India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మినీ గ్యాస్ సిలిండర్‌తో తలపై బాది దారుణంగా హత మార్చిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన లక్కు(40)కి రాజు అనే వ్యక్తితో 3 రోజుల క్రితం గొడవ జరిగింది. దీంతో లక్కు లక్ష్మీదుర్గా షాపులో షట్టర్ వద్ద నిద్రిస్తుండగా రాజు మినీ గ్యాస్ సిలిండర్‌తో దాడి చేసి హతమార్చాడు. అనంతరం నిందితుడు జీనోమ్ వ్యాలీ PSలో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని హాస్టళ్లు, మెస్‌లకు వచ్చే నెల 1వ తేదీ నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ప్రకటన జారీ చేశారు. వేసవి నేపథ్యంలో <<13137079>>మంచినీరు, విద్యుత్ కొరత <<>>ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యార్థులందరూ సహకరించాలని కోరారు. SHARE IT
తల్లితో ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు బాలుడు ఇంటి పై నుంచి కింద పడి మృతి చెందిన ఘటన అల్వాల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. హస్మత్‌పేటకు చెందిన రవీంద్ర (16) భవనం పైకెక్కి తల్లితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కిందపడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD, RR, MDCL జిల్లాలతో కూడిన GHMCలో ప్రస్తుతం కోటి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. రెండేళ్లలో కొత్తగా 14 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. దాదాపు 5 లక్షల ఓటర్ల గుర్తింపు కార్డులు సవరణలు జరిగాయి. నగరంలోని నియోజకవర్గాల్లో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7.47 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కుత్బుల్లాపూర్‌లో 7.12 లక్షలు, మేడ్చల్‌లో 6.58 లక్షలు, LB నగర్‌లో 6 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలపై భానుడు సెగలు కక్కుతున్నాడు. ఆదివారం ఘట్‌కేసర్ మండలం ఘన్‌పూర్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీలు, మొయినాబాద్ మండలం మృగవని పార్కు సమీపంలో 43.6 డిగ్రీలు, బంట్వారం మండలం నాగారంలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రేపు, ఎల్లుండి జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎండల దృష్ట్యా ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
ఓటరు జాబితాలో ప్రక్షాళనలో భాగంగా భారత ఎన్నికల సంఘం రెండేళ్లలో గ్రేటర్ హైదరాబాద్‌లో 8,81,201 ఓట్లను తొలగించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 5,41,201 మంది ఓట్లను తొలగించారు. ఇందులో 4,39,801 మంది నివాసం మారగా.. 54,259 మంది డూప్లికేట్, 47,141 మంది ఓటర్లు మరణించారు. రంగారెడ్డి జిల్లాలో 2.6 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 80 వేల ఓట్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. HYD ఫిలింనగర్‌లోని ఓ బార్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు బార్‌లో తనిఖీలు నిర్వహించగా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెరుకూరి రమేశ్ ఓ యాప్ ద్వారా IPL బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తేలింది. దీంతో రమేశ్‌ను అరెస్టు చేసి సెల్‌ఫోన్‌తో పాటు రూ.16 వేలు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే 1, 2 రోజులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి, ఇతర గ్రామానికి వెళ్తేనే దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొంతూళ్లకు వెళ్లేవారు స్థానిక PSలో సమాచారం ఇవ్వడంతో పాటు, జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
HYD, ఉమ్మడి RR జిల్లాలో TTC(టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు) లోయర్ గ్రేడ్ టెక్నికల్ కోర్సు ఉత్తీర్ణులైన వారికి మే 1 నుంచి జూన్ 13 వరకు శిక్షణ ఉంటుందని తెలంగాణ పరీక్షల విభాగం వెల్లడించింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని, HYD,హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ జిల్లాలో MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో చిరుతపులి సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు ఫిర్యాదు మేరకు రన్‌వేతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. చిరుత, మరో రెండు పిల్లలను పట్టుకునేందుకు బోన్‌లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలను బిగించారు.
Sorry, no posts matched your criteria.