RangaReddy

News March 25, 2024

HYD: శిల్పారామంలో మైమరిపించిన నాట్యం

image

కళాకారులు భరతనాట్య ప్రదర్శనతో సందర్శకులను ఆకట్టుకున్నారు. HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న వారాంతపు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఐశ్వర్యవల్లి శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శనతో అలరించారు. పుష్పాంజలి, గరుడగమన, పంచమూర్తి కౌతం, జతిస్వరం, గణేశపంచరత్న, చండ్రచూడ శివశంకర, మురళీధర కీర్తనం, దశావతారం, అదివో అల్లదివో తదితర ప్రదర్శనలతో అలరించారు.

News March 25, 2024

HYD: టీవీ నటులకు పురస్కారాల ప్రదానం

image

ప్రాచీన లలిత కళలు.. మన భారతీయ శాస్త్రీయ సంగీత, నృత్య జీవన సాంప్రదాయ కళలని, వాటిని పరిరక్షించుకోవాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ సూచించారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ రమణారావు అధ్యక్షతన HYD రవీంద్రభారతిలోని ప్రధాన మందిరంలో శివరాత్రి స్వర్ణ నంది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. టీవీ నటులకు పురస్కారాలు అందించారు.

News March 25, 2024

HYD: రాష్ట్రంలో 12 MP సీట్లు గెలుస్తాం: ఈటల

image

BRS, కాంగ్రెస్‌కి ఓటేస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమేనని BJP మల్కాజిగిరి MP అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్‌లో BJP జిల్లా రూరల్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. రాహుల్‌కి, మోదీకి పోలిక ఉందా? నక్కకు నాగలోకానికి ఉన్న తేడా అని ఎద్దేవా చేశారు. మోదీ హయాంలో ఒక్క స్కామ్ లేదని, ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేశారన్నారు. రాష్ట్రంలో 12 MP సీట్లు గెలుస్తామన్నారు.

News March 24, 2024

HYD: కడుపు కోసి.. దారుణంగా చంపాడు..!

image

HYD బాలానగర్‌లో <<12918850>>యువకుడు ప్రణీత్ తేజ<<>> (20)ను స్నేహితుడే చంపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మద్యం తాగుదామని తీసుకెళ్లిన స్నేహితుడు.. ప్రణీత్‌ మత్తులోకి జారుకున్నాక మెడ, కడుపు కోసి చంపేశాడు. అనంతరం సైకో లాగా కడుపులోని పేగులను బయటకు తీశాడు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

News March 24, 2024

HYD: బేగంబజార్‌లో రూ.25 లక్షలు పట్టివేత

image

ఎన్నికల నేపథ్యంలో HYD బేగంబజార్ విష్ణు ఫైర్ వర్క్ సమీపంలో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా యాదాద్రి జిల్లాకు చెందిన కిరణ్ రెడ్డి, కళ్లెం జంగారెడ్డి యాక్టివాపై రావడంతో ఆపి తనిఖీలు నిర్వహించారు. వారి వద్ద రూ.25 లక్షలు లభించగా డబ్బులకు సంబంధించిన ఎలాంటి పత్రాలను చూపకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. అనంతరం డబ్బులను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు.

News March 24, 2024

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో చండీ హోమం

image

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఆదివారం చండీ హోమం వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఆలయ వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు రామతీర్థశర్మ, పూజారులు చండీ హోమంను కనుల పండువగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం అనంతరం ఆలయ సిబ్బంది భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

News March 24, 2024

HYD: బాలానగర్‌లో యువకుడి దారుణ హత్య

image

ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన HYD బాలానగర్ PS పరిధిలో ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలానగర్ పరిధి APHB కాలనీలోని ఖాళీ ప్రదేశంలో ఉన్న ఓ బస్సులో స్థానికంగా నివాసం ఉండే పులి ప్రణీత్ తేజ అనే యువకుడిని అతడి స్నేహితుడే మద్యం మత్తులో నమ్మించి చంపేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 24, 2024

HYD: సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి: ఆర్.కృష్ణయ్య

image

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం HYD విద్యానగర్‌లో ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని ఆయన కోరారు. గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, గవ్వల భరత్ పాల్గొన్నారు.

News March 24, 2024

మైనార్టీల ఇలాకా ‘హైదరాబాద్’ పార్లమెంట్

image

HYD ఎంపీ పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర, మలక్‌పేట, కార్వాన్ శాసనసభ నియోజకవర్గాల్లో అధికంగా మైనార్టీ ఓటర్లు ఉంటారు. దీనికి తగ్గట్టే 1984 నుంచి ఎంఐఎం నేత సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ గెలవగా ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఇతర పార్టీల అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోతున్నారు. ఈసారి కూడా అసదుద్దీన్‌ గెలుస్తారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. 

News March 24, 2024

HYD మెట్రో స్టేషన్లలో ఇదీ పరిస్థితి..!

image

HYDలోని వివిధ మెట్రో స్టేషన్లలో టాయిలెట్ల వినియోగానికి ఛార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రో స్టేషన్లలో టాయిలెట్‌ను ఉపయోగించుకునేందుకు డబ్బులు వసూలు చేయడం ఆపి వేయాలని, ఉచితంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పరిశీలించి మెట్రో ప్రయాణికులందరికీ మేలు చేసే నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?