India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన రతన్‌కుమార్(22)కు తుకారాంగేట్‌కు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఓయో లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భిణి కావడంతో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించగా.. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ అయ్యాడు.
✓ఫారం-12 నింపి, ఓటర్ కార్డు జత చేసి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ✓పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 15 లాస్ట్
✓మే 3 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ అందజేసిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్
✓18 ఏళ్ల వయసు ఉంటే నూతన ఓటరుగా దరఖాస్తు
✓ఏప్రిల్ 14లోపు నూతన ఓటర్ నమోదు
✓మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్
• ఈ మేరకు HYD రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ అనుదీప్ సూచించారు.
కాంగ్రెస్ పార్టీ.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడలో శనివారం నిర్వహించ తలపెట్టిన జన జాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ మేరకు శుక్రవారం ఆయన సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అగ్రనాయకత్వం ఈ సభ ద్వారా విడుదల చేస్తుందని అన్నారు.
హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణ థియేటర్ వద్ద పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఓ కారును ఆపి తనిఖీ చేయగా కారులో నుంచి రూ.40 లక్షలు నగదు బయటపడింది. ఇద్దరు వ్యక్తుల వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి, నగదును సీజ్ చేసినట్లు అబిడ్స్ పోలీసులు తెలిపారు.
BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతుల కష్టాలను తెలుసుకోవడం కోసం మాజీ సీఎం KCR పొలం బాట పడితే.. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి వెళ్లారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను పట్టించుకోవడానికి సమయం లేని సీఎంకు, IPL చూసేందుకు ఎలా టైం దొరికిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
HYD నగరంలో నీళ్ల ఢోకా లేకుండా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నగరానికి నాగార్జునసాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే రోజుకు దాదాపు 140 మిలియన్ లీటర్ల నీరు అధికంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి సాగర్, మే ఒకటి నుంచి ఎల్లంపల్లి ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.
ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD శివారు శంకర్‌పల్లి PS పరిధిలో జరిగింది. CI తెలిపిన వివరాలు.. మండల పరిధి మాసానిగూడ వాసి రాములు(35) వ్యవసాయం చేస్తుండేవాడు. కొన్ని రోజుల క్రితం అతడికి చికెన్ పాక్స్ (అమ్మోరు) వ్యాధి సోకడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే వాడు. ఇవాళ మధ్యాహ్నం తనపై బల్లి పడిందని, స్నానం చేసి వస్తానని చెప్పి తన పొలం వద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధికారులు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యతను తెలియజేసేలా అవగాహన నిర్వహించి చైతన్యం తేవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోలింగ్ శాతం పెంచడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్వీప్ నోడల్ అధికారి తెలిపారు.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోస్టర్లు ప్రత్యక్షమై కలకలం రేపుతున్నాయి. పోస్టర్లలో నాన్ లోకల్ వర్సెస్ లోకల్ అంటూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటలను కలవాలంటే 166 కిలోమీటర్లు ప్రయాణం చేసి హుజూరాబాద్ వెళ్లాలని.. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిని కలవాలంటే 59 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేవెళ్ల వెళ్లాలని.. కానీ BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అని ఇక్కడే మనతోనే ఉంటారని పోస్టర్లలో రాశారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉద్యోగులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఫారం-12డీ నింపి సంబంధిత నోడల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.