RangaReddy

News November 15, 2024

గచ్చిబౌలి: రోడ్డు ప్రమాదంలో మరణించింది వీరే..!

image

నిన్న రాత్రి 2 గంటల సమయంలో గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద వేగంగా బైక్ నడిపిన దేవ కుమార్ స్వామి(25), వెంకన్న స్వామి(30) డివైడర్‌ను ఢీకొని మృతిచెందిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు వారి ఫోటోలను విడుదల చేశారు. మరోవైపు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన గచ్చిబౌలి పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 15, 2024

HYD: నెల నెలా పెరుగుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య

image

HYD నగర మెట్రో ప్రయాణికుల సంఖ్య ప్రతి నెల నెల పెరుగుతూ వస్తోంది. జూలై నెలలో 1.44 కోట్ల మంది ప్రయాణించగా.. ఆగస్టులో 1.45 కోట్ల మంది ప్రయాణించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. అది కాస్త అక్టోబర్ నాటికి 1.5 కోట్లకు దాటింది. ఈ నేపథ్యంలో మెట్రో అధికారులు లాస్ట్ మైలు కనెక్టివిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

News November 15, 2024

HYD: హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

image

కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. కాగా, లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి ఘటనలో భాగంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

News November 15, 2024

గోల్కొండ కోటలో ‘ఆకలి’

image

500 ఏళ్ల నాటి గోల్కొండ కోటను చూడటానికి వెళితే ఆకలితో అలమటించాల్సిందే. ఎంతో ఆశతో కోటను చూడటానికి వెళ్లిన పర్యాటకులకు అక్కడ తినడానికి ఏమీ దొరకదు. కోట లోపల కేవలం ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. బయటి నుంచి ఆహారం తీసుకెళ్లేందుకు కూడా అనుమతి లేదు. కోట చుట్టూ తిరగడానికి కనీసం నాలుగు గంటలు పడుతుంది. అధికారులు ఇప్పటికైనా ఈ విషయం గురించి ఆలోచించాలని పర్యాటకులు కోరుతున్నారు.

News November 15, 2024

కీసర గుట్టకు ప్రత్యేక జిల్లా బస్సులు

image

కీసర గుట్టకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి నుంచి సిటీ బస్సులే కాకుండా వికారాబాద్, వరంగల్, సిద్దిపేట సహా పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మరోవైపు నగరం నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే కీసర గుట్ట వద్ద భక్తులు బారులు తీరారు.

News November 15, 2024

HYD: రాత్రిళ్లు మహిళల అసభ్య ప్రవర్తన.. హెచ్చరిక

image

హైదరాబాద్‌లోని ప్రధాన సర్కిళ్లలో పురుషుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా చైతన్యపురి PS పరిధిలో రాత్రి సమయంలో దారిన పోయే వ్యక్తులను ఇబ్బంది పెడుతున్న 9 మంది మహిళలను సరూర్‌నగర్ తహశీల్దార్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఇక మీదట ఇలా ప్రవర్తిస్తే రూ.2 లక్షల జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని MRO హెచ్చరించారు.
SHARE IT

News November 15, 2024

కార్తీకపౌర్ణమి: HYDలో అంతా శివోహం!

image

కార్తీకపౌర్ణమి సందర్భంగా HYDలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. దీపాలు వెలిగించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఆలయాల్లో‌ లింగాలను అందంగా అలంకరించారు. శివుడికి రుద్రాభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. కీసర, శ్రీశైలం స్వామివార్లను దర్శించుకునేందుకు వందలాది మంది నగరం నుంచి‌ బయల్దేరుతున్నారు.

News November 15, 2024

HYD: ఓపెన్ డిగ్రీ, PG చేయాలనుకునేవారికి నేడు లాస్ట్ ఛాన్స్!

image

డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 15 వరకు అవకాశం ఉందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వర్సిటీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, అంతకు ముందు వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం శుక్రవారం www.braou.ac.in ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.SHARE IT

News November 15, 2024

HYD: GHMC ఎన్నికల నాటికి విలీనం జరిగేనా..?

image

జీహెచ్ఎంసీ పాలకమండలి గడవు 2026 ఫిబ్రవరి 10తో ముగియనుంది. ORR వరకు 4 గ్రేటర్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఇటీవలే మంత్రి వెంకటరెడ్డి అన్నారు. ఇప్పటికే.. ORR లోపలి 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. అధికారులు గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. మరీ 2026 GHMC ఎన్నికల నాటికి మున్సిపాలిటీల విలీనం, కార్పొరేషన్ల ఏర్పాటు జరుగుతుందో వేచి చూడాలి.

News November 14, 2024

HYD: మీకు చికెన్, మటన్ షాప్ ఉందా..? జాగ్రత్త..!

image

HYDలో వేలాదిగా చికెన్, మటన్ షాపులు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. చికెన్ కట్ చేసే సమయంలో ఈగలు వాలటం, అపరిశుభ్రత కారణంగా పలువురు అస్వస్థత గురయ్యారు.దీనిపై జీహెచ్ఎంసీ వెటర్నరీ, హెల్త్ అధికారులు తనిఖీలు చేసి జరిమానా విధించారు. షాప్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.