India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెక్కాడితేగానీ డొక్కాడనివి నిరుపేదల జీవితాలు. పొట్టకూటి కోసం శ్రమను నమ్ముకుని ఏదో ఓ పని చేస్తుంటారు. అయితే చాలా మంది తమ చదవుకునే పిల్లలను వెంట తీసుకెళ్తూ బాలకార్మికులుగా మార్చడం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి దృశ్యాలు HYD మహానగరంలో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి పేదల పట్ల సానుకూలంగా స్పందించి ఉన్నత చదువులతో జీవితానికి బాటలు వేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 21 సీట్లతో ఉండే ఏసీ లగ్జరీ మినీబస్, 9 సీట్లు నాలుగు బెర్తులు కలిగిన ఏసీ క్యారవాన్ వెహికల్ సేవలను గత ఏడాది కాలంలో అందుబాటులోకి తెచ్చిందని తెలంగాణ టూరిజం అధికారులు తెలిపారు. HYD, RR, MDCL జిల్లాలకు చెందిన ప్రజలు కుటుంబం మొత్తం కలిసి టూర్లకు వెళ్లేందుకు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవచ్చని, ఇందుకోసం 9848540371కు కాల్ చేసి సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్‌లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 21 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నవారే 70 శాతానికి పైగా ఉండడం గమనార్హం. వీరిలో బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ సైతం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 51-150 మిల్లీగ్రాములు ఆల్కహాల్ ఉన్నట్లుగా తేలింది. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపోద్దని, ఒకవేళ నడిపితే కటకటాల్లోకి వెళ్తారని పోలీసులు హెచ్చరించారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కులగణనపై తన అభిప్రాయం వెల్లడించారు. కులాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో క్యాటగిరీలో ఉన్నాయని, ఈ నేపథ్యంలో కులగణన లెక్కలు కేంద్ర పరంగా ఉండటం కంటే, రాష్ట్రాలపరంగా తీస్తేనే సముచితంగా ఉంటుందన్నారు. HYD కొత్తపేటలో కులగణన శాస్త్రీయ అవగాహన ప్రోగ్రాంలో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ, అంతరాలు లేని సోషలిజం బతుకు నెరవేరలేదన్నారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. చర్లపల్లి, ఉప్పల్, కందుకూరు, ఎల్బీనగర్ సహా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సైకిళ్లపై వెళ్లి ప్రజలు, యువతను కలిసి యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలు, డయల్ 100, ఉమెన్ సేఫ్టీ, సోషల్ మీడియాలో మోసాలపై వివరిస్తున్నారు. మహిళా పోలీసులు సైతం ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
HYDలోని రెడ్ హిల్స్ వద్ద ఉన్న సూరన ఆడిటోరియంలో భారత రాజ్యాంగ తెలుగు అనువాద పుస్తకావిష్కరణ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి DSP చీఫ్ డాక్టర్ విశారదన్ మహారాజ్ పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ స్ఫూర్తిని అణువణువునా నింపుకొని, భారత పౌరులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సికింద్రాబాద్ పరిధిలో ఇండియన్ ఆర్మీ సెలబ్రేషన్స్ నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు. DMDE డైరెక్టర్ అశ్వని కుమార్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. త్రివిధ దళాల అధిపతులు, సిబ్బంది, అధికారుల సేవలు వెలకట్టలేనివన్నారు. దేశ భద్రత కోసం వారందరూ, ఉక్కు పిడికిలితో అనునిత్యం పోరాటం చేస్తున్నారన్నారు.
HYD ప్రజలు నాగార్జునసాగర్ టూర్ వెళ్లేందుకు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ టూర్లో 274 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బుద్ధవనం, మనోహరమైన శిల్పాలు, గౌతమ బుద్ధుడి స్ఫూర్తి దాయకమైన జీవిత కథను ప్రదర్శించే ప్రత్యేకమైన బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్‌లో గడపొచ్చాన్నారు. www.tourism.telangana.gov.in ద్వారా టూర్ బుక్ చేసుకోవాలని సూచించారు.
HYD ట్యాంక్‌బండ్ ఐమ్యాక్స్ పక్కన ఉన్న గ్రౌండ్‌లో ప్రపంచ మత్స్యకార ఉత్సవ ముగింపు ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించిన మంత్రి, చేపల వంటకాల గురించి అడిగి తెలుసుకున్నారు. చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, మత్స్యకారుల సేవలు వెలకట్టలేనివని అభినందించారు.
HYDలో జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజ్ పైపులైన్ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే.. జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఈ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని ఎండీ అశోక్ రెడ్డి ప్రజలను కోరారు.
Sorry, no posts matched your criteria.