India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వడదెబ్బతో టీచర్ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో బుధవారం చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలంలోని టాకితాండాలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న రాణి.. తాండూర్‌లోని నెంబర్ 1 పాఠశాలలో ఎలక్షన్ శిక్షణ తరగతులకు హాజరయ్యింది. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో బస్‌స్టాప్ వద్ద కుప్పకూలి పడిపోయింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈనెల 6న తాండూర్ పట్టణానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 6న జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌ఛార్జ్ మహేశ్ పాల్గొన్నారు.
దిశా కేసులో సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై హైకోర్టు సింగిల్ బెంచ్‌ను పలువురు అధికారులు ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై స్టే విజయసేన్ రెడ్డి బెంచ్ విధించింది. పోలీసుల పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
HYD మెట్రో, MMTS రైళ్లు, ప్రదర్శనలు, వినోద కార్యక్రమాల్లో మఫ్టీలోని షీ టీమ్స్ నిఘా కళ్లు పోకిరీలను వెంటాడుతున్నాయి. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లలో 14 బృందాలు మఫ్టీలో నిత్యం పహారాకాస్తున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో మఫ్టీలో ఉంటున్న ఈ బృందాలు దూరంగా ఉండి ఆకతాయిల చేష్టలను వీడియో రికార్డ్ చేస్తున్నాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆకతాయిలకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ అందిస్తున్నారు.
రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన లింగారెడ్డిగూడ సమీపంలో చోటుచేసుకుంది. లింగారెడ్డిగూడా సమీపంలోని మజీద్ వెనకాల మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్లు ఉంటుందని తెలిపారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జీహెచ్ఎంసీ డ్రైవర్ రామ్ చంద్ర యాదవ్(25) పై కాచిగూడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సై రవికుమార్ వివరాల ప్రకారం.. నింబోలి అడ్డకు చెందిన రామచంద్ర యాదవ్ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మంగళవారం బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ సంఘటన ఛత్రినాక PS పరిధిలో చోటుచేసుకుంది. సైదాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ ఉర్ రెహమాన్ ఎలక్ట్రీషియన్. 2021లో అతడు ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తాజాగా కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు చిరుత చిక్కింది. 4 రోజులుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు 25 కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేశారు. ఓ బోన్ ముందు చిరుత సంచరిస్తున్న ఫొటోలు లభ్యమయ్యాయి. గొల్లపల్లి, రషీద్‌గూడ, బహదూర్‌గూడ, చిన్న గోల్కొండ ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. బీ కేర్ ఫుల్. SHARE IT
OYOకి వెళ్లిన యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. SRనగర్ పోలీసుల వివరాల ప్రకారం.. జడ్చర్ల వాసి హేమంత్(28) తన లవర్‌తో కలిసి సోమవారం HYD వచ్చాడు. ఓ ఫంక్షన్‌కు హాజరైన వీరు రాత్రి OYOలో బసచేశారు. మిడ్‌నైట్ తర్వాత బాత్రూంకి వెళ్లిన హేమంత్ ఎంతకీ రాకపోవడంతో అమ్మాయి వెళ్లి చూడగా అనుమానాస్పదంగా పడి ఉన్నాడు. 108కి కాల్ చేయగా సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించి, చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదైంది.
10th Resultsలో రాజధాని వెనుకబడిన సంగతి తెలిసిందే. గతేడాది <<13150824>>HYD 28, RR 14, MM 20వ<<>> స్థానాల్లో నిలవగా ఈ సారి ఇంకా వెనుకబడ్డాయి. నగరంలోని గవర్నమెంట్ స్కూల్స్‌లో 7445 విద్యార్థుల్లో 5873 మంది పాస్ అయ్యారు. రంగారెడ్డి, మేడ్చల్‌లోని ప్రభుత్వ స్కూల్స్‌లో ఉత్తీర్ణత 80% మించలేదు. సర్కారుబడుల్లో మౌలిక వసతుల కొరత, జీవో 317పై ఆందోళనలు, విద్యార్థులు సక్రమంగా స్కూల్స్‌కి రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.