India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సిరిపురం యాదయ్య ఆత్మ బలిదానం చేసుకొని నేటికీ 15ఏళ్లు అయ్యింది. 2010లో నేటి రోజున RR జిల్లా నాగారం ప్రాంతానికి చెందిన యాదయ్య ఓ అనాథ. 19 ఏళ్ల వయస్సులో ఓ హోటల్లో పనిచేసుకుంటూ చదువుకునే రోజుల్లో తెలంగాణ కోసం అమరుడయ్యాడని చంచల్గూడ ఎస్పీ శివకుమార్ అన్నారు. తెలంగాణ ఫలాలు అనుభవిస్తున్నవారిలో ఎంత మందికి గుర్తున్నాడో..? మన యాదయ్య. జై తెలంగాణ!జై జై తెలంగాణ..! అంటూ ట్వీట్ చేశారు.
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ జాతీయ రహదారి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు యూటర్న్ తీసుకుంటున్న కారును లారీ వచ్చి ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ అప్రమత్తత వల్ల కారును ఢీ కొట్టినప్పటికీ పెను ప్రమాదం తప్పింది. కారు మాత్రం స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదకరమైన మలుపు వద్ద తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ భవన్లో బుధవారం KCR అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ కీలక నేతలు రాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వదిన దశదినకర్మ నేపథ్యంలో హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాల సమాచారం. కాగా.. మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరుకు గల కారణాలు తెలియాల్సింది ఉంది.
రంగారెడ్డి జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా చందనవెల్లిలో
38℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు మహేశ్వరం, తట్టిఅన్నారం, యాచారం, కందువాడ, మంగల్పల్లిలో 37.9, తోర్రూర్, అబ్దుల్లాపూర్మెట్, ప్రోద్దటూర్, మొయినాబాద్లో 37.8, కొత్తూరు, షాబాద్లో 37.6, కేతిరెడ్డిపల్లి, రెడ్డిపల్లి, కాసులాబాద్లో 37.5, నల్లవెల్లి, మామిడిపల్లిలో 37.4, తుర్కయంజాల్ల్లో 37.3℃గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
KPHB PS పరిధిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పెళ్లి జరిగిన సంవత్సరం నుంచి వరకట్నం కోసం భర్త వేణుగోపాల్ వేధిస్తూ ఉండేవాడని మృతురాలు దీపిక తల్లిదండ్రులు ఆరోపించారు. వీరికి 13 నెలల బాలుడు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీన ఆమె సోదరుడు దీపిక ఇంటికి రాగా ఇంట్లో ఉరివేసుకుని కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ కరెంట్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తున్నట్లు TGSPDCL తెలిపింది. గ్రేటర్ పరిధిలో ఫిబ్రవరి 16న 60.06 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగించగా, అదే 18వ తేదీన డిమాండ్ కాస్త 70 యూనిట్లకు చేరింది. రాబోయే కొద్ది రోజుల్లో కరెంటు డిమాండ్ భారీ స్థాయిలో పెరగనున్న నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నారు.
HYDలో బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. దామోదర వెల్లడించారు. దీంతో చికెన్ మార్కెట్ ఊపిరిపీల్చుకుంది. KG రూ. 140కి పడిపోయిన ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. KG స్కిన్లెస్ రూ. 186, విత్ స్కిన్ రూ. 164గా ధరలు నిర్ణయించారు. కోళ్ల నుంచి మనుషులకు సోకిన కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.
గచ్చిబౌలిలో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నవారిని అరెస్టు చేశారు. గచ్చిబౌలి PS పరిధిలో శ్రీరాంనగర్ కాలనీలో స్టైలిష్ బ్యూటీ స్పా నిర్వహిస్తున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, గచ్చిబౌలి పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకుడు సత్యనారాయణ, విటులు శ్రీకాంత్, గోవిందరావు, అప్పారావులను అరెస్ట్ చేశారు.
HYDలో నేడు మరో లాయర్ గుండెపోటుతో మృతి చెందారు. తార్నాకకు చెందిన లాయర్ వెంకటరమణ మారేడ్పల్లిలోని ఇండియన్ బ్యాంక్లో చలానా కట్టేందుకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారని స్థానికులు తెలిపారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిన్న హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే లాయర్ వేణుగోపాల్ రావు మరణించిన సంగతి తెలిసిందే. వరుస హార్ట్ఎటాక్లు HYDలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
గ్రేటర్లో హ్యుమాన్ ట్రాఫికింగ్పై సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. విశ్వసనీయ సమాచారంతో వ్యభిచార గృహాలపై మెరుపుదాడులు చేస్తున్నారు. కూకట్పల్లిలో వాహనదారులకు సైగలు చేస్తూ వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడుగురు మహిళలను మంగళవారం బైండోవర్ చేశారు. గత కొద్ది రోజులుగా KPHB మెట్రో సమీపంలోనూ నిఘా పెట్టారు. వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.