RangaReddy

News April 17, 2024

వికారాబాద్: జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

♥UPSCలో ర్యాంకు సాధించిన వారికి.. KTR, పలువురు నేతల అభినందనల వెల్లువ
♥సర్వం సిద్ధం.. రేపటి నుంచి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
♥జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు.. పలుచోట్ల శోభాయాత్రలు 
♥పకడ్బందీగా పార్లమెంట్ ఎన్నికలు: అడిషనల్ కలెక్టర్ 
♥VKB: RSP నాకు ఇన్స్పిరేషన్: సివిల్స్ ర్యాంకర్ తరుణ్ కుమార్ 
♥శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు: స్పీకర్ గడ్డం ప్రసాద్

News April 17, 2024

HYD: వామ్మో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇది!

image

HYD నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. వేసవి వేళ HYD నగరంలో నివసిస్తున్న విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులు భారీ సంఖ్యలో ప్రయాణం సాగిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో సమ్మర్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నప్పటికీ సరిపోవడం లేదు. ప్రస్తుత రద్దీని చూసి, నేడు మరో 10 స్పెషల్ రైళ్లకు SCR అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

News April 17, 2024

సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మరికొన్ని స్పెషల్ ట్రైన్లు

image

వేసవి వేళ రద్దీని పరిగణనలోకి తీసుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సికింద్రాబాద్ సహా పలు స్టేషన్ల నుంచి మరికొన్ని స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ జంక్షన్ వెళ్లేందుకు ఏప్రిల్ 21, 28, మే 5, 12, 19, 26, జూన్ 2, 9, 16, 23, 30వ తేదీలలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

News April 17, 2024

HYD: శ్రీరామ శోభాయాత్రలో దొంగల బీభత్సం

image

శ్రీరామ శోభాయాత్రలో దొంగలు చేతివాటం చూపించారు. పలువురు భక్తుల నుంచి సెల్‌ఫోన్లు, ఆభరణాలు అపహరించారు. దాదాపు 16 సెల్‌ఫోన్లు, 3 బంగారు గొలుసులు, ఒక బ్రాస్‌లెట్ చోరీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు పాతబస్తీ మంగళ్‌హాట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

News April 17, 2024

HYD: కోడి ఈకలతో బయో ప్లాస్టిక్!

image

పర్యావరణానికి హాని కలిగిస్తున్న సింథటిక్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు HYD తార్నాకలోని IICT కృషి చేస్తుంది. ఇప్పటికే సింథటిక్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ వ్యర్థాలతో బయోపాలిమర్లను తయారు చేసిన ఆ సంస్థ, తాజాగా కోడి ఈకలతో బయో ప్లాస్టిక్ రూపొందించడం పై దృష్టి పెట్టినట్లు తెలిపింది. మెడికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ అవసరాలకు అనువుగా ఉండేలా తయారీకి కసరత్తు చేస్తుంది.

News April 17, 2024

వివిధ బీఈడీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ బీఈడీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ (ఎంఆర్ఐ), బీఈడీ (ఎల్డీ), బీఈడీ (హెచ్ఐ), బీఈడీ (ఏఎస్ఐ) తదితర కోర్సుల సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News April 17, 2024

ఓయూ పరిధిలోని బీసీఏ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 30లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

News April 17, 2024

HYD: వాహన తనిఖీలు.. నగదు స్వాధీనం

image

శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.5 లక్షల 35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిస్సాన్ కారులో హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వైపు వెళ్తున్న రంజిత్ గౌడ్ అనే వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు.

News April 17, 2024

శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు: స్పీకర్ గడ్డం

image

శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలియజేశారు. లంగర్ హౌస్‌లోని త్రివేణి సంగమం ఆలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాములను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పీఠాధిపతి రాహుల్ దాస్ బాబా ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. శ్రీరాముని అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు.

News April 17, 2024

HYD: మహిళ అనుమానాస్పద మృతి

image

ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మేడ్చల్ PS పరిధి రైల్వే కాలనీలోని ఓ వెంచర్‌లో జరిగింది. కుళ్లిపోయిన మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలను సేకరించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ వయసు సుమారు 45 నుండి 50 ఉంటుందని భావిస్తున్నారు.