RangaReddy

News November 17, 2024

ALERT: హైదరాబాద్ ఫుడ్ డేంజర్!

image

HYDలోని రెస్టారెంట్లలో క్వాలిటీ తగ్గుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఇందుకు నిదర్శనం. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో HYD కల్తీలో నం.1 అని సర్వే పేర్కొంది. ఏకంగా 62% హోటళ్లు గడువు ముగిసిన ఆహార పదార్థాలు కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు పేర్కొంది. గడిచిన 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు నగరంలో నమోదు కావడం గమనార్హం. దీంతో GHMC అప్రమత్తమైంది. అన్ని హోటల్స్‌లో తనిఖీలు చేపట్టింది.

News November 17, 2024

GROUP-3 EXAM: HYDలో‌ సెంటర్ల వివరాలు

image

గ్రూప్-3 పరీక్షకు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 115 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 65,361మంది అభ్యర్థులు పరీక్ష హాజరుకావాల్సి ఉంది. రంగారెడ్డిలో 103 పరీక్ష కేంద్రాల్లో 56,394 మంది, హైదరాబాద్‌లో 102 కేంద్రాల్లో 45,918 మంది పరీక్ష రాయనున్నారు. మూడు జిల్లాల్లోనే ఏకంగా 1,67,673 మంది పోటీలో ఉండటం విశేషం. 10 AMకు పరీక్ష. గంట ముందే చేరుకోండి.

ALL THE BEST

News November 17, 2024

HYD: గ్రూపు-3 పరీక్షలకు అదనపు బస్సులు

image

ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్‌-3 పరీక్షల కోసం అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వినోద్‌కుమార్‌ తెలిపారు. ఉదయం, సాయంత్రం 2 విడతలుగా జరగనున్న పరీక్షల సమయానికి అనుగుణంగా ఉదయం 10 గంటల్లోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొనేలా బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. పరీక్షల అనంతరం సాయంత్రం తిరిగి గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు.

News November 16, 2024

HYD: సినీ ప్రముఖుల నివాసాల్లో సర్వే

image

హైదరాబాద్‌ మణికొండలో సర్వే ఫారమ్‌లను కలిగి ఉన్న ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేటర్లు సర్వే నిర్వహించారు. ఈ నేపథ్యంలో మణికొండలోని ట్రెయిల్స్ విల్లాస్‌లో సినీ ప్రముఖులు సాయికుమార్, అలీ ఇంటికి వెళ్లి అధికారులు సర్వే చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న సర్వేకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

News November 16, 2024

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు భద్రత పెంపు

image

లగచర్ల దాడి ఘటనను దృష్టిలో పెట్టుకొని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు భద్రతను పెంచింది. కలెక్టర్‌పై దాడి నేపథ్యంలో పోలీస్ శాఖ అదనంగా ఇద్దరు ఏఆర్ గన్‌మెన్లను కేటాయించింది. అధికారులపై దాడి ఘటన తర్వాత అప్రమత్తమైన ప్రభుత్వం ఆఫీసర్లకు భద్రత పెంచేందుకు కృషి చేస్తుందని అధికారులు తెలిపారు.

News November 16, 2024

సకుటుంబ సర్వేను పరిశీలించిన HYD కలెక్టర్

image

సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని HYD జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శనివారం బేగంపేట్‌లోని మయూరి మార్గ్‌లో కొనసాగుతున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ సోమయ్య, ఎన్యుమరేటర్లతో మాట్లాడి ఆరా తీశారు. కుటుంబ సభ్యుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. అన్ని వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు.

News November 16, 2024

HYD: మీ పట్టుదలకు సలాం..! లక్ష్యంపై కసి అంటే ఇదే!

image

అన్ని బాగున్నా.. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే ప్రస్తుత రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద జరిగిన క్రీడా పోటీల్లో ఏకంగా దివ్యాంగులు బాస్కెట్ బాల్ క్రీడలో సత్తా చాటి వారెవ్వా అనిపించారు. క్రీడాకారుల పట్టుదలను చూసిన ప్రజలు సలాం కొట్టారు. ఇది కదా.. అసలైన పోటీ అంటే, అనుకున్న కల కోసం కాళ్లు లేకున్నా కడదాకా పోరాడుతామని రుజువు చేశారని వారిని అభినందించారు.

News November 16, 2024

HYD: ‘ఈనెల 16న కలెక్టరేట్లు, ఆర్‌డీఓ, తహశీల్దార్ కార్యాలయాల ముట్టడి’

image

రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16న కలెక్టరేట్లు, ఆర్‌డీఓ, తహసీల్వార్‌ కార్యాలయాలను ముట్టిడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం కాచిగూడ హోటల్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల స్కాలర్‌షిఫ్‌లను రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచాలని అన్నారు.

News November 16, 2024

HYD: MNJ డాక్టర్ కీలక సూచన

image

HYD ప్రజలకు MNJ ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాస్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు సూచనలు చేశారు. అధిక శాతంగా ఉప్పు, పదేపదే వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్ తీసుకోవడం, పొగ, మద్యం గుట్కా, కైనిమసాలా, పాన్ నమలటం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. బరువు నియంత్రణలో పెట్టుకోవాలని, రెడ్ మీట్ బదులుగా చికెన్, చేపలు, గుడ్లు తీసుకోవడం మంచిదని సూచించారు.

News November 16, 2024

కోటి దీపోత్స‌వంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతలు 

image

సీఎం రేవంత్‌రెడ్డి కోటి దీపోత్స‌వంలో పాల్గొన్నారు. సమాజం అంతా సుఖశాంతులతో ఉండాల‌ని, ఇలాంటి పూజ కార్యక్రమం చేపట్టడం సంతోషక‌రం అని తెలిపారు. కార్తీకమాసం వస్తే శివయ్య భక్తులు హైదరాబాద్ వైపు చూసేలా ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో తెలంగాణకు మేలు జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.