India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) ట్యాంపరింగ్ అవ్వవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ మరోసారి స్పష్టం చేశారు. భారత ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసిందని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా క్యారేజ్ వే ఆక్రమణలను తొలగించారు. హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ ఆధ్వర్యంలో తొలగింపు పనులు చేపట్టారు. అలాగే అనుమతులు లేకుండా సైరన్‌లు ఉపయోగిస్తున్న వారిపై చర్యలకు దిగారు. అనుమతి లేని సైరన్‌లను తీసివేస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా సైరన్లు ఉపయోగిస్తే చర్యలు ఉంటాయన్నారు.
నాంపల్లిలోని గాంధీ భవన్‌లో టీపీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపీ వీ.హనుమంతరావు తదితర నాయకులు ఉన్నారు.
HYD నగరంలో పేరుగాంచిన KBR పార్కులో నెమళ్ల సంఖ్య ఎంతో తెలుసుకోవాలనుకుంటే వచ్చేనెల 3వ తేదీ వరకు ఆగాల్సిందే. జాతీయ పక్షులు పార్కులో ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు ఇటీవల సర్వే నిర్వహించారు. ఆ వివరాలను డిసెంబర్ 3వ తేదీ ప్రకటిస్తామని పార్క్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గతేడాది KBR పార్కులో 565 నెమళ్లు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
సమగ్ర కుల గణనతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మాజీ పీసీసీ చీఫ్ హనుమంతరావు అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో మాట్లాడారు. ‘రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ప్రజలందరిపై ఉంది. కేవలం రాహుల్ గాంధీ కాకుండా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనగదొక్కి తమ సొంత భావాలను అమలు చేస్తుంది’ అని మండిపడ్డారు.
మతోన్మాద విద్వేష శక్తుల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకుందామని వామపక్షాలు పిలుపునిచ్చాయి. బాగ్‌లింగంపల్లిలోని SVKలో “మతోన్మాద, విద్వేష శక్తుల నుంచి HYDను కాపాడుకుందాం” అని వామపక్షాల నగర సదస్సును నిర్వహించారు. గత కొంతకాలంగా నగరంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మత ఘర్షణలు జరగాలని కొన్ని మతతత్వ శక్తులు కోరుకుంటునట్లు ఉందని CPM నేత శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై 10 రోజుల్లోనే ఇండ్ల నిర్మాణ అనుమతులు పొందవచ్చు. తాజాగా HMDA ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా పెండింగ్ అప్లికేషన్లకు వారం రోజుల్లోనే క్లియరెన్స్ ఇవ్వనున్నారు. గతంలో అనుమతుల కోసం 2 నుంచి 3 నెలల సమయం పట్టేదని.. ప్రజల కోసం ఈ ప్రక్రియ వేగవంతం చేసినట్లు ‘తెలంగాణ కాంగ్రెస్’ ట్వీట్ చేసింది.
SHARE IT
హైదరాబాద్‌లో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్‌లెస్ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్‌లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.
ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్లు తెరిచి ఉంచే సమయాన్ని పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం. కుమార్ భద్రతా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. అందరి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తార్నాక నుంచి శివం రోడ్ వైపుగా వెళ్లే రహదారిలో గేట్లను రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. ప్రస్తుతం ఈ గేట్లను రాత్రి ఎనిమిది గంటలకే మూసి వేస్తున్నారు. SHARE IT
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో సూరారం కాలనీ, రామాలయంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడికి భక్తులు అన్నాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచి భక్తుల సందడితో ఆలయం కిటకిటలాడాయి. ఇక్కడి శివలింగం అన్నం, పెరుగుతో భక్తులకు దర్శనమిచ్చారు. దీన్నే సాయంత్రం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
Sorry, no posts matched your criteria.