India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కిషన్ రెడ్డి వెంట రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్ ఉన్నారు. తనకు ఎంపీగా అవకాశం ఇచ్చిన బీజేపీ అధిష్టానానికి కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి ప్రజల ఆశీర్వాదం తనపై ఉందని నమ్ముతున్నట్లు తెలిపారు. మరోసారి ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వంశీచంద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. ఉదయం వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు.
దక్షిణ మధ్య రైల్వే తన రైలు నెట్ వర్క్‌లో ట్రాక్ పునరుద్ధరణ పనులకు సంబంధించి మునుపెన్నడూ లేని విధంగా 649 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధరణను పూర్తి చేయడం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పనితీరును సాధించిందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సిహెచ్ రాకేష్ తెలిపారు. ఇది జోన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఆర్థిక సంవత్సరంలో కూడా సాధించని అత్యుత్తమ రికార్డు అని ఆయన అన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల బెడదను తగ్గించేందుకు నిధులు అవసరమని, మణికొండ మున్సిపాలిటీకి సైతం నిధులు అవసరం పడతాయని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ వ్యక్తి పై కుక్కలు తీవ్రంగా దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యాడు. దీని పై స్పందించినా ఆయన, నిధులను సమకూర్చుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల పై ఉందన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్) మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
తల్లి, చెల్లిని పోషించలేకపోతున్నానని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శామీర్‌పేట పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాబాగూడకు చెందిన సంపత్ గౌడ్ (23) హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా చేసిన పనికి 2 నెలలుగా జీతాలు రాకపోవడంతో చేతిలో డబ్బులు లేకపోవడంతో తల్లితో చెప్పుకోలేకపోయాడు. బయటకు వెళ్తున్నట్లు చెల్లికి చెప్పి ఓ పాఠశాల సమీపంలో ఉరేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
HYD మాదాపూర్‌లోని NAC లో బీఈ, బీటెక్ సివిల్, బీఆర్క్, ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పీజీ డిప్లొమో కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ కోర్సులున్నాయని, డిప్లొమో చేసిన వారికి కన్ స్ట్రక్షన్ సేఫ్టీ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
బైకును కారు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికుల వివరాలు.. సరూర్ నగర్ PSలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధనుంజయ్ కుటుంబసభ్యులతో కలిసి బైకుపై ఘట్‌కేసర్‌లో ఓ ఫంక్షన్‌కి గురువారం వెళ్లారు. నేడు ఉదయం ఉప్పల్‌లోని తన నివాసానికి భార్య, పిల్లలతో కలిసి బయల్దేరారు. ఈ క్రమంలో పోచారం ఐటీ కారిడార్ వద్ద కారు వారి బైకును ఢీకొంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందగా.. భార్య, పిల్లలకు గాయాలయ్యాయి.
గ్రేటర్‌లో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. గతంలో నమోదైన రికార్డులను బ్రేక్ చేస్తూ.. గురువారం ఏకంగా 4,053 మెగావాట్లు నమోదు కావడం విశేషం. 2023 మే 19న అత్యధికంగా 3,756 మెగావాట్లు నమోదు కాగా.. 2024 ఏప్రిల్ 1న 3,832 మెగావాట్లు నమోదైంది. డిస్కం చరిత్రలో ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం జరగడం ఇదే తొలిసారి.
మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.54.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అధికారికి ఇచ్చిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.20.43 కోట్ల అప్పులు ఉన్నాయని, తనపై 54 కేసులు ఉన్నట్లు చెప్పారు. చేతిలో రూ. లక్ష నగదు, భార్య జమునకు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, వివిధ కంపెనీల్లో పెట్టబడులు ఉన్నాయన్నారు. కుటుంబానికి 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫారాలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.