RangaReddy

News February 15, 2025

HYD: గచ్చిబౌలిలో అవినీతి అధికారి.. రూ. 100 కోట్లు!

image

లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన గచ్చిబౌలి ADE సతీశ్ కుమార్ ఇంట్లో ACB సోదాలు ముగిశాయి. శుక్రవారం రూ.50 వేలు తీసుకుంటుండగా అధికారులకు పట్టుబడ్డాడు. సోదాలు చేపట్టిన ACB ఏకంగా రూ. 100 కోట్ల వరకు స్థిర, చర ఆస్తులు ఉన్నట్లు అంచనా వేశారు. రెండు రోజులపాటు సోదాలు జరిపి ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరించారు. HYD, RR, కరీంనగర్‌లో స్థలాలు, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. సతీశ్‌ను రిమాండ్‌కు తరలించారు.

News February 15, 2025

ఎల్బీనగర్‌లో పోలీసుల కష్టాలు! (PHOTO)

image

ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.

News February 15, 2025

HYD: రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు.. వివరణ!

image

న‌ల్గొండ (D) అక్కంప‌ల్లి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్లో చనిపోయిన‌ కోళ్లను వేసిన‌ట్లు సోషల్ మీడియా ప్రచారంపై HYD జలమండలి స్పందించింది. ఇక్కడి నుంచి నీరు జంటనగరాలకు సరఫరా అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అయింది. కాగా స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. స్పెషల్ టీం నీటి పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో ప్రాథమికంగా ఎలాంటి అవశేషాలు లభించలేదని, ఆందోళన అవసరం లేదని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.

News February 15, 2025

HYD: 17న KCRపై స్పెషల్ సీడీ: తలసాని

image

ఈనెల 17న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో కేక్‌కట్ చేసిన అనంతరం కేసీఆర్ జీవిత విశేషాలతో ప్రత్యేక సీడీ విడుదల చేస్తామన్నారు.

News February 15, 2025

రంగారెడ్డి: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

image

రంగారెడ్డి కలెక్టరేట్లో తాగునీటి సరఫరాపై ఆ శాఖ అధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News February 15, 2025

HYD: అవినీతికి పాల్పడితే కాల్ చేయండి: ACB

image

గచ్చిబౌలి ఏడీఈ సతీష్ లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని సూచించారు. లేదా వాట్సప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

News February 15, 2025

HYD: వాటిని గుర్తిస్తే ఫిర్యాదు చేయండి: డీజీ

image

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్రమంగా మెడిసిన్ నిల్వలు, తయారీ, విక్రయాలు జరిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని డీజీ డీకే కమలాసన్ రెడ్డి సూచించారు. 18005996969కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం అందినా తమకు తెలియజేయాలని సూచించారు.

News February 15, 2025

మీర్పేట్: అధ్యక్షురాలికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ

image

మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉంటున్న తెలంగాణ జాగృతి నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు మిర్యాల పావనిని ఇవాళ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.

News February 15, 2025

HYD: ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటండి: ఎంపీ

image

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈనెల 17న ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వృక్షార్చన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడమే కేసీఆర్‌కు మనం ఇచ్చే పుట్టిన రోజు కానుక అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 

News February 14, 2025

HYD: కుంభమేళా టూర్.. యువకుడి మృతి (PHOTO)

image

ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు బయలుదేరిన రంగారెడ్డి జిల్లా వాసులు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొంగరకలాన్‌కు చెందిన వనం సంపత్ రాణా, వనం శ్రీనివాస్, చంద్రశేఖర్, రమేశ్, సాయి కారులో బయల్దేరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ శివారులో ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో <<15456821>>సంపత్ రాణా<<>> అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలు అయ్యాయి. మృతుడి ఫైల్ ఫొటో పైన చూడొచ్చు.