India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండగను పురస్కరించుకొని నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మ్యూజియం మూసి ఉంటుందని పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
HYD మెట్రో సంస్థ సూపర్ సేవర్ హాలిడే కార్డు, పీక్ హవర్ డిస్కౌంట్ కార్డు, స్టూడెంట్ మెట్రోపాస్ కార్డును ఏప్రిల్ 9న రీ లాంచ్ చేసినట్లుగా తెలిపింది. ఏప్రిల్ 9 నుంచి 6 నెలల వరకే ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొన్నారు. అయితే, ఏప్రిల్ నెల నుంచి మరో ఆరు నెలల వరకు హాలిడేల లిస్ట్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. వెంటనే హాలిడేస్ లిస్ట్ విడుదల చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
వేసవి వేళ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. HYD నుంచి కటక్ ఏప్రిల్ 16, 23, 30న, సికింద్రాబాద్ నుంచి ఉదయ్‌పూర్ ఏప్రిల్ 16, 23 తేదీలలో రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు. రిటర్న్ జర్నీకి సైతం అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
HYD ఉస్మానియా యూనివర్సిటీ CELTలో 8, 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ అండ్ పర్సనల్ డెవలప్‌మెంట్ సర్టిఫికెట్ కోర్సును నెలరోజుల పాటు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గలవారు 79899 03001కు కాల్ చేసి ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 8, 9, 10వ తరగతి వాళ్లకి ఉ.8:15 నుంచి ఉ.9:45 వరకు, ఇంటర్ వాళ్లకి ఉ.6:30 నుంచి ఉ.8 వరకు తరగతులు ఉంటాయన్నారు.
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్(ఈద్-ఉల్-ఫితర్)ను నేడు జరుపుకోవాలని రుహియ్యతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) సభ్యులు తెలిపారు. బుధవారం రంజాన్ చివరి రోజుగా పరిగణించి ఉపవాసం పాటించారు. గురువారం షవ్వాల్ 1వ తేదీ (ఏప్రిల్ 11)గా పరిగణించి పండుగ జరుపుకోవాలని సూచించారు. మక్కా మసీద్, మల్లేపల్లి మసీద్, తాండూరు మసీద్, HYD, RRలోని తదితర ఈద్గా మైదానాల్లో ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేశారు.
బాచుపల్లి PS పరిధిలో ఈ నెల 1న జరిగిన పిల్లి తేజస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గత ఏడాది తన స్నేహితుడు తరుణ్ హత్యకు ప్రతీకారంగా తేజస్‌ను చంపేశారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి 6 సెల్‌ఫోన్స్, 4 టూ వీలర్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ BED హాస్టల్ మెస్‌లో నాణ్యత ఉండడం లేదని విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఉదయం ఇడ్లీ తింటుంటే ప్లేట్‌లో బల్లి కనిపించడంతో ఖంగుతిన్నామన్నారు. ఆగ్రహంతో చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తక్షణమే తమ మెస్‌ను చీఫ్ వార్డెన్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సంఘటనపై విచారణ జరిపిన అధికారులు మెస్‌లోని నలుగురు సిబ్బందిని బదిలీ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారని BJP మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూసి ఓటు వేయలేదన్నారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అయినా కూడా ఇప్పుడు మరోసారి 17 ఎంపీ సీట్లు గెలిపించండి అంటూ ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారని ఈటల దుయ్యబట్టారు. దీనిపై మీ కామెంట్?
HYDలోని పుస్తక ప్రేమికులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కాన్ కోర్స్ లెవెల్ వద్ద ఉచితంగా లైబ్రరీ ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. నేడు ఉదయం 10 గంటలకు ఇది ప్రారంభం కాగా.. ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుందని, నగర ప్రజలు బుక్ ఫెయిర్ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
బీజేపీ సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కి మరో షాక్ తగలనుంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు ప్రతాప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన జంపన ఈరోజు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.