RangaReddy

News August 18, 2024

HYD: వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించటం ఇక సులువు!

image

HYDలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నూతన టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు. రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్ ద్వారా వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడవచ్చని అధికారులు తెలిపారు. దీనిని తాడుతో పంపుతారని, 100 కేజీల బరువు వరకు లాగుతుందని తెలిపారు. రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.

News August 18, 2024

HYD: 33KV విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు

image

HYD మెట్రో జోన్ పరిధిలో 18, రంగారెడ్డి జోన్ పరిధిలో 25, మేడ్చల్ జూన్ పరిధిలో 18 చొప్పున కొత్తగా 33KV ఉపకేంద్రాలను ఏర్పాటుకు చీఫ్ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళిక రచించారు. గృహ, వాణిజ్య, మాల్స్ నిర్మాణాల దూకుడుతో విద్యుత్ వినియోగం ఏటేటా పెరుగుతుండడంతో రాబోయే రోజుల్లో డిమాండ్ తట్టుకునేందుకు వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు స్థలాలను కేటాయించాలని కలెక్టర్లకు ఇంజినీర్లు లేఖ రాశారు.

News August 18, 2024

HYD: ఫైర్ ఇంజిన్ అద్దెకు బుక్ చేసుకోవడం ఇక ఈజీ..!

image

HYDలో కార్నివాల్, నుమాయిష్, ఎల్బీ స్టేడియంలో మ్యాచ్, సభలు, వివాహ, ఇతర వేడుకలు, సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారా.. అయితే అక్కడ అగ్నిప్రమాదాల నివారణకు ఫైరింజిన్లను అద్దెకు తీసుకోవచ్చు. గంటలు, రోజుల చొప్పున అద్దె చెల్లించి సేవలు పొందొచ్చని అగ్నిమాపక శాఖ తెలిపింది. నూతనంగా 8 అధునాతన పంపులను కొనుగోలు చేశారు. ఫైర్ ఇంజిన్ https://fire.telangana.gov.in/WebSite/standby.aspx ద్వారా బుక్ చేసుకోండి.

News August 18, 2024

HMDA పరిధి పార్కులు, చెరువుల సుందరీకరణపై ఫోకస్

image

HMDA పరిధిలో చెరువులు, పార్కుల సుందరీకరణపై అధికారులు ఫోకస్ పెట్టారు. చెరువుల సుందరీకరణకు రూ.22 కోట్లు, కొత్తగా 15 ఫారెస్టు బ్లాకుల ఏర్పాటు, నర్సరీల పెంపునకు నిధులు రూ.75 కోట్లు, కొత్త పార్కుల్లో థీమ్స్ అభివృద్ధి, సరస్సుల సుందరీకరణ, పాత పార్కుల్లో థీమ్స్ మార్పుకు రూ.144కోట్లు, గోల్డెన్ మైన్స్ వే 20 ఎకరాల్లో మయూరినగర్ అమీన్‌పూర్ రాక్ గార్డెన్ నిర్మాణం, కాలనీ పార్కులకు రూ.46 కోట్లు వెచ్చించనున్నారు.

News August 18, 2024

GHMC పరిధిలో మీడియన్ గార్డెనింగ్ పనులు

image

మోడల్ కారిడార్ల పొడవునా అలంకరణ జాతులకు చెందిన మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా అధికారులు నాటుతున్నారు. శేరిలింగంపల్లి, చార్మినార్ జోన్ల పరిధిలోని రోడ్డు విభాగినులపై వరుసగా 1.13 లక్షలు, 70 వేలు, కూకట్‌పల్లి జోన్ రహదారులపై 18 వేల మొక్కలను నాటనున్నారు. ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో 38,400 మొక్కలను నాటుతున్నారు.

News August 18, 2024

HYD: దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా HCU

image

హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం(HCU)మరొక అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. విదేశీ విద్యార్థులకు అనువైన టాప్ 12% యూనివర్సిటీల్లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ విలువలు కలిగిన విశ్వవిద్యాలయాలకు స్టడీ అబ్రాడ్ ఎయిడ్ సంస్థ ఇచ్చిన 2024 ర్యాంకింగ్‌లో భారతదేశం నుంచి అత్యుత్తమ ర్యాంకు పొందిన విశ్వవిద్యాలయంగా హెచ్‌సీయూ నిలిచింది.

News August 18, 2024

HYD: నగరంలో ఖర్చులు పెరుగుతున్నాయ్..!

image

HYDలో జీతం పెరగట్లేదు కానీ.. ఖర్చులు ఎక్కువేనని సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా సామాన్యుడి జీవితం మారుతోంది. ఉద్యోగ, ఉపాధి కోసం పట్నం బాటపట్టే ఎంతో మంది, చాలీచాలనీ జీతాలతో నెట్టుకొస్తున్నారు. ఇంటి ఖర్చులు, రవాణా,విద్య,వైద్యం ఇలా రోజు వారీ ఖర్చులు గణనీయంగా పెరుగుతుండటంతో, వచ్చే జీతం డబ్బులు ఏ మూలకు సరిపోవడం లేదని అంటున్నారు.మరి మీరేమంటారు..? కామెంట్ చేయండి.

News August 18, 2024

HYD: మూలన పడ్డ వాటర్ ఏటీఎంల పరిస్థితి ఏంటి..?

image

GHMC ఆరేళ్ల క్రితం ఎల్బీనగర్, అమీర్‌పేట్, పాతబస్తీ, ఖైరతాబాద్, మలక్‌పేట్, హైటెక్ సిటీ, మియాపూర్, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. ఒక్కోదానికి రూ.6.50 లక్షలు వెచ్చించి, నీటి శుద్ధి పరికరాలను కొనుగోలు చేసింది. రూ.5కు 10 లీటర్ల చొప్పున మొదట నీరు అందించినా.. ప్రస్తుతం ఉప్పల్ సహా అనేక చోట్ల మూలన పడ్డాయనే విమర్శలు వస్తున్నాయి. 

News August 18, 2024

HYD: కూకట్‌పల్లిలో వ్యభిచారం.. పోలీసుల రైడ్స్  

image

స్పా ముసుగులో వ్యభిచారం, అనుమతులు లేకుండా స్పా నిర్వహిస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కూకట్‌పల్లి KPHB నాలుగో రోడ్డులో స్పార్కిల్ పేరిట స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఏహెచ్‌టీయూ బృందం శనివారం కేంద్రంపై దాడి చేసింది. ఐదుగురు మహిళలు, టెలికాలర్, మేనేజర్, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని KPHB పోలీసులకు అప్పగించారు.

News August 18, 2024

HYD: ఈనెల 20న టీహబ్‌లో ప్రత్యేక సమావేశం

image

హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ హబ్‌లో ఈనెల 20వ తేదీ మ.3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సౌత్ ఏషియన్ విమెన్ ఇన్ టెక్ (ఎస్ఏడబ్ల్యూఐటీ), టీహబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ‘ప్రాక్టికల్ ఇన్సైట్స్ ఇన్స్టూ డిప్లొయింగ్ జనరేటివ్ ఏఐ మోడల్స్’ అనే అంశంపై సమావేశం జరగనుందన్నారు.