RangaReddy

News April 5, 2024

HYD: తప్పు చేస్తే వదిలిపెట్టం: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

image

ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా మంది వ్యక్తుల ప్రైవేటు సంభాషణ విన్న నీచ చరిత్ర కల్వకుంట్ల కుటుంబానికి దక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర కీలకంగా ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం తప్పు చేయకుంటే గుమ్మడికాయ దొంగల్లా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా తమ ప్రభుత్వం వదలిపెట్టదని హెచ్చరించారు.

News April 5, 2024

HYD: 10 లక్షల మందితో జన జాతర సభ: మంత్రి సీతక్క

image

దేశ ముఖ‌చిత్రాన్ని మార్చేసే కీల‌క‌మైన లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు తెలంగాణ గ‌డ్డ మీద నుంచి 10 లక్షల మందితో జంగ్ సైర‌న్ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. తుక్కుగూడ‌లో ‘జ‌న‌ జాత‌ర’ పేరిట రేపు నిర్వ‌హించే భారీ బ‌హిరంగ స‌భ‌లో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌నున్న 5 గ్యారంటీల‌ను కాంగ్రెస్ అగ్ర నాయ‌క‌త్వం ప్ర‌క‌టించ‌నుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు.

News April 5, 2024

ఉప్పల్‌కు వచ్చే వాహనదారులకు అలర్ట్..

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ VS చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ దృష్ట్యా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:30 వరకు ఉప్పల్ పరిధి ట్రాఫిక్ మళ్లించనున్నామని పోలీసులు తెలిపారు. మ్యాచ్ జరిగే సమయంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. లారీ, డంపర్, ఎర్త్ మూవర్స్, వాటర్ ట్యాంకర్లు, RMC ట్రక్, అన్ని ఇతర రకాల ట్రక్కులు, భారీ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

News April 5, 2024

HYD: 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఆర్.కృష్ణయ్య

image

కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈరోజు HYD కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జూన్‌లో పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టే పార్టీకే మద్దతు ఉంటుందన్నారు.

News April 5, 2024

HYD: వేసవి జాగ్రత్తలు!

image

✓రోజుకి కనీసం 4 లీటర్ల నీళ్లు తాగండి.
✓ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో తిరగవద్దు.
✓వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించండి.
✓షుగర్,బీపీ పేషెంట్లు మరింత జాగ్రత్తగా ఉండాలి.
✓వాంతులు, విరోచనాలు జరిగితే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
✓సొంత వైద్యం ఏ మాత్రం మంచిది కాదు.
✓వేసవిలో మద్యం శరీరానికి మరింత ముప్పు చేస్తుంది.
•HYD గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.

News April 5, 2024

హైదరాబాద్‌లో బయటపడుతున్న నోట్ల కట్టలు

image

ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.5.31 కోట్ల నగదు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. గడిచిన 24 గంటల్లో రూ.27.12 లక్షల నగదు, రూ.8.23 లక్షల విలువజేసే ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అటు నగదు, ఇతర వస్తువులపై 12 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిశీలించామన్నారు.

News April 5, 2024

HYD: బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

image

బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. హబీబ్‌నగర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. మీర్‌‌చౌక్ హెడ్‌ క్వార్టర్స్‌లో గోపి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సీతారాంబాగ్‌లో నివాసం ఉండే ఇతడు మార్చి 30న తమ కూతురిపై అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు హబీబ్‌నగర్‌ PS‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు గోపిని రిమాండ్‌కు తరలించారు.

News April 5, 2024

HYD: విచిత్రం.. చనిపోయిన టీచర్‌కు నోటీసులు

image

చనిపోయిన టీచర్‌కు నోటీసులు పంపిన విచిత్ర ఘటన ఇది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ ZPHSలో N.గీత స్కూల్‌ అసిస్టెంట్(సోషల్)గా విధులు నిర్వహించారు. 2020‌లో ఆమె బెస్ట్‌ టీచర్‌ అవార్డు కూడా అందుకొన్నారు. కానీ, దురదృష్టవశాత్తు క్యాన్సర్‌తో పోరాడి 2023, మే నెలలో చనిపోయారు. ఇది గుర్తించని విద్యాశాఖ అధికారులు 10వ తరగతి పేపర్లు దిద్దేందుకు రాలేదని షోకాజ్ నోటీసులు పంపడం గమనార్హం. ఇది చర్చనీయాంశమైంది.

News April 5, 2024

ఉప్పల్లో నేడు IPL మ్యాచ్.. స్పెషల్ బస్సులు

image

HYD ఉప్పల్లో నేడు SRH VS CSK మధ్య IPL మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ సా.6 గంటల నుంచి రా.11:30 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఘట్‌కేసర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, కొండాపూర్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, జీడిమెట్ల, KPHB తదితర ప్రాంతాల నుంచి బస్ సర్వీసులుంటాయని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు మెట్రో‌ టైమింగ్స్‌ కూడా పొడిగిస్తారు. SHARE IT

News April 5, 2024

HYD: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పునః ప్రారంభం?

image

HYD నగరంలో వాటర్‌కు డిమాండ్ పెరగడంతో ఉస్మాన్‌సాగర్ లైన్ నుంచి వచ్చే నీటిని శుద్ధి చేయడం కోసం 2 మాడ్యులర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పునః ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2 MLD, 3 MLD సామర్థ్యంతో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లను రూపొందించారు. వీటిని పునః ప్రారంభించడం ద్వారా డిమాండ్‌కు తగ్గట్లుగా నీటిని అందించే అవకాశం అందని అధికారుల అంచనా.