RangaReddy

News April 27, 2024

KCRపై పంజాగుట్ట PSలో ఫిర్యాదు

image

మాజీ CM KCRపై సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్‌ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో‌ ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని ఫిర్యాదు‌లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో KCRతో పాటు అప్పటి కేబినెట్‌లోని 39 మంది MLAలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News April 27, 2024

డిజిటల్ డోర్ నంబరింగ్‌పై GHMC కసరత్తు!

image

ఢిల్లీ లాంటి నగరాల మాదిరిగా HYD వ్యాప్తంగా డిజిటల్ డోర్ నంబరింగ్ (DDN) చేయడంపై GHMC కసరత్తు చేస్తోంది. 2018లో మూసాపేటలో పైలట్ ప్రాజెక్టుగా ఆధార్ అనుసంధానంతో 7 అంకెలతో కూడిన డిజిటల్ డోర్ నంబర్ కేటాయించే కార్యక్రమం ప్రారంభించింది. కానీ అప్పుడు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. DDN కేటాయించడం వల్ల ఇంటి అడ్రస్ తెలుసుకోవడం సులభతరం అవుతుంది. DDN కేటాయిస్తామని  GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ గతంలోనూ చెప్పారు. 

News April 27, 2024

HYD: DDN విధానంలో ఏం చేస్తారు..?

image

HYD నగరంలో డిజిటల్ డోర్ నెంబరింగ్ కై ఇంటింటికీ సర్వే జరిపి ఇంటి పాత నంబర్, బస్తీ పేరు, ప్రాంతం, ఇంటి ఫొటో, యజమాని ఫోన్ నంబర్ సేకరిస్తారు. ఆంగ్ల అక్షరాలు, అంకెల కలయికతో ప్రతి ఇంటికి నంబర్లను కేటాయిస్తారు. డిజిటల్ డోర్ నంబర్ ఉపయోగించి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS సాయంతో ఇంటిని గుర్తించి, నేరుగా అక్కడికి చేరుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

News April 27, 2024

HYD: దంచి కొడుతున్న ఎండలు

image

HYD, RR ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శేరిలింగంపల్లి, హఫీజ్‌పేటలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, బంట్వారం మండలం తొర్మామిడి-నాగారంలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. HYD వ్యాప్తంగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 27, 2024

HYD: బాలికకు ప్రేమ పేరుతో వేధింపులు.. అరెస్ట్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించిన యువకుడిపై కాచిగూడ పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. SI నరేశ్ కుమార్ వివరాల ప్రకారం.. శివరాంపల్లిలో నివాసం ఉంటున్న సాయికిరణ్ అలియాస్ నాని (20) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి కాచిగూడకు చెందిన ఓ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. బాలికను వేధిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారు.

News April 27, 2024

చేవెళ్ల: 17 మంది నామినేషన్ల తిరస్కరణ

image

చేవెళ్ల లోక్‌సభ స్థానానికి సంబంధించి మరో కీలక ఘట్టం ముగిసింది. అధికారులు నామినేషన్ల పరిశీలన పూర్తి చేశారు. సరైన ఫార్మాట్‌లో లేని నామినేషన్లను తిరస్కరించారు. చేవెళ్ల పార్లమెంట్‌ స్థానానికి మొత్తం 64 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే పార్లమెంట్‌ స్థానానికి దాఖలైన నామినేషన్లలో 17 నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 47 నామినేషన్లకు జిల్లా ఎన్నికల అధికారి శశాంక్ ఆమోదం తెలిపారు. 

News April 26, 2024

HYD: బార్‌లో అమ్మాయిల అశ్లీల‌ నృత్యాలు

image

కస్టమర్లను ఆకర్శించేందుకు అమ్మాయిలతో‌ అశ్లీల నృత్యాలు చేయించిన బార్‌ అండ్ రెస్టారెంట్‌ను పోలీసులు మూసివేయించారు. సికింద్రాబాద్‌ పరిధిలోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్‌లో అశ్లీల‌ నృత్యాలు‌ చేయిస్తున్నారని సమాచారం అందగా నార్త్‌ జోన్ టాస్క్‌ఫోర్స్‌ దాడులు చేసింది. 30 మంది అమ్మాయిలతో పాటు 60 మంది కస్టమర్లను అదుపులోకి తీసుకొన్నారు. ఓనర్‌పై కేసు నమోదు చేశారు. తాజాగా బార్‌ లైసెన్స్‌ను రద్దు చేశారు.

News April 26, 2024

సికింద్రాబాద్‌లో ACB రైడ్స్‌

image

సికింద్రాబాద్‌లో ACB అధికారులు రైడ్స్ చేశారు. నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏకంగా రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఉప్పల్‌లో బిల్డింగ్‌కు NOC ఇచ్చేందుకు DEE పవన్ కుమార్ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా ACB దాడులు చేసి అరెస్ట్ చేసింది. న్యాయస్థానంలో హాజరుపరచి కేసు దర్యాప్తు చేస్తున్నారు. లంచం అడిగితే వెంటనే 1064‌కి కాల్ చేయాలని ACB Telangana పేర్కొంది.

News April 26, 2024

వికారాబాద్: UPSC ఫలితాలు.. యువకుడి పొరపాటు

image

UPSC ఫలితాల్లో వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడికి నిరాశ మిగిలింది. తరుణ్ కుమార్‌‌ ఆల్‌ ఇండియాలో‌ 231వ ర్యాంకు సాధించినట్లు తొలుత వార్తలొచ్చాయి. అభ్యర్థిని పరిగి MLAతో పాటు తదితర రాజకీయ నేతలు‌ సన్మానించారు. కానీ, హాల్ ‌‌టికెట్‌ నంబర్ ద్వారా చెక్ చేస్తే హరియాణాకు చెందిన యువకుడిగా తేలింది. క్రాస్‌చెక్‌ చేసుకోకపోవడంతో‌ యువకుడు పొరపాటు పడ్డట్లు‌ గ్రామస్థులు తెలిపారు. 

News April 26, 2024

అనుజ్ఞను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

image

ఇంటర్ (MPC) స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అనుజ్ఞ శుక్రవారం తన తల్లిదండ్రులతోపాటు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా ఆమెను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. ఉన్నత చదువుల్లో సైతం ఇలాగే రాణించాలని, తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని సూచించారు. MPCలో 1000 మార్కులకు గాను 993 మార్కులు అనుజ్ఞ సాధించిన విషయం తెలిసిందే.