో 38.8, సరూర్‌నగర్‌లో 38.4 డిగ్రీలుగా నమోదయ్యాయి.
ఒంటరిగా వెళుతున్న వారే లక్ష్యంగా దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను HYD పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేశారు. CI ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాలు.. పటాన్‌చెరులో ఉంటున్న ఏడుగురు సభ్యుల ముఠా HYDలో ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొని దారి దోపిడీలకు పాల్పడుతోంది. సోమవారం ఇంద్రేశం వద్ద ORR సర్వీస్ రహదారిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పారిపోతున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఉందని, అది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనే సాధ్యమైందని బీజేపీ చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. HYD గచ్చిబౌలి హిల్ రిడ్జ్ కాలనీలో ఆయన మాట్లాడారు. అసాధ్యం అనుకున్న అనేక కార్యక్రమాలను సుసాధ్యం చేశారని, అందుకే నరేంద్ర మోదీ గ్రేట్ అని కొనియాడారు. దేశాభివృద్ధి ఇదే వేగంతో కొనసాగాలంటే ప్రజలు బీజేపీకే ఓటు వేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.