RangaReddy

News November 20, 2024

HYD: కమ్యూనిటీ హాళ్లలోనే అనేక స్కూళ్లు..!

image

HYD జిల్లా పరిధిలో అనేక ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్లలోనే పాఠశాలలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 691 పాఠశాలలు ఉండగా 68 పాఠశాలలు కమ్యూనిటీ హాళ్లలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పలుచోట్ల ఒక గది పాఠశాలలు సైతం ఉండడం గమనార్హం. HYD నగర పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి, వసతులు మెరుగుపరచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

News November 20, 2024

HYD: FAKE మెడిసిన్ అమ్మితే కాల్ చేయండి!

image

HYD నగరంలో ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మెడికల్ దుకాణాలపై తనిఖీలను ముమ్మరం చేశారు. నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే, చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. HYD, RR, MDCL, VKB జిల్లాలో ఎక్కడైనా ఫేక్ మెడిసిన్ కానీ, MRP ధరకు మించి అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే తమకు 18005996969కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. ఉ.10:30 నుంచి సా.5 వరకు అందుబాటులో ఉంటుందన్నారు.

News November 20, 2024

HYD: మొదటి దశలో అభివృద్ధి చేసే చెరువులు ఇవే!

image

గ్రేటర్ HYD పరిధిలో 185 చెరువుల అభివృద్ధి కోసం హైడ్రా ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ అప్పా చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, నిజాంపేట ఎర్రకుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఖాజాగూడ చెరువు, అంబర్పేట బతుకమ్మ కుంట, మాదాపూర్ తమ్మిడికుంట, చందానగర్ ఈర్ల చెరువును మొదటి దశలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

News November 20, 2024

HYDకు రాష్ట్రపతి.. మాదాపూర్‌లో డ్రోన్‌లు నిషేధం

image

ఈ నెల 21, 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము HYDలో పర్యటిస్తారు. 22న హైటెక్‌‌సిటీ శిల్పకళా వేదికలో లోక్ మంతన్-2024 కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రెసిడెంట్‌ టూర్‌ నేపథ్యంలో CYB పోలీసులు అప్రమత్తమయ్యారు. మాదాపూర్ PS పరిధిలో డ్రోన్లు ఎగరేయడాన్ని నిషేధించారు.ఈ ఆదేశాలు నవంబర్ 22 వరకు అమల్లో ఉంటాయన్నారు. పోలీసుల ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ CP అవినాష్ మహంతి హెచ్చరించారు. SHARE IT

News November 19, 2024

HYD: ప్రజావాణి కార్యక్రమంపై మేయర్ సమీక్ష

image

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఈరోజు సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఎటువంటి అలసత్వం వహించకుండా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు.

News November 19, 2024

HYD: కుక్కల బెడదే కాదు.. కోతుల బెడద తగ్గట్లే..!

image

కుక్కల బెడదతో ఓవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుంటే.. HYD శివారు, ORR పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు కోతుల బెడదతో అల్లాడి పోతున్నారు. కుక్కలు, కోతుల బెడద రెండూ ఉన్నట్లు మున్సిపాలిటీ ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా ఘట్కేసర్, కీసర, నాగారం మేడ్చల్, పెద్దఅంబర్‌పేట్, గౌరెల్లి, గండిగూడ, తుక్కుగూడ, రావిర్యాల, ఆదిభట్ల, తుర్కయంజాల, రాంపల్లిలో కోతుల సంచారం పెరిగింది. మీ ప్రాంతంలో కూడ కోతుల సమస్య ఉందా?

News November 19, 2024

HYDలో వెహికల్ ఫిట్నెస్ కేంద్రాల ఏర్పాటు..!

image

HYD ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఇక నుంచి వాహనాల ఆటోమేటెడ్ ఫిట్నెస్ చెకింగ్ కోసం 5-6 కేంద్రాల ఏర్పాటుపై వేగం పెంచింది. మల్కాజిగిరి, తిరుమలగిరి సహా, ఇబ్రహీంపట్నం మరికొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం దాదాపుగా రూ.8 కోట్ల మేర వ్యయం కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

News November 19, 2024

గ్రేటర్ HYDలో 44% కుల గణన పూర్తి!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 44% కులగణన సకుటుంబ సర్వే పూర్తయినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 11,10,883 కుటుంబాల సర్వే పూర్తయినట్లు పేర్కొంది. నోడల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు సర్వే తనిఖీ చేస్తున్నారని పేర్కొంది. ప్రజలందరూ సకుటుంబ సర్వేకు సహకరించాలని, సర్వే 100% పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అటు అధికారులను ఆదేశించింది.

News November 19, 2024

HYD: వాటర్ హీటర్ల మోత.. పెరుగుతున్న వినియోగం

image

HYDలో చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో వాటర్ హీటర్లను అధికంగా వినియోగంతో కరెంట్ వినియోగం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. నగరంలో సరాసరిగా కరెంటు వినియోగం ఏకంగా 23% పెరిగింది. సైబర్ సిటీ ఏరియాలో 33%, మేడ్చల్ పరిధిలో 31% కరెంట్ వినియోగం పెరిగినట్లు వెల్లడైంది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఏరియాల్లోను 20% కరెంటు వినియోగం పెరిగింది.

News November 19, 2024

గ్రేటర్ HYD రోడ్డు నెట్వర్క్ లెక్క ఇదే..!

image

గ్రేటర్ HYDలో దాదాపుగా 9,000 KMపైగా రోడ్డు నెట్వర్క్ ఉంది. ఇందులో సుమారు 3,000 కి.మీ బీటీ రోడ్లు, 6,000 కి.మీ పైగా సీసీ రోడ్లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో CRMP రోడ్లు నిర్మించారు. ప్రస్తుతం 150KM రోడ్డు నెట్వర్క్ నిర్మాణం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రోడ్ల నిర్మాణంపై రీబౌండ్ హ్యామర్ టెస్ట్, CSC, తార్ డెన్సిటీ పరీక్షలు కరవయ్యాయని పలు పరిశోధనల్లో తేలింది.