India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సరూర్ నగర్‌లోని అలకనంద ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసులో సోమవారం డా.రాజశేఖర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు పవన్ విదేశాలకు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఆయన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు తాజాగా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అయితే HYD నగరంలో దాదాపు 90 వరకు ఆపరేషన్లు జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
HYDలోని సోమాజిగూడలో మనవడి చేతుల్లో తాత జనార్దనరావు హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే పోలీసులు మనవడు కీర్తితేజను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 4 రోజుల కస్టడీ సోమవారం ముగియగా.. బీఎస్ మక్తాలోని ప్రార్థన మందిరం సమీపంలో హత్యకు ఉపయోగించిన కత్తి, ధరించిన దుస్తులను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కాగా మంటల్లో కాలిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి నిప్పంటించుకున్న ఘటన మధురానగర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. యాదగిరినగర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యకు సూర్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మద్యం తాగి ఇంటికి వచ్చి ‘మీ భార్యను నాకు ఇచ్చేయ్, జీవితాంతం సంతోషంగా చూసుకుంటా’అని భర్తతో అన్నాడు. భర్త ఆగ్రహించడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. HYDలో వివిధ సంఘాలు సమావేశం అయ్యాయి. ఛత్రపతి సేవలు నేటి తరానికి తెలియజేయాలని కోరారు. ప్రతీ హిందువు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలుసుకోవాలన్నారు. హిందువుల మనోభావాలకు అనుకూలంగా ఆయన జయంతి (ఫిబ్రవరి 19)కి సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
HYDలో ఓ వ్యక్తి ఏకంగా 13 ఏళ్లుగా పేదల కడుపు నింపుతున్నాడు. పేదల బాధను చూసిన అతడు ఆకలికి మతం లేదంటాడు. ఆయనే సామాజికవేత్త అజహర్ మాక్సూసి. చంచల్ గూడ, డబిర్‌పూర ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద కూడు, గూడులేని వారికి 4,720వ రోజు పేదలకు భోజనం పెట్టాడు. సేవ చేయడంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటున్నానని తెలిపారు. తన సేవలను అభినందిస్తూ ప్రజలు ‘Keep it Bhai’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్ ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ.. 46 రోజులపాటు నుమాయిష్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సొసైటీ సభ్యులు నిర్వహించారని, నుమాయిష్ నుంచి వచ్చే డబ్బుల ద్వారా 20 విద్యాసంస్థలు నడుస్తాయన్నారు. నుమాయిష్‌కు ఇంకా ప్రాచుర్యం తెస్తామని మంత్రి పేర్కొన్నారు.
గ్రేటర్ HYDలో GHMC స్వచ్ఛ ఆటోల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దుర్గంధ భరితపు వాసనను భరిస్తూ ఇబ్బందులు పడుతూ ఇంటి నుంచి చెత్త సేకరించి, నగర స్వచ్ఛతకు బాసటగా నిలుస్తారు. HYDలో ఓ స్వచ్ఛ ఆటోలో చెత్త బ్యాగులపైన బాలుడు ఉండటం వారి కష్టానికి నిదర్శనం అని పలువురు ట్వీట్లు చేస్తున్నారు. CREDIT: ఫొటో జర్నలిస్ట్ లోగనాథన్
హైదరాబాద్‌లో పైసా ఖర్చులేకుండానే ఓ జంట వివాహం చేసుకుంది. అది కూడా కేవలం రెండు నిమిషాల్లోనే. శంషాబాద్‌లోని కన్హా శాంతివనంలో సర్వేశ్వరానంద్, శ్రీవాణి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆమె మెడలో తాళి కట్టాడు. ప్రశాంతమైన శాంతి వనంలో ఆర్భాటం లేకుండా ఆ జంట వివాహమైంది.
HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్ నేటితో ముగియనుంది. ఆదివారం సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ తెలిపింది. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్‌లో వందల సంఖ్యలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. రూ. 50 ఎంట్రీ ఫీజు ఉంది. 5 ఏళ్లలోపు పిల్లలకు ఉచితం. నగరవాసులు చివరిరోజు పోటెత్తే అవకాశం ఉండడంతో తగు ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్‌లోని క్రికెట్ ప్రియులకు గుడ్‌న్యూస్. IPLకు ఉప్పల్ స్టేడియాన్ని సర్వం సిద్ధం చేస్తున్నట్లు HCA ప్రెసిడెంట్ జగన్ తెలిపారు. స్టేడియంలో నూతనంగా సీట్లను అమర్చుతున్నారు. వెస్ట్, ఈస్ట్ స్టాండ్‌లపై అభిమానుల సౌకర్యార్థం పందిరి వేస్తున్నట్లు పేర్కొన్నారు. IPL నిర్వహణలో హైదరాబాద్ అత్యుత్తమ హోస్ట్‌గా నిలుస్తుందని, ఇందుకు కృషి చేస్తామని జగన్ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.