India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా కాంగ్రెస్ గెలవదని, అన్నీ BRSయే గెలిచి చూపిస్తామని గతంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి అన్నారు. అన్నట్టుగానే మొత్తం 7 స్థానాల్లో BRSని గెలిపించి చూయించారు. మల్కాజిగిరి గడ్డ BRS అడ్డా అని చెబుతున్న ఆయన.. మరి పార్లమెంట్ ఎన్నికల్లో BRS అభ్యర్థిని గెలిపించి తన మార్క్ చూయిస్తారా లేదా చూడాలి. మీ కామెంట్?
ఇటీవల ఆస్ట్రేలియాలో హత్యకు గురైన హైదరాబాద్ మహిళ శ్వేత అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఆస్ట్రేలియా నుంచి నగరానికి చేరుకున్న శ్వేత మృతదేహాన్ని ఏఎస్‌రావు నగర్ డివిజన్ బృందావన్ కాలనీలోని ఆమె తల్లిదండ్రులను నివాసానికి తరలించారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మల్లాపూర్‌లోని వైకుంఠధామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని సైబర్ నేరగాళ్లు పోలీసుల తరహాలో మాట్లాడుతూ మోసగిస్తున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు సూచిస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ X వేదికగా పలు సూచనలు చేశారు. డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని ఫోన్ కాల్స్, ఐవీఆర్ కాల్స్ వస్తే స్పందించొద్దని సజ్జనార్ సూచించారు. ఒకవేళ ఇలాంటి ఉదంతాల్లో మోసపోతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. కాగా HYDలో ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి.
ఓ అమ్మాయి విషయమై ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన ఘటన అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద జరిగింది. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ వాసులు నితిన్, ఓ యువతి ప్రేమించుకోగా రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబీకులు చెప్పారు. దీంతో యువతి HYD వచ్చింది. ఇక్కడ పంజాగుట్ట వాసి బాబీ ఆమెకు పరిచయమవగా అతడిని ప్రేమించింది. ఆమె ఫోన్‌లో వాట్సాప్ చాట్ చూసిన బాబీ నితిన్‌ను పిలిపించి దాడి చేశాడు.
హోలీ పండగను సంప్రదాయాలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని HYD, ఉమ్మడి RR జిల్లా పోలీసులు కోరారు. సోమవారం హోలీ సందర్భంగా జిల్లాలోని పట్టణాల ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బందోబస్తు, ప్రధాన రహదారుల్లో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరిశీలన నిర్వహిస్తున్నామని, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా పండగ జరుపుకోవాలని ఆయా జిల్లాల పోలీసులు కోరారు.
అభివృద్ధికి పాటుపడతానని కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. HYD శేరిలింగంపల్లిలో ఇన్‌ఛార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. BRS పార్టీ చతికిల పడిందని అన్నారు. BJPని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని MCH భవనంలో పిల్లలకు, గర్భిణులకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 600 నుంచి 800 వరకు ప్రసవాలు జరుగుతున్నట్లు డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. 300 నుంచి 400 వరకు గైనిక్ సమస్యలు ఉన్నవారు ఓపీ తీసుకుంటున్నారని అన్నారు. గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనాలకు మాత శిశు సంరక్షణ భవనాలకు అనుసంధానం చేసేలా స్కైవాక్ వంతెన ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందెశ్రీ దంపతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఆదివారం ఘనంగా సన్మానించి అభినందిచారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ.. రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకే అందజేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
ఓ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన KPHBలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్‌కు చెందిన ఓ యువతి(30) సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి సంబంధించి KPHBలో ఆన్‌లైన్ శిక్షణకు చేరింది. ఈక్రమంలో ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు నరేందర్ కుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం శిక్షణ సహచరుడు సంతోష్‌కు తెలపగా అతడు కూడా ఆమెను వేధించాడు. దీంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. నరేందర్, సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హోలీ పండగను పురస్కరించుకుని సోమవారం HYDలోని సాలార్జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని మ్యూజియం పరిపాలన అధికారి పి.నాగేశ్వరరావు ఒక ప్రకటనతో తెలిపారు. కావున పర్యాటకులు ఎవరు కూడా మ్యూజియానికి రావద్దని పేర్కొన్నారు. మళ్లీ మంగళవారం నుంచి మ్యూజియం యథాతధంగా తెరిచి ఉంటుందన్నారు. కావున ఈ విషయాన్ని పర్యాటకులు గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.