RangaReddy

News April 9, 2024

గాంధీ ఆస్పత్రిలో డయాగ్నొస్టిక్ సేవలు ఇలా..!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నాణ్యమైన డయాగ్నొస్టిక్ సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతినెల దాదాపుగా 100 అల్ట్రా సౌండ్ స్కానింగ్ 3,000 సీటీ స్కాన్, సుమారు 700 ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో MRI ప్రారంభం కాకపోవడం వల్ల, గాంధీ ఆసుపత్రికి MRI స్కానింగ్ కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

News April 9, 2024

HYD: ఇది అల్లం కాదు విషం.. జర జాగ్రత్త..!

image

గ్రేటర్ HYDలో కల్తీ ఆహార పదార్థాల తయారీ ఘటనలు తరచూ వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. రసాయనాలు ఉపయోగించి తయారు చేస్తున్న ఆహార పదార్థాలు చివరకు విషంలా మారి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. తాజాగా HYD జల్‌పల్లి పరిధి శ్రీరామ కాలనీలో కుళ్లిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారు చేస్తున్న ఓ కార్ఖానాపై ఎల్బీనగర్ SOTపోలీసులు దాడులు చేశారు. నకిలీ డబ్బాలను స్వాధీనం చేసుకుని పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు.

News April 9, 2024

హైదరాబాద్ పౌరులను కదిలించాలని ఆదేశాలు 

image

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత MP ఎన్నికల్లో ఓటింగ్ 50 శాతం దాటలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం (EC) భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నగర ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చైతన్యాన్ని పెంపొందించాలని ఈసీ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. 

News April 9, 2024

HYD: జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్స్ సిద్ధం చేయాలి: కమిషనర్ 

image

రాబోయే వర్షాకాలానికి సంబంధించి తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. శిథిలావస్థలోని భవనాలను గుర్తించి వాటి ద్వారా ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్స్ సిద్ధం చేయాలన్నారు. సర్కిళ్లలో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ ఆటంకాలు లేకుండా ప్లాన్స్ రూపొందించాలన్నారు.

News April 9, 2024

HYD: భారీగా పెరిగిన సన్న బియ్యం ధర 

image

సామాన్యులకు సన్న బియ్యం ధర దడ పుట్టిస్తోంది. HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతోంది. యాసంగిలో వరి సాగు తగ్గడంతో రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింతగా ఉండనుంది. మార్కెట్‌లో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని బియ్యాన్ని బ్లాక్‌ చేస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీ కామెంట్?

News April 9, 2024

HYD: సైబర్ ముఠా ఆట కట్టిస్తాం: సీపీ

image

అమాయక ప్రజలను మాయమాటలతో మోసగిస్తున్న సైబర్ ముఠాల ఆటలు కట్టిస్తామని రాచకొండ సీపీ తరుణ్ జోషి అన్నారు. HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల నమోదు, దర్యాప్తులో పాటించాల్సిన పద్ధతులపై PSల ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల దర్యాప్తులో యూరప్ దేశాల పోలీస్ వ్యవస్థ కంటే భారత పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు.

News April 9, 2024

HYD: ‘ఉగాది’.. కల్పిస్తోంది ఉపాధి..!

image

శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండగ నేపథ్యంలో కుమ్మరులు ఉపాధి పొందుతున్నారు. పండగ వేళ షడ్రుచులతో కూడిన పచ్చడిని మట్టి పాత్రల్లో తయారు చేసి స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. పండగను దృష్టిలో పెట్టుకుని HYD, ఉమ్మడి RRలోని కుమ్మరులు నెల రోజుల నుంచే మట్టి పాత్రలను ప్రత్యేకంగా తయారు చేశారు. వారం రోజుల నుంచి ప్రధాన కూడళ్లలో విక్రయానికి ఉంచారు. పాత్ర పరిమాణాన్ని బట్టి రూ.80-రూ.120 వరకు విక్రయిస్తున్నారు.

News April 9, 2024

HYD: పెళ్లి చేసుకోనని గొంతు కోసుకున్నాడు..!

image

యువతిని పెళ్లి చేసుకోనని ఓ యువకుడు గొంతు కోసుకున్న ఘటన HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్‌లో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాలు.. RR జిల్లా కడ్తాల్ వాసి అశోక్(21) దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. అతడికి అచ్చంపేటకు చెందిన యువతి(19) ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆమెను ప్రేమ పేరిట లోబర్చుకుని ముఖం చాటేయడంతో PSలో ఫిర్యాదు చేసింది. ఆమెను పెళ్లి చేసుకోనని అశోక్ గొంతు కోసుకున్నాడు. 

News April 9, 2024

HYD: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

image

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD పటాన్‌చెరు పరిధి  అమీన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణఖేడ్ వాసి కృష్ణ(33) అమీన్‌పూర్ పురపాలక పరిధి మల్లారెడ్డి కాలనీలోని గెరడా అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా 10 రోజులుగా పనిచేస్తున్నాడు. అతడి భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో మనస్థాపానికి గురైన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 9, 2024

HYD: నేడు సాలార్‌జంగ్ మ్యూజియానికి సెలవు

image

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు సాలార్‌జంగ్ మ్యూజియం మూసి ఉంటుందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈరోజు పండుగ సెలవు నేపథ్యంలో సాలార్‌జంగ్ మ్యూజియంను సందర్శించడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.