RangaReddy

News August 14, 2024

HYD: సీఎంను కలిసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు

image

అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

News August 14, 2024

HYD: సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణకు ఆహ్వానం

image

మణికొండలోని కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వివిధ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 20వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News August 14, 2024

HYD: రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కృషి: MLA

image

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలను విజయవంతంగా ముగించుకుని రాష్ట్రనికి రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో సీఎంకు ఎమ్మెల్యే పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెట్టుబడులే లక్ష్యంగా సీఎం పర్యటన సాగిందన్నారు.

News August 14, 2024

HYD: మెట్రో పెయిడ్‌ పార్కింగ్‌పై L&T కీలక ప్రకటన

image

మెట్రోస్టేషన్‌లలో <<13848700>>పెయిడ్‌ పార్కింగ్‌పై<<>> L&T బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 25 నుంచి నాగోల్‌ మెట్రో స్టేషన్‌లో వాహనాల పార్కింగ్‌కు ఫీజును వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి మియాపూర్‌ మెట్రోస్టేషన్‌లో పార్కింగ్‌కు ఫీజులు వసూలు చేయనున్నట్లు చెప్పింది. అయితే, పార్కింగ్‌ ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాల కోసమే పెయిడ్‌ పార్కింగ్‌ను అమలులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది.

News August 14, 2024

సికింద్రాబాద్: సీఎం సహకారం అందించాలి: కేంద్రమంత్రి

image

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) ఫలాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం కిషన్ రెడ్డి సీఎంకి లేఖ రాశారు. సొంతిల్లు అవసరమున్న ప్రజలు లక్షలాదిమంది ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే ఇళ్లను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు

News August 14, 2024

HYD: రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ వినియోగం

image

రాష్ట్రంలో విద్యుత్ గరిష్ఠ డిమాండు వినియోగం రాబోయే 8ఏళ్లలో భారీగా పెరుగుతాయని కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ ) అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రోజువారీ నమోదైన 15,701 మెగావాట్ల గరిష్ఠ డిమాండుకు ఏటా 5.5 నుంచి 7.6% చొప్పున అదనంగా పెరుగుతుందని తెలిపింది. రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రోజువారీ గరిష్ఠ విద్యుత్ డిమాండు 15,704 మెగావాట్లు ఉండగా.. 2031-32లో 27,050 మెగావాట్లకు చేరుతుందని అంచనా.

News August 14, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగింది ఇలా!

image

సీఎం రేవంత్ రెడ్డి HYD శంషాబాద్ చేరుకున్నారు. విదేశీ పర్యటనలో 50 రౌండ్ టేబుల్ సమావేశాలు, మరోవైపు నెట్ జీరో సిటీ, AI సిటీ, స్కిల్ యూనివర్సిటీ, MSRD ప్రణాళికపై వివరణ, అంతేకాక AI, డేటా సెంటర్స్‌ వంటి ఆధునిక సాంకేతిక రంగాలకు చెందిన కంపెనీలతో పాటు ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, కాస్మటిక్స్ , టెక్స్‌టైల్‌, ఎలక్ట్రిక్‌ వాహనరంగాలకు చెందిన ప్రతినిధులతో సంప్రదింపులు జరిపినట్లు CMO తెలిపింది.

News August 14, 2024

HYD: క్షణాల్లో కోట్లు పోతున్నాయ్.. జర జాగ్రత్త..!

image

HYD నగరంలో క్షణాల్లో కోట్లు మాయమవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాదారులకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ఇటీవలే ఈ కేటుగాళ్లను HYD పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వృద్ధుడికి మాయ మాటలు చెప్పి ఏకంగా రూ.5.4 కోట్లు బ్యాంకు ఖాతా నుంచి మాయం చేశారు. ఆసీఫ్‌నగర్ ప్రాంతంలోనూ ఈ ఘటనలు జరిగాయి. జర జాగ్రత్త..!

News August 14, 2024

HYD: జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు

image

అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఫిర్యాదు ఇచ్చిన 10 నెలల తర్వాత ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. మూసివేసిన పాత ఇనుప దుకాణాన్ని తిరిగి తెరిచేందుకు లంచం తీసుకోవడమే కాకుండా మరింత కావాలని డిమాండ్ చేశారని వచ్చిన ఫిర్యాదుతో సీబీఐ హైదరాబాద్ విభాగం స్పందించింది. జీఎస్టీ సూపరింటెండెంట్ వి.డి.ఆనంద్ కుమార్, ఇన్‌స్పెక్టర్ మనీశ్ శర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News August 14, 2024

HYD: నిమ్స్‌లో ఏడాదిలో 300 రోబో చికిత్సలు

image

రోబో చికిత్సలు ప్రవేశపెట్టిన ఏడాదిలోనే 300 వరకు శస్త్రచికిత్సలు చేసిన అరుదైన ఘనతను నిమ్స్ వైద్యులు సొంతం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్న పేద రోగులకు ఉచితంగా, ఇతర రోగులకు తక్కువ ఖర్చుతోనే ఈ సేవలందిస్తున్నారు. గతంలో కార్పొరేట్ ఆసుపత్రులకు పరిమితమైన ఈ రోబోటిక్ సేవలను గతేడాది ఆగస్టులో దాదాపు రూ.30 కోట్లతో నిమ్స్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ఎక్కువ శాతం ఈ సేవలు పేదలకే అందుతున్నాయి.