India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. HYD విశ్వనగరమని, పెట్టుబడులకు గమ్యస్థానమని అన్నారు. మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
HYDలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కై వాక్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.
RR జిల్లా గౌలిదొడ్డి గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు JEE అడ్వాన్స్ పరీక్షలో ప్రభంజనం సృష్టించారు. 99.03 పర్సంటైల్ సాధించి మణిదీప్ అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చరణ్ తేజ్, తేజస్విని, రామ్‌చరణ్, శ్రీనివాస్, భాను తేజ, నేహాలత, నిహారిక టాప్ ర్యాంకులు సాధించినట్లు రెసిడెన్షియల్ అధికారులు తెలిపారు. ఒకే పాఠశాల నుంచి ఇంత మంది టాప్ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు.
గచ్చిబౌలిలోని ప్రీజం పబ్‌లో బత్తుల ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు ప్రభాకర్‌ను ప్రశ్నించేందుకు గచ్చిబౌలి పోలీసులు 3మ రోజులు కోర్టు అనుమతి తీసుకున్నారు. కాగా.. ప్రభాకర్ విచారణలో పలు కీలక విషయాలు బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు.
మొయినాబాద్ SI (ప్రొబేషన్)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జబీనా బేగం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మక్త వెంకటాపూర్‌లోని ఓ పేద కుటుంబంలో పుట్టారు. పాఠాలు చెబుతూ పేదరికం అనే అడ్డు గోడలను దాటి అనుకున్నది సాధించారు. ‘నా విజయం.. నా స్నేహితులు వారి సహకారం, ప్రోత్సాహంతో సాధ్యమైంది’ అని పేర్కొన్నారు. ఆమె చెల్లెలు కూడా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారని వివరించారు.
GHMCలోని అడిషనల్, జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులను సందర్శకులు కలిసేందుకు సా. 4 నుంచి 5 గం.ల మధ్య కార్యాలయంలో ఉండాల్సిందేనని GHMC కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని పనిదినాల్లో ప్రజల వేదనలు వినేందుకు, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కార్యాలయంలో ఉండాలన్నారు.ఒకవేళ ఎవరైనా అనివార్య కారణాలతో ఉండటం సాధ్యం కాకపోతే అడిషనల్ కమిషనర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడి కేసులో ఇప్పటివరకు పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 14 మంది పరారీలో ఉన్నారు. వీరిలో భద్రాచలం వద్ద మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
అభిలాష ఉన్నవారికి ఉచితంగా సంగీతం, నృత్య శిక్షణ ఇస్తున్నామని వీఎస్. జనార్దనమూర్తి అన్నారు. గానసభలో 5 రోజుల పాటు సంగీత, సాహిత్య కార్యక్రమాల ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గానసభ లలిత కళలకు నిత్యం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా సంగీత గురువు మల్లాది ఉష్ణ బృందం ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత కార్యక్రమం అద్భుతంగా సాగింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ విద్యుత్‌శాఖ ఏఈ మురళీకృష్ణ సూచించారు. ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే ఉపయోగాలు సూచించారు. ప్యానెల్స్‌ను అనుసంధానించి ఇంట్లో ఏర్పాటు చేసిన మీటర్ ద్వారా వినియోగించగా మిగిలిన విద్యుత్ డిస్కంలకు సరఫరా అవుతుంది. డిస్కంలతో ఒప్పందం ప్రకారం 6 నెలలకు ఒకసారి లెక్కేసి ఖాతాలో నగదు జమ చేస్తారు. #SHARE IT
మైనర్ బాలుడు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్‌లోని ఆరెంజ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలుడు మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.