RangaReddy

News April 20, 2024

రంగారెడ్డి: ఇప్పటివరకు 757 చోట్ల తనిఖీలు

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 757 చోట్ల తనిఖీ నిర్వహించారు. వీటిలో రూ.7,32,95,639 విలువ చేసే నగదుతో పాటు, మద్యం ఇతర వస్తువులు పట్టుబడినట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి శశాంక తెలిపారు. అధికారులకు పట్టుబడిన దానిలో రూ.2,88,74,708 నగదు సహా రూ.4,18,700 కేజీల వెండి, చీరలు, మద్యం, డ్రగ్స్ ఇతర వస్తువులు పట్టుబడినట్లు తెలిపారు.

News April 20, 2024

HYDలో ఆదివారం మటన్‌ షాపులు బంద్

image

ఏప్రిల్ 21న (ఆదివారం) మహవీర్‌ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జైనులు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో‌ వీరి సంఖ్య ఎక్కువే ఉండడంతో ఆ రోజు భారీ ర్యాలీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో మాంసం దుకాణాలు (మటన్, పశువుల కబేళాలు, బీఫ్ షాపులు) మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. SHARE IT

News April 20, 2024

HYD: తెలంగాణ ఖ్యాతిని చాటిన తెలుగు తేజాలు

image

కరీంనగర్ వాసి పీచు నరేశ్ రెడ్డి, హైదరాబాద్ వాసి దండుగుల వెంకటేశ్‌లు నేపాల్‌లోని ఖుంజంగ్ మౌంట్ ఎవరెస్టు సమ్మిట్ బేస్ క్యాంపులో 5364 మీటర్ల ఎత్తు గల పర్వతాన్ని అధిరోహించి తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పారు. వారం రోజులపాటు సాగిన ఈ ట్రెక్కింగ్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను వారు ముగించుకున్నారు. ఎత్తైన పర్వతంపై భారతదేశపు మువ్వన్నెల జెండాను ఎగరవేయడం గర్వంగా అనిపించిందని ఈ తెలుగు తేజాలు పేర్కొన్నారు.

News April 19, 2024

HYD: పిడుగుపాటుతో రైతు మృతి

image

పిడుగుపాటుతో ఓ రైతు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన జంగయ్య శుక్రవారం సాయంత్రం తన పొలంలో పనిచేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో జంగయ్య పై పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

News April 19, 2024

సికింద్రాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లు 

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రోజు రోజుకీ రద్దీ మరింత పెరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని సమ్మర్ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ లిస్ట్ విడుదల చేశారు. ఏప్రిల్ 21 నుంచి జూన్ వరకు పలు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.

News April 19, 2024

నవాబుపేట మండలంలో భారీగా పట్టుబడిన నగదు

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుకున్నారు. మోమిన్ పేట్ సీఐ ఆంజనేయులు కథనం ప్రకారం.. నవాబుపేట ఎస్సై భరత్ భూషణ్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో రూ.1 కోటి 5 లక్షల నగదు పట్టుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని ఐటీ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

News April 19, 2024

HYD: సైబర్ నేరాల పై ఫిర్యాదు చేయటం ఇక ఈజీ!

image

రోజు రోజుకి 1930 సైబర్ హెల్ప్ లైన్ కాల్స్ పెరగటం, లైన్ బిజీ రావటం జరుగుతుంది. దీనికి అడ్డుకట్ట వేసి, వెంటనే స్పందించేందుకు ప్రతి స్టేషన్ పరిధిలోని సైబర్ యోధులకు(సైబర్ క్రైమ్ కానిస్టేబుల్) ప్రత్యేక సెల్ ఫోన్లు అందిస్తున్నారు. HYD, RR, MDCL, VKB జిల్లాలోనూ ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే వికారాబాద్‌లోని పలు స్టేషన్లలో అందజేశారు. 1930కు కాల్ చేసిన వెంటనే స్పందించి, సైబర్ నేరాలపై చర్యలు తీసుకోనున్నారు.

News April 19, 2024

HYD: జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్ల తొలగింపు: ఈసీ

image

హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. గత రెండేళ్లలో దాదాపు 60.6 లక్షల మంది కొత్త ఓటర్లు చేరినట్లు సీఈఓ వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగించినట్లు ఈసీ పేర్కొంది. చాంద్రాయణగుట్టలో 59,289 ఓట్లు, యాకుత్‌పురాలో 48,296 డూప్లికేట్ ఓట్లు గుర్తించామని ఎన్నికల సంఘం వెల్లడించింది.

News April 19, 2024

HYD: బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల అరెస్ట్

image

బ్లాక్‌లో IPL టికెట్లను అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులను సైబరాబాద్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ ప్రాంతంలో ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారన్న సమాచారంతో ముగ్గురు యువకులను పట్టుకుని వారి నుంచి 15 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సన్ రైజర్స్ V/s రాయల్ ఛాలెంజర్ టిక్కెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టికెట్ రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.

News April 19, 2024

HYD: BJPకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ

image

బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ రవీందర్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. నాటి ప్రధాని ఇందిరమ్మ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో రవీందర్ నాయక్ ఒకరు. రాష్ట్రంలో గిరిజనులను ప్రభావితం చేసే నాయకుడు కావడంతో పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం కాంగ్రేస్‌కు మరింతగా కలిసి రానుంది.