RangaReddy

News November 25, 2024

HYD: అక్రమ కనెక్షన్లపై ఫిర్యాదు చేయండి: MD

image

HYDలో జ‌ల‌మండ‌లి అధికారుల నుంచి అనుమ‌తి లేకుండా అక్రమంగా తాగునీటి నల్లా, సీవ‌రేజ్ పైపులైన్ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. అక్రమ నల్లా, సీవ‌రేజ్ కనెక్షన్లు గుర్తిస్తే.. జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఈ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని ఎండీ అశోక్ రెడ్డి ప్రజలను కోరారు.

News November 25, 2024

HYD: నేడే రవీంద్రభారతిలో బీసీల రణభేరి: ఆర్.కృష్ణయ్య

image

BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య 18 డిమాండ్లతో బీసీ రణభేరి మహాసభ నేడు రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అన్ని పార్టీల నాయకులను ఈ సభకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం, పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, అసెంబ్లీలో 50% రిజర్వేషన్ల అమలు, కేంద్ర జనగణనలో కులగణన వంటివి తమ డిమాండ్లలో ఉన్నాయని తెలిపారు. బీసీలందరం ఏకమవుదాం అన్నారు.

News November 25, 2024

HYDలో పెరిగిన చలి.. జాగ్రత్త!❄

image

HYD, ఉమ్మడి RR జిల్లాల్లో చలి విపరీతంగా పెరిగింది. గత 3 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలిగాలులు వీస్తున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున‌ వరకు మంచు అలుముకుంటోంది. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు‌ ఈ సమయాల్లో బయటకురాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్త!
SHARE IT

News November 24, 2024

HYD: ‘బఫర్‌ జోన్‌లో హైడ్రా కమిషనర్ ఇల్లు’.. క్లారిటీ

image

హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ ఇల్లు బఫర్‌ జోన్‌లో ఉందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘మధురానగర్‌లోని మా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. 44 ఏళ్ల క్రితం మా నాన్న కట్టించిన ఇంట్లోనే ఉంటున్నాను. 25 ఏళ్ల క్రితం చెరువులో కృష్ణకాంత్‌ పార్క్‌‌ నిర్మించారు. మా ఇంటికి ఒక కిలో మీటర్ దూరంలో ఉంది. మధ్యలో వేలాది ఇండ్లు ఉన్నాయి’ అని స్పష్టం చేశారు.

News November 24, 2024

HYD: మహిళపై SI వేధింపులు..!

image

HYDలోని ఓ SI వేధిస్తున్నారని గృహిణి సీపీ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ప్రకారం.. ‘నా భర్త వేధింపులు తాళలేక PSలో ఫిర్యాదు చేశాను. అందులోని నా మొబైల్ నంబర్ తీసుకుని SI పర్సనల్ మెసేజులు చేస్తూ వేధిస్తున్నారు’ అని వాపోయారు. ‘నీ కేసు నేను పరిష్కరిస్తా.. మీ ఇంటికి వస్తా’ అంటూ అసభ్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.

News November 24, 2024

జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు గడువు పొడిగింపు

image

గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు గడువు ఈ నెల 28 వరకు పొడిగించినట్లు సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఈ నెల 25 కాగా శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవు అయినందున చాలా మంది డీడీలు తీయలేక పోయినట్లు తెలుస్తోందని, అందుకే మరో మూడు రోజులు పొడగించినట్లు నిర్వాహకులు చెప్పారు.

News November 24, 2024

GHMCలో కుక్కల బోన్లు చూశారా..?

image

గ్రేటర్ HYDలోని ఆరు జోన్ల పరిధిలో అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ప్రత్యేకంగా కుక్కల జైళ్ల మాదిరి బోన్లు అందుబాటులో ఉంచారు. కుక్కల బెడదపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కుక్కలకు వ్యాక్సినేషన్ అందించి, వ్యాధులు ఉన్న కుక్కలను గుర్తించి వాటిని ఇక్కడ ఉంచి వైద్యం అందిస్తున్నారు. మరికొన్నింటికి స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 24, 2024

HYD: 15 ఏళ్లు దాటితే సీజ్ చేయండి: మంత్రి

image

15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేయాలని ఖైరతాబాద్‌లో జరిగిన మీటింగ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్‌నెస్, ఇన్స్యూరెన్స్, RC సహా అన్ని పత్రాలు చెక్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 వేల స్కూల్ బస్సులపై నివేదిక ఇవ్వాలన్నారు. 62 రవాణా శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు, మౌలిక వసతులపై నివేదిక సిద్ధం చేయాలన్నారు.

News November 24, 2024

HYDలో బీసీ కమిషన్ బహిరంగ విచారణ పూర్తి

image

HYD కలెక్టరేట్‌లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ పూర్తయింది. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి రిజర్వేషన్లు కల్పించే అంశంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పలు సామాజిక వర్గాలకు చెందిన వారు, వినతి పత్రాలు సైతం అందించినట్లుగా HYD కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారు.

News November 24, 2024

కోటి దీపోత్సవంలో పాల్గొన్న మంత్రి దంపతులు

image

HYDలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కోటి దీపోత్సవాన్ని కార్తికమాసం వేళ అద్భుతంగా నిర్వహించడంతో మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికత ఉట్టిపడుతుందని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.