RangaReddy

News April 30, 2024

HYD: వంట బాగాలేదని భార్యను కొట్టి చంపిన భర్త!

image

వంట బాగోలేదని భార్యను భర్త కొట్టి చంపిన దారుణ ఘటన HYD బాచుపల్లిలో చోటు చేసుకుంది. CI ఉపేందర్ రావు వివరాల ప్రకారం.. ప్రగతి కన్‌స్ట్రక్షన్‌ వద్ద మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతులు లేబర్‌ పని చేస్తున్నారు. వంట బాగాలేదనే వాగ్వాదంలో భార్య రవినా దూబే(26)ని భర్త ఇటుకతో కొట్టి చంపినట్లు తెలిపారు. మృతదేహాన్ని గాంధీకి తరలించామని, ఘటన పై కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 30, 2024

VKBD: పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్‌ను సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులను అధికారులు సమర్ధంగా నిర్వహించాలంటే పోస్టల్ బ్యాలెట్‌ను సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 30, 2024

RR: మూడు జిల్లాల్లో వారికి ఆరోగ్య కార్డులు!

image

HYD, RR, MDCL జిల్లాల్లో ప్రాథమిక వైద్యాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని గర్భిణీలు, చిన్నారులకు, పౌష్టికాహారం పంపిణీ చేసే అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కార్డులు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు లబ్ధి పొందే వారి వివరాలపై కసరత్తు చేస్తున్నారు.

News April 30, 2024

HYD: వ్యక్తి దారుణ హత్య

image

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోలీస్ స్టేషన్.. మక్త మాదారం గ్రామ పరిధిలోని బటర్ ఫ్లై వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారని షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు.

News April 30, 2024

HYD: వేసవి వేళ శ్రీశైలం టూర్.. అదరహో!

image

HYD నుంచి 200KM దూరంలో నల్లమల అడవుల్లో కొలువైన శ్రీశైల మల్లికార్జున దర్శనానికి వెళ్లేవారిని చల్లటి ప్రదేశం మల్లెల తీర్ధం కనువిందు చేస్తుంది. శ్రీశైలం వెళ్లే దారిలో ఫరహాబాద్ నుంచి వలవర్లపల్లి మీదుగా 15కి.మీ దూరం ప్రయాణిస్తే దట్టమైన అడవి వస్తుంది. వాహనాలు అపి కొద్ది దూరం వెళ్తే లోయలోకి సుమారు 300 మెట్లు ఉంటాయి. లోయలోకి దిగితే చల్లటి వాతావరణం శరీరాన్ని ఆవహిస్తుంది. ఇంకేం మరీ వేసవి టూర్ వెళ్దామా..!

News April 30, 2024

HYD: యువతి స్నానం చేస్తుంటే వీడియో తీసిన యువకుడు

image

యువతి స్నానం చేస్తుంటే ఓ ప్రబుద్ధుడు వీడియో తీశాడు. ఈ సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో‌ వెలుగుచూసింది. ఓ లేడీస్ హాస్టల్‌‌లో ఉండే యువతి స్నానం చేసేందుకు వెళ్లారు. ఓ యువకుడు బాత్రూం విండో‌ నుంచి సెల్‌ఫోన్‌‌తో వీడియో తీశాడు. ఇది గమనించిన అమ్మాయి గట్టిగా కేకలు వేసింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు PSలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 30, 2024

10th Results: వెనుకబడ్డ హైదరాబాద్‌‌‌‌

image

10వ తరగతి ఫలితాల్లో హైదరాబాద్‌ వెనుకబడింది. 33 జిల్లా‌ల వారీగా విడుదల చేసిన జాబితాలో 30వ స్థానంతో సరిపెట్టుకొంది. HYDలో మొత్తం 73,202 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 86.76 శాతంతో 63,511 మంది పాస్ అయ్యారు. 91.01 %తో 24వ స్థానంలో రంగారెడ్డి, 89.61 %‌తో మేడ్చల్ మల్కాజిగిరి 27వ స్థానం, 65.10%తో వికారాబాద్‌ జిల్లా చివరి(33) స్థానంలో నిలవడం గమనార్హం.

News April 30, 2024

HYD: తండ్రి‌ తిట్టాడని‌ బాలిక సూసైడ్

image

మద్యం మత్తులో తండ్రి తిట్టడంతో 8వ తరగతి చదువుతున్న బాలిక(15) ఆత్మహత్య చేసుకొన్న ఘటన రాయదుర్గం PS పరిధి టెలికాంనగర్‌లో వెలుగుచూసింది. AP నంద్యాల జిల్లా లక్ష్మీపురానికి చెందిన దుద్దుకూరు సరోజ తన కుటుంబంతో కలిసి నగరానికి వచ్చింది. టెలికాంనగర్‌లోని గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. సోమవారం సరోజ రెండవ కూతురు రేవతిని తండ్రి తిట్టడంతో ఉరేసుకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News April 30, 2024

HYD: పబ్‌లో గొడవ.. కత్తితో బౌన్సర్ దాడి

image

నగరంలోని ఓ పబ్‌లో‌ గొడవ జరిగింది. రాయదుర్గం PS లిమిట్స్‌లోని వైట్ హార్ట్ పబ్‌లో సర్వర్ కెప్టెన్‌గా పని చేస్తున్న కృతీక్(23), బౌన్సర్‌ అమీర్ మధ్య ఘర్షణ జరిగింది. కృతీక్‌తో పాటు అడ్డొచ్చిన స్నేహితులపై బౌన్సర్ కత్తితో దాడి చేశాడు. ఈ గొడవలో‌ ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమీర్‌ను అదుపులోకి తీసుకొన్నారు.

News April 30, 2024

HYD: ఎంపీ ఎన్నికలు.. ఇదీ పరిస్థితి!

image

MP ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మల్కాజిగిరిలో 37 నామినేషన్లు ఆమోదించగా.. 15 మంది విత్‌డ్రా చేసుకొన్నారు. 22 మంది బరిలో నిలిచారు. HYD లోక్‌సభలో 8 మంది విత్‌ డ్రా చేసుకోగా.. 30 మంది బరిలో ఉన్నారు. చేవెళ్లలో 46 మందికి ముగ్గురు ఉససంహరించుకొన్నారు. 43 మంది పోటీలో నిలిచారు. ఇక సికింద్రాబాద్‌లో ఒక్కరే నామినేషన్ ఉపసంహరించుకొన్నారు. ఇక్కడ 45 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
SHARE IT