India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హోలీ పండుగను పురస్కరించుకొని ఈనెల 14వ తేదీ ఉ.6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చారించారు.

నగర శివారులో భూగర్భజలాలు తగ్గడంతో వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి సమయంలో శంకర్పల్లి, జన్వాడ, పూర్ణనంద ఆశ్రమం రోడ్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో బోర్లువేసి కొందరు నీటిని తోడేస్తున్నారు. దీనివలన ఆయా ప్రాంతాల్లో లో ప్రెషర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాల్లో ఏకంగా 25 బోర్లను అధికారులు సీజ్ చేశారు.

HYDలోని రవీంద్రభారతిలో ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యకు ప్రాధాన్యమిచ్చే విద్యాశాఖకు రూ.21,650 కోట్లు కేటాయించామని, గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందన్నారు. విద్యాశాఖలో చివరి నుంచి పోటీపడే పరిస్థితికి తెలంగాణ దిగజారిందని, విద్యాశాఖ దిగజారడం ఆందోళనకరం, అవమానకరమన్నారు.

హెచ్‌సీయూ, ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ విశిష్ట ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రేపు మ.3 గంటలకు HCU క్యాంపస్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆడిటోరియంలో ఈ ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. HCU వీసీ ప్రొ.బీజేరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో ముఖ్యవక్తగా డెన్మార్క్‌లోని ఆర్హస్ యూని వర్సిటీ ప్రొ. సురేశ్ పాల్గొని ప్రసంగిస్తారన్నారు.

ఓయూ కేటగిరి-2 పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఈనెల 11తో గడువు ముగియగా.. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తేదీని రూ.2,000 లేట్ ఫీజుతో ఈనెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు.

హబ్సిగూడలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ‘అమ్మా.. నాన్న.. మీకు భారంగా ఉండలేక చనిపోతున్నాం. మీరు బాధపడకండి. అన్నా వదిన మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. నా వల్ల ఎప్పుడు మీకు బాధలే. ఏడవకు అమ్మ, నేను నిన్ను వదిలి వెళ్లిపోయా. ఈ బాధ కొద్ది రోజులే, నాకు జీవించాలని అనిపించడం లేదు. నా వరకు ఈ నిర్ణయం కరెక్టే’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.

ఉమ్మడి RR. HYD వ్యాప్తంగా ఎండ భగ్గుమంటోంది. గత 24 గంటల్లో మూసాపేటలో గరిష్ఠంగా 36.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగోల్, బాలానగర్‌లో 36 డిగ్రీలు, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉక్కపోత ఉంటుందని TGDPS తెలిపింది. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో మార్చి 13, 14 తారీఖుల్లో 37- 39 డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంది.

OUలో విద్యార్థులు కంగుతినే ఘటన వెలుగుచూసింది. మంగళవారం భోజనంలో రేజర్ బ్లేడు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. న్యూ గోదావరి హాస్టల్ మెస్‌లో రాత్రి విద్యార్థులు డిన్నర్ చేస్తున్నారు. ఆహారంలో బ్లేడ్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి నోట్లోకైనా వెళ్లి ఉంటే వారి పరిస్థితి ఏంటని వాపోయారు. నాణ్యమైన ఆహారం అందించాలంటూ ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదని మండిపడ్డారు.

బంగ్లాదేశీ మహిళల అక్రమ రవాణాను అరికట్టి బాధితులను ప్రజ్వల షెల్టర్ హోమ్‌కు తరలించిన ఘటనలో ప్రతిభ కనబరిచిన ఫిలింనగర్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పంజాగుట్ట కానిస్టేబుల్ లావణ్యకు HYD సీపీ సీవీ ఆనంద్ రివార్డులు అందజేశారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టడంలో వీరు చూపిన శ్రద్ధ, అంకితభావాన్ని కొనియాడారు. వీరందరిని పునరావాస కేంద్రానికి తరలించడంలో కీలకపాత్ర పోషించారన్నారు.

HYDతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెల మొదటి వారంలోనే గరిష్ఠంగా 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. HYDలో మధ్యాహ్నం 2, 3 గం.ల వరకు సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. ఏప్రిల్, మే నెలలో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.