RangaReddy

News April 18, 2024

సికింద్రాబాద్: ప్రజలకు నివేదిక అందించిన కిషన్ రెడ్డి

image

ఐదేళ్ల పదవీకాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం ప్రజలకు నివేదిక అందించారు. నగరంలోని బస్తీ దవాఖానాలు, క్రీడా వసతులను మెరుగుపరచడం, మహిళల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వివిధ రూపాల్లో రూ.10 లక్షల కోట్ల నిధులు అందించిందని తెలిపారు. మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.

News April 18, 2024

HYD: FREE కోచింగ్ కోర్సులు.. అర్హతలు

image

HYD నగరం NACలో గ్రామీణ యువకులకు ఉచిత కోచింగ్.. 
✓స్టోర్ సూపర్వైజర్-డిగ్రీ 
✓స్ట్రక్చర్ సూపర్వైజర్-ఇంటర్ 
✓లాండ్ సర్వేయర్-ఇంటర్ 
✓ఎలక్ట్రికల్,హౌజ్ వైరింగ్- SSC 
✓ప్లంబింగ్ అండ్ శానిటేషన్, డ్రైవాల్ అండ్ ఫాల్ సీలింగ్,వెల్డింగ్,పెయింటింగ్, డెకొరేషన్-5వ తరగతి 
✓డ్రైవాల్ అండ్ ఫాల్ సీలింగ్- 5వ తరగతి 
✓JCB బ్యాక్ హోల్డర్ ఆపరేటర్-5వ తరగతి చదివిన వారు అర్హులు •ఆసక్తి కల వారు NAC విద్యాసంస్థలో సంప్రదించండి

News April 18, 2024

HYD: FREE కోచింగ్ మీకోసమే.. త్వరపడండి!

image

HYD కొండాపూర్ పరిధిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్(NAC) ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని ఐజీఎంఎం, ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. 18-35 ఏళ్లలోపు వారికి ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తూ 3 నెలలపాటు ఆయా కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

News April 18, 2024

HYD: ఈతకు వెళ్లి ఇద్దరి మృతి

image

జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి మిధుల నగర్ క్వారీ గుంతలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పోలీసుల ప్రకారం.. అయాన్(16), నవాజ్(16), హైదర్(15) ఈతకోసం దిగారు. సమాచారం అందుకున్న బాచుపల్లి ఎస్సై మహేష్ వెంటనే స్పందించి, ఘటనా స్థలానికి చేరుకొని హైదర్‌ని రక్షించాడు. ఇద్దరు అయాన్, నవాజ్ మృత దేహాలు లభ్యమయ్యాయి. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 18, 2024

HYD: నివేదితకు బీఫాం అందజేసిన కేసీఆర్

image

కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నకు కేసీఆర్ బీఫాంను, రూ.40 లక్షల చెక్కును తెలంగాణ భవన్‌లో అందించారు. ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని కేసీఆర్ ఆమెను ఆశీర్వదించారు. ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా నిర్వహించి, ప్రజలందరి మన్ననలు పొందాలని సూచించారు. సర్వేలు, దివంగత ఎమ్మెల్యేలు సాయన్న-లాస్యనందిత అందించిన సేవలవైపే ఉన్నాయని అన్నారు.

News April 18, 2024

కూకట్పల్లి: JNTUH పరీక్ష ఫీజుల స్వీకరణ తేదీలు

image

కూకట్పల్లిలోని JNTUH యూనివర్సిటీలో బీటెక్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి వివిధ సెమిస్టర్ల పరీక్ష ఫీజుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు తెలియజేశారు. విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించాలని JNTUH సూచించింది. ఎలాంటి అధికారం లేకుండా నేటి నుంచి మే రెండవ తేదీ వరకు అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. తర్వాత ఫీజు చెల్లిస్తే అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది.

News April 18, 2024

HYD: FAKE ప్రచారం చేయకండి: TSSPDCL

image

HYD నాంపల్లి కోర్టులో నేడు మధ్యాహ్నం క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుండగా పవర్ కట్ అయిందని, చీకటిలోనే జడ్జి వాదనలు విన్నారని కొందరు X వేదికగా వైరల్ చేశారు. దీని పై స్పందించిన TSSPDCL, నిర్ధారించని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని కోరింది. కరెంటు సరఫరాలో ఎలాంటి సమస్య లేదని, అంతర్గత సమస్య వెళ్లే జరిగిందని తెలిపింది. ఫిర్యాదు చేసిన లాయర్ విజయ్ గోపాల్ సైతం దగ్గరుండి చూశారని పేర్కొంది.

News April 18, 2024

HYD: ప్రజలారా.. జాగ్రత్త..! ఎండ దంచి కొడుతోంది 

image

HYD, RR, MDCL, VKB జిల్లాలలో నేటి నుంచి రాగల 5 రోజుల వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలియజేసింది. ఏకంగా 41 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పలుచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉందని, కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేసింది.

News April 18, 2024

అప్‌డేట్: BJPలో చేరిన ఉప్పల్ మాజీ MLA

image

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి(BRS) గురువారం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ నామినేషన్‌లో భాగంగా మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన BJP పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈటలకు మద్దతుగా నిలుస్తానని సుభాష్ రెడ్డి ప్రకటించారు.

News April 18, 2024

HYD: వైట్‌ మార్బుల్‌‌ స్టోన్‌తో చార్మినార్ (AI PHOTO)

image

చారిత్రక కట్టడం చార్మినార్‌ AI ఫొటోలు నెట్టింట్‌లో వైరల్ అవుతున్నాయి. నేడు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన చిత్రాలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వైట్ మార్బుల్ స్టోన్‌తో నిర్మిస్తే ఇలా ఉంటుంది అని కళ్ళకు కట్టినట్లుగా డిజైన్ చేశారు. సుమారు 425 ఏళ్ల చరిత్ర కలిగిన చార్మినార్‌ను‌ గ్రానైట్, సున్నపురాయి ఉపయోగించి నిర్మించిన సంగతి తెలిసిందే.