India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు హత్యలు జరిగాయి. నేడు పట్టపగలు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై గూగులోత్ ఉమేశ్ (23)ను వెంబడించి మరీ అతని తమ్ముడు రాకేశ్ మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు సొసైటీ బుకింగ్ కమిటీ కన్వీనర్ సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఓ విషాద గాథ ఆలస్యంగా వెలుగుచూసింది. సంతోష్‌నగర్ పోలీసుల వివరాలు.. PSపరిధిలో ఉండే మహ్మద్ ఇమ్రాన్, చాంద్రాయణగుట్టకు చెందిన యువతి ప్రేమికులు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తండ్రి ఇమ్రాన్‌పై కోపంతో తన కూతురిని వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేయించాడు. ఈ మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకున్నాడు. వాలంటైన్‌డే రోజు ఇలా జరగడం స్థానికంగా విషాదం నింపింది.
HYDలో ఎన్నికల సందడి మొదలైంది. GHMCలో ఈ నెల 25న 15 మంది సభ్యులతో స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనున్నారు. BRS, BJP ఆసక్తి చూపకపోవడంతో ఎక్కువగా ఏకగ్రీవం కానున్నట్లు సమాచారం. కాంగ్రెస్, MIM నుంచి ఎక్కువ మంది సభ్యులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఇక రానున్న బల్దియా ఎన్నికలపై INC పెద్దలు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం విశేషం. ఇప్పటివరకు BRS 2, INC నుంచి ఇద్దరు నామినేషన్ వేశారు.
HYDలో చికెన్ ప్రియులకు అలర్ట్. నగరంలో ఇటీవల కల్తీ చికెన్‌ను గుర్తించిన పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
➢చికెన్ నాణ్యత విషయంలో జాగ్రత్త.
➢ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ ఆర్డర్ చేయడానికి ముందు తనిఖీ చేయండి.
➢వైన్ షాపుల పక్కనే విక్రయించే మాంసం విషయంలో మరింత జాగ్రత్త అవసరం.
➢చికెన్ విక్రయదారులపై అనుమానం వస్తే వెంటనే 100కు డయల్ చేయండి.
SHARE IT
HYD రాజేంద్రనగర్‌లోని NIRDలో కాంట్రాక్ట్ బేసిక్ కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ 02, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 9 పోస్టులు ఉన్నాయి. PG, PHD చేసి అనుభవం ఉన్నవారు అర్హులు. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 1,20,000, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ. 2,50,000 వేతనం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు నేడు చివరి రోజు.
LINK: http://career.nirdpr.in/
SHARE IT
రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉన్నాయి. 1,358 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 232 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 7,63,603 ఓటర్లు ఉన్నారు.
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన గచ్చిబౌలి ADE సతీశ్ కుమార్ ఇంట్లో ACB సోదాలు ముగిశాయి. శుక్రవారం రూ.50 వేలు తీసుకుంటుండగా అధికారులకు పట్టుబడ్డాడు. సోదాలు చేపట్టిన ACB ఏకంగా రూ. 100 కోట్ల వరకు స్థిర, చర ఆస్తులు ఉన్నట్లు అంచనా వేశారు. రెండు రోజులపాటు సోదాలు జరిపి ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరించారు. HYD, RR, కరీంనగర్లో స్థలాలు, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. సతీశ్‌ను రిమాండ్‌కు తరలించారు.
ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.
నల్గొండ (D) అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో చనిపోయిన కోళ్లను వేసినట్లు సోషల్ మీడియా ప్రచారంపై HYD జలమండలి స్పందించింది. ఇక్కడి నుంచి నీరు జంటనగరాలకు సరఫరా అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అయింది. కాగా స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. స్పెషల్ టీం నీటి పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో ప్రాథమికంగా ఎలాంటి అవశేషాలు లభించలేదని, ఆందోళన అవసరం లేదని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
Sorry, no posts matched your criteria.