RangaReddy

News April 13, 2024

LB నగర్‌‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

హైదరాబాద్ LB నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు రవి, ప్రణయ్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2024

HYD: ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు కోవర్టుల భయం!

image

పార్లమెంటు ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు కోవర్టుల భయం పట్టుకుంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తమ బలంతో పాటు బలహీనతలు ప్రత్యర్థులకు చేరుతున్నాయనే అనుమానాలతో అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గోప్యత పాటించాల్సిన అంశాలను బయటకు పొక్కకుండా ఎలా చూడాలోనని ఆందోళన చెందుతున్నారు.

News April 13, 2024

HYD: SCR ఆధ్వర్యంలో 16 రైళ్ల సేవలు పొడగింపు

image

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో నడుపుతున్న 16 ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్టు సికింద్రాబాద్ డివిజన్ SCR అధికారులు Xలో ప్రకటించారు. చెన్నై-సంత్రాగచ్చి, భువనేశ్వర్-చెన్నై, ఎర్నాకులం-బరంపూర్, బెంగళూరు-కలబురిగి, నాగర్‌సోల్-దిబ్రూగఢ్ తదితర స్టేషన్ల మధ్యనడుస్తున్న ఈ రైళ్లు ఈ నెల 13 నుంచి జూన్ 15 వరకు రాకపోకలు కొనసాగిస్తాయని వివరించారు.

News April 12, 2024

HYD: రూ.29 భారత్ RICE.. మరికొన్ని కేంద్రాల లిస్ట్!

image

సిర్వి ట్రేడర్స్ బోడుప్పల్, శంకర్ ట్రేడింగ్ కంపెనీ సికింద్రాబాద్, శ్రీగోవింద ట్రేడర్స్ కాచిగూడ, శ్రీవీరభద్ర ట్రేడర్స్ కవాడిగూడ, శ్రీఅంబా ట్రేడర్స్ హైదరాబాద్, శ్రీబాలాజీ రైస్ డిపో రాంనగర్, శ్రీసాయిబాబా రైస్ డిపో కార్వాన్, శివ సాయి రైస్ ట్రేడర్స్ కర్మాన్ ఘాట్, శ్రీసాయి ట్రేడర్స్ కొత్తపేట, శ్రీ ట్రేడర్స్ చందానగర్, ఉజ్వల్ ట్రేడర్స్ మల్లేపల్లి, ఉప్పు రాజయ్య ట్రేడర్స్ షాపూర్ నగర్, రిలయన్స్ దేవరయంజాల.

News April 12, 2024

HYD: ఈ లొకేషన్లలో కిలో బియ్యం రూ.29 మాత్రమే!

image

HYD నగరంలో కిలో రూ.29 భారత్ రైస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఏపీ రైస్ స్టోర్ మెట్టుగూడ, చంద్రమౌళి ట్రేడర్స్ కార్వాన్, ధనలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ SR నగర్, డింగ్ డాంగ్ సూపర్ మార్కెట్, కాప్రా గౌతమ్ రైస్ డిపో, లంగర్ హౌజ్ జై తుల్జా భవాని ఏజెన్సీ, ఆర్కేపురం మాణిక్య ట్రేడర్స్, మురళి కిరాణా అండ్ జనరల్ స్టోర్ పటాన్ చేరు, ముత్తయ్య గ్రాండ్ బజార్ శేర్లింగంపల్లి, కైసర్ కిరాణా అండ్ జనరల్ స్టోర్ HYDలో పొందవచ్చు.

News April 12, 2024

HYDలో రూ.29 భారత్ రైస్ అమ్మకాలు షురూ 

image

HYD ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రేటర్ HYD పరిధిలో 24 కేంద్రాల్లో భారత్ రైస్ విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 10 కిలోల బ్యాగులు అందిస్తున్నట్లుగా వెల్లడించారు. కిలో భారత్ రైస్ రూ.29కాగా.. 10 కిలోల బ్యాగుకు రూ.290 చెల్లించాల్సి ఉంది.

News April 12, 2024

ఈనెల 18న హైదరాబాద్‌కు రాజ్ నాథ్ సింగ్

image

హైదరాబాద్‌లో రెండు రోజులు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించనున్నారు. ఈనెల 18న హైదరాబాద్‌కు వచ్చి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 19న కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జరిగే ప్రచార సభలో పాల్గొని ఓట్లు అభ్యర్థిస్తారు .

News April 12, 2024

BREAKING.. HYD: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

image

మేడ్చల్ జిల్లా కాప్రా పరిధి సాయినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రెండు అంతస్తుల భవనం దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఈసీఐఎల్‌లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శివాని(18) చనిపోయింది. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 12, 2024

HYD: యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు

image

మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడిపై కాచిగూడ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కి తరలించారు. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హబీబ్ నగర్‌కు చెందిన బాలాజీ వృత్తి రిత్యా కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాచిగూడ పీఎస్ పరిధిలోని ఓ బస్తీకి చెందిన మైనర్ బాలికను బాలాజీ 6 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

News April 12, 2024

HYD: రోజురోజుకి నగరంలో పెరుగుతున్న కాలుష్యం

image

HYD నగరంలో రోజురోజుకీ కాలుష్యం పెరుగుతోంది. నగరంలో నమోదవుతున్న కాలుష్య స్థాయిల్లో సింహభాగం రవాణా విభాగం నుంచే ఉంటోందనేది పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత పరిమితుల ప్రకారం పీఎం 2.5 ఘనపు మీటరు గాలిలో 40 మైక్రోగ్రాములకు మించొద్దు. సనత్ నగర్, ఇక్రిశాట్, జూపార్కు, పాశమైలారం ప్రాంతాల్లో అంతకు మించి నమోదైనట్టు పీసీబీ నివేదికలు వెల్లడించాయి.