RangaReddy

News March 21, 2024

HYD: జీరో బిల్లు రానివారికి ప్రత్యేక కౌంటర్లు

image

అన్ని అర్హతలు ఉండీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు రానివారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, ఆహారభద్రత వివరాలు తప్పుగా నమోదు వంటి కారణాల వల్ల అనేకమంది జీరో బిల్లుకు దూరమయ్యారు. ఇలాంటి వారు తమ వివరాలు సరిచేసుకునేందుకు మండల పరిషత్తు, మున్సిపల్, GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.

News March 21, 2024

HYD: ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాం: సీఎస్

image

ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై గురువారం HYDలోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

News March 21, 2024

HYD: ‘అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ను లోకల్‌ కాల్‌గా మారుస్తున్నారు’

image

ఇంటర్‌నెట్ సాయంతో అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ను లోకల్‌ కాల్‌గా మారుస్తున్న హిదాయత్‌అలీ(40), అహ్మద్‌(40)ను అరెస్ట్ చేశామని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. వీరి వద్ద 3 యాక్ట్‌ ఇంటర్‌నెట్ కనెక్షన్‌లు, సిమ్‌ కార్డ్‌ బాక్స్‌లు(32 స్లాట్‌లు), 3 రూటర్‌లు, 6 లాప్‌ట్యాప్‌లు, 2 హార్ట్‌ డిస్క్‌లు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ శ్రీనివాసరావు, డీసీపీ ఎస్‌.రేష్మీ పెరుమాళ్‌ వెల్లడించారు.

News March 21, 2024

HYD: BRS మాజీ నేతలకే.. ఆ పార్టీల్లో టికెట్?

image

HYD, ఉమ్మడి RRలోని పార్లమెంట్ స్థానాల్లో BRS మాజీ నేతలకే రెండు జాతీయ పార్టీల్లో టికెట్లు వస్తుండడం గమనార్హం. BRSను వీడి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌కు టికెట్ కన్ఫర్మ్ కాగా సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి కూడా టికెట్ ఇస్తారని సమాచారం. ఇక BRSను వీడి BJPలో చేరిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఇప్పటికే టికెట్లు కన్ఫర్మ్‌ అయ్యాయి. దీనిపై మీ కామెంట్?

News March 21, 2024

HYD: బాలికను బంధించి అత్యాచారం.. పదేళ్ల తర్వాత శిక్ష

image

అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. గచ్చిబౌలి PS పరిధిలో ఉండే బాలిక మీద కన్నేసిన శివకృష్ణ (22).. 2014, అక్టోబర్‌‌లో కిడ్నాప్ చేశాడు. ఓ గదిలో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బుధవారం విచారణకు రాగా 10 ఏళ్ల జైలు శిక్ష, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.

News March 21, 2024

HYD: UPDATE: లవ్‌లో కూతురు.. ఉరేసి చంపిన తల్లి జైలుకు

image

ఇబ్రహీంపట్నం మం. దండుమైలారంలో కూతురిని చంపిన తల్లికి పోలీసులు రిమాండ్‌‌ విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బావను పెండ్లి చేసుకోవాలని పేరెంట్స్‌ భార్గవి(19) మీద ఒత్తిడి తెచ్చారు. ఇది ఆమెకు నచ్చలేదు. మంగళవారం శశి(ప్రియుడు)ని ఇంటికి పిలిచి మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ చూసింది. కోపంతో కూతురిని కొట్టి, చీరతో ఉరేసి చంపేసింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జంగమ్మను అరెస్ట్ చేశారు.

News March 21, 2024

HYD: గ్రీన్ ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలకు FREE

image

హైదరాబాద్‌లో 23 గ్రీన్‌ ఎలక్ట్రిక్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు రోడ్డెక్కాయి.
బస్సులు తిరిగే రూట్‌లు, బస్సుల సంఖ్య:
*సికింద్రాబాద్-మణికొండ రూట్‌‌: 12
*పటాన్‌చెరు-CBS రూట్‌‌: 6
*పటాన్‌చెరు-కోఠి రూట్‌: 5
ప్రతి 10, 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులన్నింటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.
SHARE IT

News March 21, 2024

హైదరాబాద్‌లో పార్కింగ్‌పై స్పెషల్ ఫోకస్

image

నగరంలో ప్రజలకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని పూర్తి ప్రణాళికను తయారు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగరంలో ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యలపై చర్చించారు. కాంప్రహెన్సివ్ పార్కింగ్ పాలసీ తయారు చేసేందుకు అధికారులు విధివిధానాలను సిద్ధం చేయాలని సూచించారు.

News March 21, 2024

రాజధానిలో లోక్‌సభ అభ్యర్థులు వీళ్లే..!

image

*సికింద్రాబాద్‌: కిషన్ రెడ్డి(BJP) ఖరారు. దానం(INC), పద్మారావు (BRS) అని సమాచారం. *మల్కాజిగిరి: ఈటల(BJP), రాగిడి(BRS) ఖరారు. సునీతా మహేందర్ రెడ్డి(INC) అని సమాచారం. *చేవెళ్ల: కొండా విశ్వేశ్వరరెడ్డి(BJP), కాసాని (BRS) ఖరారు. రంజిత్ రెడ్డి(INC) అని సమాచారం. * హైదరాబాద్: మాధవీలత(BJP), అసదుద్దీన్(MIM) పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నుంచి ఒక్క HYD MP అభ్యర్థిని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంది.

News March 21, 2024

HYD: వైద్యంలో డ్రోన్ టెక్నాలజీ.. ఇక సులభం!

image

HYDలోని ICMR, JNTU ఆచార్యులు వైద్య రంగంలో డ్రోన్ టెక్నాలజీ పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించారు. రాజధాని సహా శివారు ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త, మూత్ర నమూనాలను డ్రోన్స్ ద్వారా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఒక్కోటి 60-75 KM దూరాన్ని చేరుకునేలా సాఫ్ట్‌వేర్ రూపొందించామని, ముగ్గురు డ్రోన్ పైలెట్లు వీటిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాణాధార మందులను సైతం పంపిస్తున్నట్లు తెలిపారు.

error: Content is protected !!