RangaReddy

News April 24, 2024

HYD: రైల్వే స్టేషన్లో బుకింగ్ కౌంటర్ల పెంపు

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో అధికారులు మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ప్రయాణికులు టికెట్ తీసుకోవడానికి ఇబ్బంది పడకుండా బుకింగ్ కార్యాలయంలో స్పెషల్ బుకింగ్ కౌంటర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అడిషనల్ బుకింగ్ కౌంటర్ల వద్దకు వెళ్లి టికెట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, బుకింగ్ ఆఫీసు సైతం ప్రయాణికులతో నిండిపోతుంది.

News April 24, 2024

మిసెస్ ఇండియా 2024‌ ఫస్ట్ రన్నరప్‌గా HYDకి చెందిన సాఫ్ట్ వేర్

image

హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రుతీ చక్రవర్తి రాజస్థాన్, జైపూర్‌లో జరిగిన మిసెస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి అందరినీ అలరించారు. భరత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ నిర్వహించిన కాంటెస్ట్‌లో మరో 20 మంది కంటెస్టెంట్స్‌తో పోటీపడిన శృతీ చక్రవర్తి.. ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్‌లో ఫస్ట్ రన్నరప్‌‌గా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.

News April 24, 2024

RR: నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

image

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. RR జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఆరే మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహేశ్వరం బీజేపీ ఇన్‌ఛార్జి శ్రీరాములు యాదవ్ ప్రపోజల్ సంతకం చేసినట్లు పేర్కొన్నారు. చేవెళ్ల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

News April 24, 2024

HYD ఎంపీ అభ్యర్థి మాధవిలత పై కేసు నమోదు

image

హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై బేగంబజార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ప్రచారంలో భాగంగా ఆమె వ్యవహరించిన తీరుపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తమ మనోభావాలు కించపరిచేలా ఆమె వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News April 22, 2024

HYD: నేటితో ముగియనున్న గడువు   

image

ఇంటివద్ద ఓటేయాలనుకుంటున్న వృద్ధులు, దివ్యాంగులు 12-డీ పత్రాలు సమర్పించేందుకు నేటితో గడువు ముగియనుంది. ఇప్పటికే ఇలాంటి వారిని గుర్తించిన అధికారులు ఇంటింటికి పత్రాలు పంపిణీ చేశారు. వారు సుముఖత తెలిపేందుకు నేటితో గడువు ముగుస్తుంది. పోలింగ్ కేంద్రం వద్దకు రాలేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఇంటివద్ద ఓటేసేవారు మూసాపేట సర్కిల్ కార్యాలయంలో పత్రాలు సమర్పించాలన్నారు.

News April 22, 2024

రాజకీయ పార్టీలకు రోనాల్డ్ రోస్ ఆదేశాలు

image

సోషల్ మీడియాలో ప్రకటనలు చేసే ముందు మీడియా సర్టిఫికేషన్ & మానిటరింగ్ కమిటీ ఎంసీఎంసీ నుంచి అనుమతి పొందాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ రాజకీయ నాయకులను ఆదేశించారు. ఎంసీఎంసీ ఆఫీసు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కార్యాలయంలో ఉందని తెలిపారు. ఏదైనా ప్రకటనలను ప్రసారం చేయడానికి కనీసం 24 గంటల ముందు నాయకులు తమ దరఖాస్తులను ఎంసీఎంసీకి సమర్పించాలని ఆదేశించారు.

News April 22, 2024

HYD: రేపు మద్యం దుకాణాలు బంద్

image

హనుమాన్ జయంతి సందర్భంగా ఈనెల 23న శోభాయాత్ర వైభవంగా నిర్వహించనున్నారు. కావున హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు మూసి వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News April 22, 2024

HYD: ఇప్పటివరకు రూ.14.63 కోట్ల నగదు స్వాధీనం

image

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆదివారం పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.5.88 లక్షలు పట్టుబడినట్టు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకు రూ.14.63 కోట్ల నగదు, రూ.6.90 కోట్ల విలువైన వివిధ వస్తువులు, 20,920 లీటర్ల మద్యం పట్టుకున్నారు. 208 మందిపై కేసులు నమోదు కాగా.. 206 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.

News April 21, 2024

HYD: ఘోరం.. రెండు ముక్కలైన శరీరం

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన షాద్‌నగర్ పట్టణ కేంద్రంలోని బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది. నందిగామ మండల కేంద్రానికి చెందిన గోవు మల్లేశ్ ద్విచక్ర వాహనంపై కేశంపేట బైపాస్ రోడ్డు దాటుతున్నాడు. ఇంతలోనే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 21, 2024

కూకట్‌పల్లిలో‌ దారుణం.. అత్యాచారం చేసి హత్య?

image

హైదరాబాద్‌లో దారుణఘటన వెలుగుచూసింది. ఆదివారం కూకట్‌పల్లి PS పరిధి AR పైప్ వర్క్ షాప్ సెల్లార్‌లో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. విష్ణు ప్రియ లాడ్జి సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలికి 45 ఏళ్లు ఉంటాయని సమాచారం.