RangaReddy

News February 11, 2025

HYD: మూసీకి రూ.37.50 కోట్లు కేటాయింపు!

image

మూసీ నది అభివృద్ధి సంస్థకు రూ.37.50 కోట్లు కేటాయిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 1,500 కుటుంబాలను గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.25,000 అందించనున్నట్లు పేర్కొన్నారు.

News February 11, 2025

HYD: ట్యాంకర్ బుకింగ్ కోసం కాల్ చేయండి

image

వేసవి దృష్ట్యా జలమండలి అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏ ప్రాంతంలో ట్యాంకర్లు ఎక్కువగా బుక్ చేస్తున్నారో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఆ ప్రాంతాల జాబితాను స్థానిక అధికారులకు అందించి అదనపు ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేసవిలో బుక్ చేసుకున్న రోజే ట్యాంకర్ వస్తుందని, బుకింగ్ కోసం 155313కి కాల్ చేయాలని సూచించారు. దళారులను నమ్మి మోసపొవద్దని హెచ్చరించారు.

News February 11, 2025

HYD: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

image

HYD ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులపాటు రద్దవుతున్నట్లు ప్రకటించిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి భువనగిరి, కాజీపేట్, పెద్దపల్లి, కాగజ్‌నగర్ వెళ్తుంది. మళ్లీ 15న సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News February 11, 2025

HYD: ప్రజాసదుపాయం కోసం స్పెషల్ డ్రైవ్: GHMC

image

ఆక్రమణలలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు GHMC అధికారులు తెలిపారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులతో కలిసి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ నుంచి జనవరి వరకు ఎల్బీనగర్‌లో 11, శేరిలింగంపల్లిలో 243, సికింద్రాబాద్‌లో 81, కూకట్‌పల్లిలో 42, చార్మినార్‌లో 211, ఖైరతాబాద్ 156 ఆక్రమణలను తొలగించారు.

News February 10, 2025

HYD: నుమాయిష్‌కు 80వేల మంది

image

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు భారీగా తరలివెళ్తున్నారు. జనవరి 3న ప్రారంభమైన నుమాయిష్‌కు లక్షల సంఖ్యలో సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో 80 వేల మంది నుమాయిష్‌ను సందర్శించినట్లు పేర్కొన్నారు. కాగా.. ఈనెల 15న నమాయిష్ ముగియనుంది.

News February 10, 2025

రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

image

రంగారెడ్డి జిల్లా కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. రెడ్డిపల్లిలో 14.2℃, తాళ్లపల్లి 14.5, చందనవెల్లి 14.7, చుక్కాపూర్‌ 14.8, ఎలిమినేడు, కాసులాబాద్‌ 15.5, రాజేంద్రనగర్ 15.7, రాచలూరు, కేతిరెడ్డిపల్లి, తొమ్మిదిరేకుల 15.9, కొందుర్గ్, వెల్జాల 16.1, ప్రోద్దటూర్, సంగెం 16.3, వైట్‌గోల్డ్ SS 16.4, కడ్తాల్, మంగళపల్లి 16.5, యాచారం, మీర్‌ఖాన్‌పేట 16.7, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, కందువాడలో 16.8℃గా నమోదైంది.

News February 10, 2025

శంషాబాద్ నుంచి కుంభమేళాకు తరలివెళ్తున్న ప్రజలు

image

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు భారీగా ప్రజలు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు వృద్ధులు, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలను ఏర్పాటు చేశారు. ఆదివారం అంతర్జాతీయ విమాన సర్వీసులో 84,593 మంది ప్రయాణించినట్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.

News February 10, 2025

HYD: అలా చేస్తే.. మీ భరతం పడతాం: హైడ్రా

image

HYD నగరం సహా, ORR వరకు అనుమతులు లేకుండా రోడ్లపై, రోడ్లకు ఇరుపక్కలా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తే వారి భరతం పడతామని హైడ్రా హెచ్చరించింది. ఇటీవల శంషాబాద్‌లో భారీ హోర్డింగ్ తొలగించినట్లు దీనికి ఉదహరించింది. ఎక్కడైనా ప్రమాదకరమైన హోర్డింగులు ఉంటే తమ దృష్టికి తేవాలని హైడ్రా కోరింది. ఎక్కడికక్కడ కఠిన చర్యలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది.

News February 10, 2025

HYD: అలా చేస్తే.. మీ భరతం పడతాం: హైడ్రా

image

HYD నగరం సహా, ORR వరకు అనుమతులు లేకుండా రోడ్లపై, రోడ్లకు ఇరుపక్కలా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తే మీ భరతం పడతామని హైడ్రా హెచ్చరించింది. ఇటీవల శంషాబాద్‌లో భారీ హోర్డింగ్ తొలగించినట్లు ఉదహరించింది. ఎక్కడైనా ప్రమాదకరమైన హోర్డింగులు ఉంటే తమ దృష్టికి తేవాలని హైడ్రా కోరింది. ఎక్కడికక్కడ కఠిన చర్యలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది.

News February 10, 2025

HYD: ఫిబ్రవరి 15తో ముగియనున్న నుమాయిష్‌

image

HYD నాంపల్లిలో జనవరి 3న 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్) ప్రారంభమైంది. ఫిబ్రవరి 15తో ఈ ప్రదర్శనకు తెరపడనుందని నిర్వహకులు తెలిపారు. మరో 2 రోజుల పాటు ప్రదర్శనను కొనసాగించేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎగ్జిబిషన్ సొసైటీ కోరింది. కానీ HYD సీపీ సీవీ ఆనంద్‌ ఇందుకు నిరాకరించారు.