RangaReddy

News August 13, 2024

హైకోర్టుకు మెడికల్ అడ్మిషన్ల స్థానిక వివాదం

image

రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు స్థానికత వివాదం మళ్లీ హైకోర్టుకు చేరింది. మెడికల్ నిబంధనలను సవరిస్తూ రూల్స్ 3A చేర్చి ప్రభుత్వం గత నెల 19న జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆరాధే వాదనలు విని, ప్రతివాదులైన వైద్యఆరోగ్యశాఖ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 14కు వాయిదా వేశారు.

News August 13, 2024

HYD: ఎంబీబీఎస్ సీట్ల దరఖాస్తు గడువు పెంపు

image

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద సీట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు పొడిగిస్తున్నట్లు కాళోజీ విశ్వవిద్యాలయం తెలిపింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్‌కు మంగళవారం సాయంత్రం 6 గంటలతో గడువు ముగియనుంది. తాజాగా గడువును మరో రెండు రోజులు పెంచుతున్నట్లు వెల్లడించారు.

News August 13, 2024

HYD: రెండేళ్లలో SLBC టన్నెల్ పనులు పూర్తి: మంత్రి

image

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని కట్టడి చేయడంతో పాటు 4 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన SLBC టన్నెల్ పనులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ ఒహాయోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మానుఫ్యాక్చరింగ్ కంపెనీని సందర్శించి మాట్లాడారు.

News August 13, 2024

HYD: బీజేపీ లీడర్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు!

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసపై రాష్ట్ర BJP నాయకుడు బొక్కా బాల్‌రెడ్డి ప్రశ్నించారు. అయితే, తనకు పాకిస్థాన్ కోడ్ గల(+92)వాట్సాప్ నంబర్ల‌తో బెదిరింపులు వస్తున్నట్లు తెలిపారు. 12, 13న పదే పదే పాకిస్థాన్ నంబర్ల నుంచి కాల్ చేశారన్నారు. హిందువుల కోసం మాట్లాడితే ఇబ్బందులు పడతావని బెదిరించారన్నారు. ఈ విషయమై ఆయన రాజేంద్రనగర్ పీఎస్‌లో మంగళవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

News August 13, 2024

RR: లంచం తీసుకుంటూ దొరికిన అడిషనల్ కలెక్టర్

image

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పని చేస్తున్న అవినీతి అధికారులు పట్టుబడ్డారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డారు. ధరణిలో మార్పులు చేసేందుకు రైతు నుంచి రూ. 8 లక్షలు డిమాండ్ చేసి దొరికిపోయారు. భూపాల్ రెడ్డి ఇంట్లో రూ. 16 లక్షల నగదు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

News August 13, 2024

HYD: వైన్స్‌ వద్ద‌ సిట్టింగ్‌ తొలగించాలని డిమాండ్

image

రాష్ట్రంలోని వైన్‌షాపుల వద్ద అక్రమ సిట్టింగులను తొలగించాలని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జీవో 25 ప్రకారం వైన్‌షాప్‌ పర్మిట్‌ గది 100 చదరపు మీటర్లు ఉండాలన్నారు. ఎలాంటి బెంచీలు, కుర్చీలు, తినుబండారాలు లేకుండా నిర్వహించాలని పేర్కొన్నారు.

News August 13, 2024

HYD: బిగ్‌ అలర్ట్.. మరో గంట పాటు వర్షం

image

హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. తాజాగా వాతావరణ కేంద్రం అధికారులు నగరవాసులను అప్రమత్తం చేశారు. మరో గంట పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ముషీరాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్‌లో‌ వర్షం నీళ్లు రోడ్ల మీదకు వచ్చి చేరడంతో‌ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా అత్యవసరమైతే 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని‌ జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

News August 13, 2024

హైదరాబాద్: బంద్‌కు పిలుపు.. భారీ స్పందన

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పలు సంఘాలు బంద్‌కు పిలుపునిస్తున్నాయి. సోమవారం హయత్‌నగర్‌, వికారాబాద్‌, కీసర తదితర చోట్ల భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. నేడు నగరంలోని‌ పలు డివిజన్‌ల బీజేపీ నాయకులు‌ ర్యాలీలో పాల్గొనాలని కోరారు. నవాబుపేట, బొంరాస్‌పేటలో ఉదయం నుంచే అన్ని వ్యాపార వర్గాల వారు బంద్‌కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.

News August 13, 2024

HYD: గ్రేటర్‌లో విజృంభిస్తున్న డెంగ్యూ

image

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. దోమ కాటుకు గురై చిన్నారులు, యువకులు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో భారీగా కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీటితోపాటు సరైన వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలో కూడా దీని బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు.

News August 12, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓వరల్డ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే వడ్డీ తక్కువ: భువనగిరి ఎంపీ
✓HYD: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కానిస్టేబుల్ బిడ్డ కావేరి
✓ఉమ్మడి జిల్లాలలో హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం
✓రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థకు HYD వినియోగదారుల కమిషన్ జరిమానా
✓కాంగ్రెస్ పార్టీ అసమర్థత స్పష్టమవుతుంది: ఎమ్మెల్యే వివేకానంద
✓రాష్ట్రపతి భవన్ నుంచి ఆకర్షణకు పిలుపు